America Force Field : టెక్ యుద్ధాలను అడ్దుకోవడానికి వ్యూహాన్ని రచిస్తున్న అమెరికా -ఫోర్స్ ఫీల్డ్ ప్రాజెక్టు

Force Field
America Force Field : ఫోర్స్ ఫీల్డ్ ప్రాజెక్టుకు అమెరికా శ్రీకారం చుట్టింది, ఈ రక్షణ వ్యవస్థ అనేది శత్రు క్షిపణులను ఆరు అంచెలలో నాశనం చేస్తుంది.

ఫోర్స్ ఫీల్డ్ (Force Field) ప్రాజెక్టుకు అమెరికా శ్రీకారం చుట్టింది. ఈ రక్షణ వ్యవస్థ అయిదు సూత్రాలతో పని చేస్తుంది. ఈ రక్షణ వ్యవస్థ అనేది శత్రు క్షిపణులను ఆరు అంచెలలో నాశనం చేస్తుంది. ఇది ఇజ్రాయెల్ ఐరన్‌డొం కంటే ఎంతో శక్తివంతమయినది. దీని యొక్క ప్రోటోటైప్ 2060 లో వాడుకలోకి రానుంది.

Force Field

శత్రువుల రాకెట్ దాడుల నుంచి ఆయుధాలను, మరియు యుద్ధం లో వాడే విమానాలను కాపాడుకునేందుకు అనగా భవిష్యత్తులో జరిగే టెక్ యుద్దాలను అడ్దుకునేందుకు అమెరికా కూడా రంగం లోకి దిగింది. యుద్ధ సైనికుడికి అతని కవచం ఎలాగో, రాజ్యానికి కోట ఎలాగ ఉంటుందో దేశం మోత్తానికి ఒక రక్షణ కవచం ఉండాలని అమెరికా నిర్ణయించుకుంది. దాని లో భాగంగానే వచ్చింది ఈ “ఫోర్స్ ఫీల్డ్” ప్రాజెక్టు.

భారత్ కూడా ఇజ్రాయెల్ ఐరన్‌డొం తో పోలిస్తే వందల రెట్ల ఎక్కువ సామర్థ్యం గల మూడు నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం లోని యుద్ధ క్షిపణులను ధ్వంసం చేసే “ఎస్-400” రక్షణ డోం ను కొనుగోలు చేసే ఉద్దేశం లో ఉంది.

“ఫోర్స్ ఫీల్డ్” (Force Field) యొక్క పరిధి:

America Force Field : టెక్ యుద్ధాలను అడ్దుకోవడానికి వ్యూహాన్ని రచిస్తున్న అమెరికా -ఫోర్స్ ఫీల్డ్ ప్రాజెక్టు

అమెరికా అద్యక్ష భవనం వైట్‌హౌసు, క్యాపిటల్ హౌస్, అమెరికా యొక్క రక్షణ కార్యాలయమయిన పెంటాగాన్ తో పాటు అమెరికాలో యాభై రాష్ట్రాల పరిధిలోని నగరాలను, అన్ని ఫారెస్టులు, అన్ని జలాశయాలు ఇలా అన్నింటిని రక్షించే విధంగా ఒక కంటికి కనిపించని అదృశ్య కవచాన్ని తయారు చేస్తున్నారు.

“ఫోర్స్ ఫీల్డ్” ప్రాజెక్ట్ యొక్క విశేషాలు : శత్రు దేశాలు మన మీద ప్రయోగించే పెద్ద పెద్ద రాకెట్‌లు, మోర్టార్‌లు,విమానాలు, హెలికాప్టర్‌లతో పాటు భారీగా అణువాయిధ క్షిపణుల వంటి వాటిని కూడా కొన్ని సెకనులలోనే గాలిలోనే నాశనం చేసెందుకు తయారు చేసిందే ఈ “ఫోర్స్ ఫీల్డ్” ప్రాజెక్టు.

“ఫోర్స్ ఫీల్డ్” (Force Field) ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది?

America Force Field : టెక్ యుద్ధాలను అడ్దుకోవడానికి వ్యూహాన్ని రచిస్తున్న అమెరికా -ఫోర్స్ ఫీల్డ్ ప్రాజెక్టు

శత్రువుల యొక్క దాడులను ఎదురుకోవడానికి ఈ ప్రాజెక్టు 5 సుత్రాలను ఆచరిస్తుంది. అవి శత్రువు యొక్క రాకెట్ శక్తిని తగ్గించడం , మరియు అడ్దుకోవడం, మొత్తం కాకుండా పాక్షికంగా నాశనం చేయడం, లేదా మొత్తం నాశనం చేయడం , దారి మళ్ళించడం ఈ సూత్రాలను పాటిస్తుంది.

వందల కిలో మీటర్‌లలో ని లక్ష్యాలను కూడా 6 అంచెల్లో గాలిలోనే పేల్చేసేలా ఆ ప్రాజెక్టు ఉంటుంది. క్షిపణుల యొక్క దిశను గుర్తుపట్టడానికి ఇందులో అత్యాధునికమయిన రాడర్ ను వాడడం జరిగింది.

ఇంకా కొన్ని ముఖ్య విషయాలు:

Force Field

1) గాజాలో జరిగిన హమాస్ ఉగ్రవాద దాడులను ఎదురుకునేందుకు గత మే నెలలో ఇజ్రాయెల్ ఐరన్ డోం ను ఇందులో వాడింది. ఇది సుమారుగా మూడు వందల రాకెట్ లను నాశనం చేసింది.

2) రొమేనియా మరియు ఈయూ లోని కొన్ని దేశాలు కూడా ఐరన్ డోం ను తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి : సేవా కార్యక్రమాలలో క్రికెటర్ యువరాజ్‌సింగ్