జాతీయం-అంతర్జాతీయంబిజినెస్

SBI Housing Loan 2021: మీ భార్య పేరు మీద ఇల్లు కొంటున్నారా? అయితే ఇది చదవండి!

SBI Housing Loan
SBI Housing Loan : మహిళల పేరుతో ఇల్లు కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, మీ భార్య పేరు మీద ఇల్లు కొంటున్నారా? అయితే ఇది చదవండి!

ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ సాధారణంగా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు, ముఖ్యంగా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది మహిళల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించడానికి  ఇష్టపడుతుంటారు, ఎందుకంటే మహిళల పేరుతో ఇల్లు కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

మహిళలకు ప్రభుత్వ  పథకాల ప్రయోజనాలు, పన్ను మినహాయింపులు లభిస్తాయి, ఆదాయపు పన్ను లో మహిళలకు ఎక్కువ పన్ను రాయితీ ని ఇస్తుంటారు, ఫలితంగా వారికి అధిక ప్రయోజనం చేకూరుతుంది, ఈ విషయం తెలిసిన చాలామంది మహిళల పేరు మీద ఇల్లు కొనుగోలు చేసి  ఆదాయపు పన్నులో భారీ  ఉపశమనం పొందుతారు.

ICICI Home Loan

ఇల్లు కొనడానికి గృహ రుణం (SBI Housing Loan) తీసుకుంటే మహిళా కస్టమర్లకు తక్కువ  వడ్డీ రేట్లకే  రుణాలు  లభిస్తాయి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మహిళలకు గృహ రుణాలపై 0.5 శాతం తక్కువ వడ్డీ రేటు ను  అందిస్తోంది.

అలాగే ఒక ఇంటిని మహిళ పేరు మీద కొనుగోలు చేసినట్లయితే  స్టాంప్ డ్యూటీ లో కూడా మినహాయింపు ను  ఇస్తారు, ఇక మహిళలు గృహాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్ర స్థాయిలో విస్తృత రాయితీలను  అందిస్తోంది.

10th pass govt jobs

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎకనామిక్ వీకర్ సెక్షన్   కేటగిరి  కింద మహిళల పేరిట కేంద్ర ప్రభుత్వం  అనేక రాయితీలను ఇస్తుంది.

ఇదే సమయంలో గృహ రుణాలపై (SBI Housing Loan) ఎస్‌బిఐ (SBI) బంపర్ ఆఫర్ ప్రకటించింది, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గృహ రుణాలు తీసుకునే వారికి 5 శాతం వడ్డీ తగ్గించింది, అయితే ఎస్‌బిఐ యోనో  యాప్( SBI Yono App)  ద్వారా హౌస్ లోన్ అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇది  వర్తిస్తుంది.

SBI Housing Loan

సాధారణ గృహ రుణాల వడ్డీ రేటు 6.70 శాతం ఉంది, ఇక 30 లక్షల వరకు 6.70 శాతం వడ్డీతో గృహ రుణాలను అందిస్తుండగా, 30 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉండే గృహ రుణాల పై వడ్డీ రేటు 6.95 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి :
బిలియనీర్ల క్లబ్ లో డీమార్ట్ అధినేత రాధా కిషన్ దమాని
రేపటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకు కు సెలవులు!
ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లు లేకపోయినా హోమ్ లోన్ గ్యారెంటీ
స్పెషల్ ఎగ్ దమ్ బిర్యాని