New Movies Coming Out : ప్రతీ సారి లాగానే ఈసారి కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు ఈ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
మన తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అయితే ప్రతీ సారి లాగానే ఈసారి కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు (New Movies Coming Out) ఈ విడుదలకు సిద్దంగా ఉన్నాయి, అయితే ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్ ని ఖరారు చేసుకున్నాయి.
వాటిలో మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రాణా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా (New Movies Coming Out) సంక్రాంతి బరిలో అది కూడా అందరి కంటే ముందు ఉండి జనవరి 12న విడుదల కానుంది.
ఇక జనవరి 13న సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ప్రేక్షకులకు ముందుకు రానుంది, పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది.
భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది, ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక వీటితో పాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్, పూజ హెగ్డే ల కాంబినేషన్ లో వస్తున్న రాధే శ్యామ్ సినిమా జనవరి 14న విడుదల (New Movies Coming Out) కానుంది.
యూవి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు, పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరామ్, ప్రియదర్శిని తదితరులు నటిస్తున్నారు, ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ తోనే వస్తున్నాయి,ఇక ఈ మూడు భారీ బడ్జెట్ సినిమాలతో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్3, అలానే విజయ్ దేవరకొండ నటిస్తున్న బీస్ట్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్నాయట.
తాజా సమాచారం ప్రకారం పవన్, మహేష్, ప్రభాస్ సినిమాల్లో ఒక సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి అనే వార్త ఫిలింనగర్ లో సంచలనం చేస్తుంది.
ఎందుకంటే ఒకేసారి ముగ్గురు భారీ ఇమేజ్ కలిగిన హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే అది ముగ్గురు సినిమాల కలెక్షన్స్ కి ప్రమాదం అవుతుంది అని, అందుకే ఈ మూడు సినిమాలలో ఒక సినిమా మాత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుంది అని ఒక సమాచారం.
ఇక త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి, మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా తప్పుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు మనం ఆగాల్సిందే.