సినిమా

Nandamuri Balakrishna Birthday (10th June): నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు – పలువురి ట్వీట్లు

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna Birthday Wishes on Twiter:

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పలు పోస్టులు పెట్టారు.

‘మిత్రుడు బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ – మెగాస్టార్‌ చిరంజీవి.

‘పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ – తారక్‌

Nandamuri Balakrishna

‘ లెజండ్‌ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారికి జన్మదిన శుభాకాంక్షలు. ‘అఖండ’ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను’ – నాగశౌర్య

‘నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ – సురేందర్‌ రెడ్డి

‘నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సినిమాలతో వినోదాన్ని పంచాలని.. సేవా కార్యక్రమాలతో ప్రపంచానికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా.’ – భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌

ఇది కూడా చదవండి : ఫిట్ బిట్ అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్