సినిమా

Sampu Babu : బజార్ రౌడీ – సంపూర్ణేష్ బాబు రివ్యూ!

Sampu Babu
Sampu Babu : సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా ఆగష్టు 20 న థియేటర్స్ లో రిలీజ్ అయింది, రివ్యూ ఎలా ఉందో చూడండి!

హృదయ కాలేయం చిత్రం తో ఒక్క సారి గా ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్నారు  నటుడు సంపూర్ణేష్ బాబు (Sampu Babu),  ఈ సినిమాలో తనదైన శైలిలో కామెడీని పండించి ఆకట్టుకున్నారు, తర్వాత కొబ్బరి మట్ట సినిమా తో పాటు పలు చిత్రాలలో  సైడ్ ఆర్టిస్టు గానూ నటించాడు.

తాజాగా ఈ బర్నింగ్ స్టార్ హీరోగా బజార్ రౌడీ అనే సినిమా ఆగష్టు 20 న విడుదల అయింది, వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్వరి వద్దీ  హీరోయిన్ గా నటిస్తోంది, నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

Sampu Babu : బజార్ రౌడీ - సంపూర్ణేష్ బాబు రివ్యూ!

తాజాగా కరోనా నిబంధనలు తొలగిపోవటం, థియేటర్లు తిరిగి తెర్చుకోవడంతో  బజార్ రౌడీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు,  ఈ సినిమాను ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ విడుదల చేసింది, ఇందులో తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలను నటించారు, కాళీ  పాత్రలో తన నట  విశ్వరూపాన్ని చూపించారు, “వచ్చాడు కాళీ, నాకు ఎదురు వచ్చిన వాడు ఖాళీ అంటూ సంపూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది”.

Sampu Babu

అలాగే ట్రైలర్ లో వచ్చే రౌడీలకు రామాయణం చెప్తే రావణాసురున్ని  ఫాలో అవుతారు, కానీ రామున్ని కాదు, నీకు బాంబే బ్యాగ్రౌండ్ ఉండవచ్చు, నాకు బాంబే నే బ్యాగ్రౌండ్ వంటి  సంపూ మార్క్  డైలాగ్స్  ఆకట్టుకుంటున్నాయి.

కేవలం యాక్షన్ సన్నివేశాల కే పరిమితం కాకుండా, రొమాంటిక్ సీన్స్ లోనూ సంపూ ఆకట్టుకున్నాడు, సినిమా ట్రైలర్ ను చూస్తుంటే సంపూ (Sampu Babu) ఇందులో    డ్యూయల్ రోల్ లో  నటిస్తున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమా బాక్స్ ఆఫీసు ముందు  ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఈ 123telugu Review లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి :
భీమ్లా నాయక్ – పవన్ కళ్యాణ్
షణ్ముఖప్రియకు రౌడీ దేవరకొండ వీడియో కాల్ తో ఆఫర్!
సంక్రాంతి బరిలోకి మూడు భారీ బడ్జెట్ సినిమాలు
బిగ్ బాస్ 5 హౌస్ లోకి వెళ్తుంది వీళ్లే? లీక్ చేసిన లాస్య!