జాతీయం-అంతర్జాతీయంబిజినెస్

New Rules August 2021 : ఆగష్టు ఒకటో తారీఖు నుండి కొత్త రూల్స్ – మీకు లాభమా? నష్టమా?

New Rules
New Rules August 2021 : ఒకటో తారీఖు(ఆగష్టు-2021) నుండి కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రానున్నాయి, పలు అంశాలు మారనున్నాయి, దీనితో బ్యాంక్ ఖాతా దారుల నుంచి సాధారణ సామాన్య ప్రజల వరకు పలు అంశాలు తెలుసుకోవాలి.

ఒకటో తారీఖు(ఆగష్టు-2021) నుండి కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రానున్నాయి. పలు అంశాలు మారనున్నాయి. దీనితో బ్యాంక్ ఖాతా దారుల నుంచి సాధారణ సామాన్య ప్రజల వరకు పలు అంశాలు తెలుసుకోవాలి. మారే అంశాలు ముందే తెలుసుకుంటే ఇబ్బంది ఉండదు.

ఆగస్టు నెల వస్తూ వస్తూనే తన వెంట కొత్త రూల్స్ (New Rules) తీసుకొని వచ్చింది, దీనితో చాలా మందిపై ప్రబావం పడే అవకాశం ఉంది. అందువల్ల ఆగస్టు 1వ తారికున ఏమేమి కొత్త రూల్స్ మారబోతున్నాయో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

New Rules

ఈ కొత్త రూల్స్ (New Rules) సామాన్యులను ఎక్కువగా ప్రభావితం చేసేవిగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

  1. ఎల్పీజీ ధరలు, శాలరీలు, ఏటిఎం తో జరిపే లావాదేవీలు మరియు పెన్షన్‌లు ఇంకా చాలా విషయాల గురించి ఈ కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రానున్నాయి.
  2. మనకు సాధారణంగా ఒక్కోసారి ఒకటో తేదీ ఆదివారం వస్తే జీతం పడడం ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. అయితే ఇక మీదట ఇలాంటి సమస్య ఉండదట.సెలవు రోజుల్లో కాకుండా ఆకౌంట్ లలో జీతం,పెన్షనులు పడేలా నేషనల్ ఆటొమేటెడ్ క్లియరెన్స్ హౌజ్ మార్పులు చేసింది. 2021 ఆగష్టు ఒకటో తారీఖు నుండి కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రానున్నాయి. ఆగష్టు ఒకటో తారీఖు ఆదివారం నాడు కూడా జీతాలు, పెన్షనులు, డెవిడెండ్ అన్ని అకౌంట్లో పడుతాయి. అంతే కాకుండా ఈఎంఐ, లోన్ వంటివి వాటికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అనగా సెలవు రోజుల్లో కూడా పేమెంట్స్ పనులు ఆగకుండా జరిగిపోతాయి. దీనితో ఉద్యోగులకు, పెన్షన్ దారులకు, ఇంకా చాలా మందికి ఊరట కలగనుంది.
  3. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటిఎం ఇంటర్‌చేంజ్ రుసుమును పెంచారని అందరికీ తెలుసు. ఆగష్టు ఒకటో తారీఖు నుండి ఏటిఎం లలో ఫైనాషియల్ ట్రాన్సాక్షన్ కు ఇంటర్‌చేంజ్ రుసుము పదియేడు రూపాయలు చెల్లించాలి. నాన్ ఫైనాషియల్ ట్రాన్సాక్షన్ కు రుసుము ఆరు రూపాయలు చెల్లించాలి. ఇప్పుడు ఫైనాషియల్ ట్రాన్సాక్షన్ కు ఇంటర్‌చేంజ్ రుసుము పదిహేను రూపాయలు, నాన్ ఫైనాషియల్ ట్రాన్సాక్షన్ కు రుసుము అయిదు రూపాయలు ఉన్న విషయం అందరికి తెలిసిందే.
  4. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సాదారణంగా 1వ తేదీన ఎల్పిజి మరియు గ్యాస్ సిలిండర్ ధరలను ఇంకా అన్ని కంపెనీలు ప్రతీ నెలా ఒకటో తారీఖు న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేట్‌లని మారుస్తూ ఉంటారు. జూలై నెలలో మాత్రం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేట్‌ పెరిగింది.అయితే ఈ ఆగష్టులో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేట్‌ పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. అది ఆగష్టు ఒకటో తారీఖు న తెలుస్తుంది.
  5. ఇప్పడిదాకా ఐపీపీబీ(ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) డోర్‌స్టెప్ సేవలకు అయితే ఎటువంటి ఛార్జీలు లేవు. ఇప్పడి నుండి ఐపీపీబీ 2021 ఆగష్టు ఒకటో తారీఖు నుండి డోర్‌స్టెప్ సేవలకు ఇరవై రూపాయలు ప్లస్ జీఎస్‌టీ రుసుము తీసుకోడానికి నిర్ణయం తీసుకుంది.
  6. దేశీయ దిగ్గజ బ్యాంక్ లలో ఒకటైన ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ 1వ తారీఖు నుంచి కొత్త రూల్స్ అమలులోకి తెస్తుంది. కొన్ని చార్జీలలో మార్పు చేసింది. మనీ లావాదేవీల పైన ఒక లిమిట్, ఏటిఎం ఇంటర్‌చేంజ్ మరియు చెక్‌బుక్ వంటి విషయాలలో మార్పులు చేయబోనున్నారు. ప్రతీ రోజూ ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు దాని హోం శాఖా లో లక్ష రూపాయల వరకు లావాదేవీలను ఉచితం చేసింది, అయితే లక్ష రూపాయలు దాటితే ప్రతీ వెయ్యి రూపాయలకు అయిదు రూపాయలు ఛార్జీ కట్టాలి. నాన్ హోం శాఖా లో ప్రతీ రోజూ ఇరవైఅయిదు వేల వరకు ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసింది. అయితే ఇరవైఅయిదు వేలు దాటితే మాత్రం ప్రతీ వెయ్యి రూపాయలకు అయిదు రూపాయలు ఛార్జీ కట్టాలి, థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ లకు ఇరవైఅయిదు వేల వరకు ఉచితం చేసింది. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కి 150 రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇక ఒక సంవత్సరం లో 25 పేజీలు ఉన్న చెక్ బుక్ ఉచితం, ఆ తర్వాత 10 పేజీలు ఉన్న చెక్ బుక్ కి 25 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
  7. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సేస్ దానిలో ఉన్న 15చ మరియు 15చ్బ్ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయం లో కొన్ని సదలింపులు ఇచ్చారు. గతంలో ఉన్న చివరి తేదీ జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు పెంచింది,హోండా కార్స్ కంపెనీ దాని కార్ల రేట్లని ఆగస్టు నెల నుంచి పెంచనుంది. కానీ ఏ ఏ కార్ మాడెల్ కి ఎంత ధర పెంచబోతున్నారో ఇంకా తెలియాల్సిఉంది.

New Rules

వేతనం, ఈ‌ఎం‌ఐ చెల్లింపులు, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబందనలలో ఆర్బిఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజులలో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబందిత లావదేవిలు సెలవు రోజులలో కూడా జరగనున్నాయి.

ఇది కూడా చదవండి : యుద్ధాలను అడ్దుకోవడానికి వ్యూహాన్ని రచిస్తున్న అమెరికా