Timmarusu Movie: తిమ్మరుసు జూలై 30 న సినిమా థియేటర్లలో రిలీస్ చేశారు. మరి ఆ తిమ్మరుసు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా?…లేదా?
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది, సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. థియేటర్లలో మొదటి బొమ్మ పడింది. తెలంగాణలో 100% అక్కుపెన్సీకి, ఆంధ్రలో 50% అక్కుపెన్సీకి అనుమతిని ఇచ్చారు.
తిమ్మరుసు (Timmarusu) జూలై 30 న సినిమా థియేటర్లలో రిలీస్ చేశారు. మరి ఆ తిమ్మరుసు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా?…లేదా?…ఇక్కడ చదవండి.
ఈ (Timmarusu) సినిమాలో రామ్ అలియాస్ సత్యదేవ్ ఓ అడ్వకేట్, న్యాయం తరుపున పోరాడాలన్నది అతని తపన. ఒక సీనియర్ లాయర్ దెగ్గర సత్యదేవ్ పనిచేస్తూ ఉంటాడు. ఆ లాయర్ కి సంపాదన ఒకటే ధ్యేయం, కానీ రామ్ దొరణి, ఇంటెన్షన్ వేరేలా ఉంటాయి, అందుకే అతని దెగ్గర పనిచేయలేక పోతాడు.
అతని గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక పనిచేసే రావ్ అసోసియేట్స్ లో పనిచేయాలని అనుకుంటాడు. అతని కల నిజమయ్యే అవకాశం వస్తుంది. రావ్ అసోసియేట్స్ వాళ్ళు పేదవాళ్ళకి న్యాయం జరగలనే ఉద్దేశంతో కొత్తవాళ్లను రిక్రూట్ చేసుకుంటారు. అలా తన టాలెంట్ తో రావ్ అసోసియేట్స్ తో అసోసియేట్ అవుతాడు (Timmarusu) తిమ్మరుసు.
అతని అడ్వకేట్ స్కిల్స్ మీద గురి కుదురుతుంది రావ్ కి. వెనువెంటనే ఒక కష్టమైన ఫైల్ ని తెప్పించి ఒక కేసు ని అప్పగిస్తాడు, ఆ కేసు వాసు అనే అతనిది. పబ్ లో పనిచేసే వాసు ఓ వర్షం పడ్డ రాత్రి కొండాపూర్ జంక్షన్ మీదుగా వెళ్తుంటాడు అక్కడ క్యాబ్ డ్రైవరు హత్య జరుగుతుంది.
అది ఎవరు చేశారో తెలియదు కానీ అది వాసు మీద పడుతుంది. అతని ని కేసు లో ఇరికిస్తాడు పోలీస్ భూపతి రాజు అలియాస్ అజయ్.
అసలు క్యాబ్ డ్రైవరు ఎవరు? అతన్ని చంపిన వ్యక్తిని భూపతి రాజు ఎందుకు కాపాదలనుకున్నాడు? వాసుని కేసులో ఎందుకు ఇరికించాడు? 8 ఏళ్ల తర్వాత రీ ఓపెన్ అయిన కేసు గురుంచి పబ్లిక్ ప్రాసికూటర్ వాసుదేవరావ్ అలియాస్ అల్లరి రవి బాబుకు ఎందుకు కంగారూ పుట్టింది?
పబ్ లో పనిచేసిన అమ్మాయి ని ఎవరు హత్య చేయించారు? మద్యలో వాలి ఎవరు? రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ భాస్కర్ సీన్ లో ఎందుకు వచ్చారు? తిమ్మరుసు గర్ల్ ఫ్రెండ్ ఇంటెన్షన్ ఏంటి? సుధా అలియాస్ బ్రహ్మాజీ కి ముందే తిమ్మరుసు తో పరిచయం ఉన్నదా? ఇటువంటివన్నీ తెర మీద చూసి తెలుసుకోవాలిసిందే.
వీటిలో ఏ చిన్న విషయాన్ని ముందే చెప్పేసిన చివరగా థ్రిల్ ని ప్రేక్షకులు మిస్ అయిపోతారు.
