బిజినెస్

ICICI Home Loan : ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లు లేకపోయినా హోమ్ లోన్ గ్యారెంటీ

ICICI Home Loan
ICICI Home Loan : మీ డ్రీమ్ హౌస్ కొనడానికి గృహ రుణం కోసం ఎదురుచూస్తున్నారా, ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లు లేకపోయినా హోమ్ లోన్ గ్యారెంటీ.

మీ డ్రీమ్ హౌస్ కొనడానికి గృహ రుణం కోసం ఎదురుచూస్తున్నారా? కానీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ పత్రాలు లేవా? మరి ఏం పర్వాలేదు ఇలాంటి వారి కోసం ఐసిఐసిఐ బ్యాంకు (ICICI Home Loan) సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

ఐటిఆర్ దాఖలు చేయని వారికి అండగా ఉండటానికి ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ కీలక ప్రకటన విడుదల చేసింది, గృహ రుణాలను పొందేందుకు నిబంధనల సడలింపు ఇస్తూ ఒక ప్రకటన చేసింది.

ICICI Home Loan

ఆదాయపు పన్ను రిటర్న్ లేని పత్రాలు లేని చిన్న, మధ్యతరగతి వ్యాపార యజమానులు, చిరు ఉద్యోగులు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ గత ఆరునెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లను బ్రాంచ్ లో సమర్పించడం ద్వారా ఐసిఐసిఐ, హెచ్ఎఫ్‌సి కింద స్పాట్ హోమ్ లోన్ పొందవచ్చునని ఐసిఐసిఐ (ICICI Home Loan) హోమ్ ఫైనాన్స్ ప్రకటనలో తెలిపింది.

గృహ రుణాలు అవసరమైన కస్టమర్లకి ఐసిఐసిఐ, హెచ్ఎఫ్‌సి ఉద్యోగులను సంప్రదించవచ్చని పేర్కొంది, వారు ఈఎంఐ చెల్లింపులకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తారని ఐసిఐసిఐ తెలిపింది.

ICICI Home Loan

మంచి క్రెడిట్ స్కోర్ ను మెయింటైన్ చేయడానికి అవసరమైన సూచనలు సలహాలను కూడా ఇస్తారని తెలిపింది. ప్రతి శాఖలో తమ ప్రతినిధులను ఉంటారని తక్కువ డాక్యుమెంటేషన్ తో త్వరగా రుణాలను అందించే వీలుగా అందిస్తారని తెలిపింది.

ICICI Home Loan

ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం కింద మొదటిసారి గృహ కొనుగోలు దారులు 2.67 లక్షల వరకు సబ్సిడీ ని కూడా పొందవచ్చును అని కూడా తెలిపింది.

ఇది కూడా చదవండి : ఓబిసి (OBC) రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