Samsung Galaxy Z Fold 3 : సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం అదిరిపోయే ఫీచర్లతో మడత అంటే ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లను విడుదల చేసేందుకు రంగం లోకి దిగింది.
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన దూకుడును పెంచేసింది, అదిరిపోయే ఫీచర్లతో తన పోటీదారు ఫోన్లకు గట్టి పోటీ గా మడత అంటే ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లను విడుదల చేసేందుకు రంగం లోకి దిగింది.
ఇప్పటికే భారత్ తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11వ తేదీన (Samsung Galaxy Z Fold 3) గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, ఫోల్డబుల్ ఫోన్ ల తో పాటు, గెలాక్సీ బడ్స్ 2 , గెలాక్సీ వాచ్ ఫోర్ సిరీస్ లను విడుదల చేయగా , ఈ ఫోల్డబుల్ (Samsung Galaxy Z Fold 3) ఫోన్ లను భారత్లో ఆగస్టు 20న బాలీవుడ్ హీరోయిన్ అయిన ఆలియా భట్ చేతులమీదుగా మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 (Samsung Galaxy Z Fold 3) యొక్క ఫీచర్స్:
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఒక పుస్తకం మాదిరిగా ఉంటుంది, అంటే మన దీనిని ఒక ఫోన్ టాబ్ లేదా, ఒక ఫోన్ ల వాడుకోవచ్చు. దీనిని ఆపరేట్ చేసేందుకు ఎస్ పెన్ స్టైలస్ ఫోనుతో పాట వస్తుంది, ముఖ్యంగా ఈ ఫోన్ లోని ఫీచర్లు ఇతర స్మార్ట్ఫోన్ల కంటే విభిన్న తరహాలో ఉన్నాయి.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఎఫ్ వన్ బై ఎయిట్(1/8) 98 వైడ్-యాంగిల్ లెన్స్ తో, 12 మెగా పిక్సెల్ టెలి ఫోటో షూటర్స్ సదుపాయం ఉంది, హై క్వాలిటీ వీడియో కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజటిన్ ఫీచర్స్ తో పాటు ఫ్రంట్ ఎండ్ 10 మెగా పిక్సెల్ షూటర్, వెనుక భాగంలో 4 మెగా పిక్సల్ కెమెరా ఆకర్షణ చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 (Samsung Galaxy Z Fold 3) :
ఇప్పటికే అంతర్జాతీయ మొబైల్ మార్కెట్లో విడుదల అయిన ఈ ఫోన్ యొక్క ధర రూ. 1,33,600 గా ఉండగా మన భారతదేశంలో మాత్రం ఈ ఫోన్ల ధరల్లో మార్పులు ఉండవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్స్:
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రేర్ కెమెరా సెటప్, 12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ , ఫ్రంట్ ఎండ్ లో ఎఫ్/2.4 లెన్స్ తో 10 మెగాపిక్సెల్ తో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ కి ఎస్ పెన్ స్టైలస్ ను ఉపయోగించలేము.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ప్లస్ త్రీ ధర:
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 అమెరికన్ మార్కెట్లో 74 వేల రూపాయలు ఉండగా, ఆగస్టు 20న విడుదల అయ్యే ఈ ఫోన్ యొక్క ధర భారతదేశంలో ఎంత ఉండొచ్చు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.