Dalitha Bandhu Huzurabad : దళితబంధు కోసం 470 మంది దరఖాస్తు చేసుకుంటే 40 మంది ని ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకం పంపిణీ అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది, హుజురాబాద్ (Dalitha Bandhu Huzurabad) నియోజకవర్గ వ్యాప్తంగా 21 వేల కుటుంబాలను అర్హులుగా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం.
మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు వేల కుటుంబాలకు దళితబంధు ని ఇవ్వాలని భావించింది ప్రభుత్వం, అయితే ఈ నేపథ్యంలోనే అర్హులకు దళితబంధు రావడం లేదంటూ దళితులు ఆందోళనకు దిగుతున్నారు. దళితబంధు పై నిన్నటి నుంచి హుజరాబాద్ లో ఆందోళనలు చేశారు దళితులు.
అర్హులకు ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు దళితులు, హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దళితుల ఆందోళన కొనసాగుతోంది, అటు ఇల్లందుకుంట మండలం కేంద్రంలోనూ దళితులు ర్యాలీ నిర్వహించారు.
దళితబంధు కోసం 470 మంది దరఖాస్తు చేసుకుంటే 40 మంది ని ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపికయిన వారిలో ఎక్కువ శాతం స్థానికులు లేరని, బయట వారే ఉన్నారని మండిపడుతున్నారు. దళితుల ప్రతి ఒక్కరికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్ రావడంతో నేరుగా రంగంలోకి దిగిన మంత్రి హరీష్ రావు, సిఎస్ కరీంనగర్ లోని సమీక్ష నిర్వహించనున్నారు.
దళిత బంధు పై ఆందోళనలు, సీఎం సభ, అర్హుల ఎంపిక పై ఈ సమావేశంలో చర్చించనున్నారు, ఎల్లుండి హుజురాబాద్ కు సీఎం కెసిఆర్ రానున్న నేపథ్యంలో దళితుల ఆందోళనలు టిఆర్ఎస్ పార్టీ నేతల్లో టెన్షన్ రేపుతున్నాయి.