Healthy Hair: మెంతులు మరియు ఉల్లిపాయ తో జుట్టు ఆరోగ్యంగా మరియు జుట్టు యొక్క రక్తప్రసరణ పెరుగుతుందని శాస్త్రీయంగా రుజువు చేసారు.
మెంతులు (Healthy Hair):
Healthy Hair: మెంతులు జుట్టు ను ఆరోగ్యంగా ఉంచడం లో తోడ్పడుతాయి. 1972 లో ఫ్రాన్స్ దేశస్థులు మెంతుల మీద పరిశోధన చేసారు. కొన్ని అనేక కారణాలు జుట్టు కుదుళ్ల యొక్క రక్తప్రసరణ వ్యవస్థని డ్యామేజ్ చేస్తుంటాయి, మెంతులు ఈ డ్యామేజ్ ను నివారించడానికి బాగా ఉపయోగపడుతాయి, మెంతులలో విటమిన్ బి3 (నికోటినిక్ యాసిడ్) ఉంటుంది, అది జుట్టు రక్తప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది.
1)మెంతులని పేస్ట్ చేసి జుట్టు కి బాగ పట్టిస్తే బాగా పెరుగుతుంది.
2)మెంతుల పేస్ట్ కి పెరుగు కలిపి జుట్టు కి పట్టిస్తే జుట్టు హైడ్రేట్ గా ఉంటుంది.
3) మెంతులని దోరగా వేయించి పొడి చేసి దానికి కొబ్బరి నూనె కలిపి జుట్టు కుదుళ్ల కి పట్టిస్తే డిహైడ్రేట్ అవకుండా మరియు రక్తప్రసరణ బాగా అయ్యేట్లు చేస్తుంది.
ఉల్లిపాయ (Healthy Hair):
2002 లో ఇరాక్ వాళ్లు ఉల్లిపాయ మీద పరిశోధన చేసారు.
ఈ ఉల్లిపాయ జుట్టు కుదుళ్ల లో ఉండే కెరాటిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఈ ఉల్లిపాయ లో ఉండే సల్ఫర్ జుట్టు గ్రోత్ కి బాగా తోడ్పడుతుంది.
ఉల్లిపాయ ని గ్రైండ్ చేసి ఆ రసాన్ని జుట్టు మాడు కి పట్టించి ఒక 20నిమిషాలు ఉంచుకోవాలి, తరువాత తలస్నానం చేయాలి, దీని వల్ల జుట్టు కుదుళ్లు హెల్తి గా ఉండడానికి, ఊడిన జుట్టు తిరిగి రావడానికి మరియు జుట్టు గ్రోత్ బాగుండడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.