Adani Group : ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లకు పోటీగా రంగంలోకి దిగిన ఆదానీ, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆదానీ మరొక కొత్త రంగంలోకి అడుగు పెట్టనున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆదానీ మరొక కొత్త రంగంలోకి అడుగు పెట్టనున్నారు, ఇప్పటికే ఏ రంగాన్ని వదిలేది లేదు అన్న తరహాలో అన్ని రంగాల లోకి ప్రవేశిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నారు ఆదానీ.
త్వరలో విల్మార్ కన్జ్యూమర్ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నారు అని ఆయన తెలిపారు, సిమెంట్ రంగంలో అడుగుపెడుతు న్నట్లు ఆయన ప్రకటించారు.
పెట్రో కెమికల్, రిఫైనరీ సంస్థ లను కూడా ఆక్రమణ చేసిన విషయం మనకు తెలిసిందే, తాజాగా యూనికార్న్ కంపెనీలపై కూడా ఆయన దృష్టి సారించారు.
టాటా సన్స్, రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలతో పాటు పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి తదితర కొత్త యుగం కంపెనీలతో పోటీ పడేందుకు ఆదానీ గ్రూప్ (Adani Group) సిద్ధమైపోయింది.
అయితే, ఈ కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించే తరుణం లో ఒక సూపర్ యాప్ ను ఆవిష్కరిస్తున్నట్లు ఆయన (Adani Group) ప్రకటించారు.
ఈ కామర్స్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్, మరియు రీఛార్జింగ్ సర్వీస్ లాంటి సేవలను తన ఖాతాదారులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఆదానీ గ్రూపు కు మిలియన్ల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారని, అది తమకు బాగా కలిసి వస్తుందని ఆదానీ గ్రూప్ (Adani Group) భావిస్తోంది.
కాగా, డిజిటల్ పేమెంట్స్ క్రమంగా పెరుగుతున్న ఈ తరుణంలో గూగుల్ పే , పేటీఎం, భారత్ పే , ఫోన్ పే ఇలాంటి వాటి ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఇప్పుడు ఈ రంగంలోకి ఆదానీ గ్రూపు కూడా అడుగుపెట్టనుంది.