Huawei P50, P50 Pro : కొత్తగా లాంచ్! దాని ధర చూస్తే ఆశ్చర్యం!

Huawei P50
Huawei P50, P50 Pro : స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్ లో విడుదల అయినాయి. రెండు ఫోన్లలో ప్రత్యేకమైన క్యాప్సూల్స్ లాంటి బాక్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి.

Huawei P50, P50 Pro స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్ లో విడుదల అయినాయి. రెండు ఫోన్లలో ప్రత్యేకమైన క్యాప్సూల్స్ లాంటి బాక్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రొ మోడల్ రెండు SOC వారియంట్లతో లభించనుంది. కిరీన్ 9000 స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ లతో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వనిల్ల మోడల్ 888 మోడల్ లలో మాత్రమే లభించనుంది.

రెండు ప్రాసెసర్ లు 5g కి సపోర్ట్ చేస్తాయి, Huawei P50 వెనక భాగం లో బాక్ కెమెరా సెట్ అప్ అందించారు. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, 64 మెగా పిక్సెల్ టెలీ ఫోటో షూటర్ తో విడుదల అయినది. మరోవైపు Huawei P50 ట్రిపుల్ ముందు కెమెరా సెటప్ ని కలిగి ఉంది. ఇందులోనూ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా గా అందించారు.

Huawei P50

కొత్త Huawei P50 Pro, 8GB/128GB స్టోరేజ్ మోడల్ ధర భారత కరెన్సీ లలో రూ. 68,800 గా నిర్ణయించారు. అలాగే 8GB/256GB స్టోరేజ్ మోడల్ ధర భారత కరెన్సీ లలో సుమారు రూ. 74,500 గా కాగా, 8GB/ 512GB వేరియంట్ ధర రూ. 86,000 లుగా నిర్ణయించారు.

జులై 30 నుంచి ప్రీ ఆర్డర్ లు మొదలు కానున్నాయి. అయితే ఈ సేల్స్ మాత్రం ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్నాయి.

Huawei P50

ఇది Cocoa Tea Gold, Dawn Powder, Rippling Clouds, Snowy White, మరియు Yao Gold Black కలర్ ఆప్షన్ లలో లభించనున్నాయి.

12GB/512GB స్టోరేజ్ మోడల్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో కిరీన్ 9000 SOC తో మరో రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక దాని ధర CNY రూ. 91,800 లు కాగా, మరో మోడల్ ధర రూ. 97,500 లుగా నిర్ణయించారు. ఈ రెండు మోడల్స్ సెప్టెంబర్ లో అందుబాటులో రానున్నాయి.

ఇది కూడా చదవండి : ఆగష్టు ఒకటో తారీఖు నుండి కొత్త రూల్స్ – మీకు లాభమా? నష్టమా?