సత్యదేవ్ ఒక కారెక్టర్ ని ఎంచుకున్నారంటే ఆ కథ లో ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుందని నమ్మకం ప్రేక్షకులకి ఉన్నది.
తిమ్మరుసు మీద మేకర్స్ కి, ప్రేక్షకుల కి ఉన్న ధృడ నమ్మకం కూడా అదే. 47 డేస్, గువ్వా గోరింకా, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, పిట్ట కథలు, లాక్… ఇలా వరుసగా ఓటిటి లకే ఓటేసిన సత్యదేవ్ ఇప్పుడు నేరుగా థియేటర్లలో రిలీస్ కి ఎలాంటి వెరీయేషన్ చూపించారు.
ఇంతకు ముందు కారక్టర్స్ తో పోలిస్తే తిమ్మరుసులో సత్యదేవ్ గెటప్ కొత్తగా ఉంది. ట్రిమ్ చేసిన మీసాలు, వెరైటీ హెయిర్ స్టైల్, కళ్ళజోడు చూడగానే పాతకాలం నాటి లుక్ గా కనిపించినా, కొత్తగా అనిపించారు.
కోర్టులో నడిచేటప్పుడు అతడి నడక వేగం, వాసుతో మాట్లాడేటప్పుడు చూపించే వేరియేషన్, బ్రహ్మాజీతో ఉన్నప్పుడు డైలాగ్ డెలివరీ టైమ్, దేనికదే బాగుంది.
ప్రియాంక తన క్యారెక్టర్ లిమిట్స్ లో కనిపించారు.
బ్రహ్మాజీ కామెడీ కాస్తా రిలీఫ్ గా ఉంటుంది.
వైవా హర్ష సర్ప్రైసింగ్ ఎలిమెంట్.
30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావ్ కి ఇందులో మంచి ఎలివేషన్ ఉన్న పాత్రను ఇచ్చారు.
వాసు పాత్రలో నటించిన వ్యక్తి బాగా నటించాడు.
శ్రీ చరణ్ పాకాల బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్.
వర్షం పడ్డ రాత్రి ఓ జంక్షన్ లో జరిగిన హత్యని రకరకాలుగా చూపించిన్న విదానం కూడా బాగుంది. ఇంటర్వెల్ సీన్స్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి.
“న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో ఓడిపోయిన పరవాలేదు అందులో గెలుపే ఉంటుందని” అని ఝాన్సీ చెప్పే డైలాగ్, “బలవంతుడు బలం ఉన్నంత వరకు గెలుస్తాడు కానీ తెలివైన వాడు ఎప్పుడు గెలుస్తాడు” అని ప్రీ క్లైమాక్స్ లో ఇంటెన్స్ తో సత్యదేవ్ చెప్పే మాటలు, న్యాయస్థానంలో న్యాయం గురుంచి చెప్పే క్లైమాక్స్ డైలాగులు కూడా క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి.
Timmarusu సినిమాలో హీరో పేరు రామ్ అయినప్పటికీ తిమ్మరుసు అనే శీర్షిక ఎందుకు పెట్టారు? ఈ విషయానికి చివరగా మంచి టచ్ ఇచ్చాడు డైరెక్టర్ చరణ్ కొప్పిశెట్టి.
కనడ సినిమా బీర్బలన్ చూసినవారికి సినిమాలో ఏమి జరుగుతుందో ముందుగా తెలిసిపోతుంది కాబట్టి అంతా ఆశ్చర్యంగా ఉండదు. ఏమి చూడకుండా తెలుగు వెర్షన్ చూస్తే మాత్రం ఈ సినిమాలో చూస్తూ లీనమైపోతారు.
సత్యదేవ్ ని నల్లకోట్ లో చూడగానే వెంటనే వకీల్ సాబ్ ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా లో సత్యదేవ్ వాదించడం కన్నా బయట చేసే విచారణే ఎక్కువ. అందుకే ఇది అందరూ తప్పకుండా సినిమా హాళ్లలో చూడాల్సిన (Timmarusu) సినిమా.