Aasara Pension Age : తెలంగాణలో తగ్గించిన వయోపరిమితిని అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో కొత్త వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త వృద్ధాప్య పెన్షన్ ప్రక్రియ ప్రారంభమైంది, ఆసరా పెన్షన్ తగ్గించిన (Aasara Pension Age) వయోపరిమితిని అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో కొత్త వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
అర్హులైన వాళ్ళు ఈ నెల 31 లోగా ఈ సేవ లేదా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసి కమిషనర్లకు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది, ఆసరా పెన్షన్ వయస్సు (Aasara Pension Age) 65 ఏళ్ల నుంచి 57 తగ్గింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దరఖాస్తుదారుల పేరు పై మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి కి మూడు ఎకరాలు నుంచి ఉండరాదు.
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రెండు లక్షలు మించి ఉండకూడదు, ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారులు ఉన్న పెన్షన్ కి అర్హులు కారు.
ఓటరు కార్డ్ మీద సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయస్సు నిర్ధారిస్తారు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పెన్షన్ కి అర్హులు, ప్రభుత్వ ఉద్యోగులు స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు ఈ పెన్షన్ కు అనర్హులు.