జాతీయం-అంతర్జాతీయం

Best CM in India 2021: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి గా యోగి ఆదిత్య నాథ్

Best CM in India
Best CM in India : మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి (బెస్ట్ సిఎం) గా నిలిచిన యోగి ఆదిత్య నాథ్!

మూడ్ ఆఫ్ ది నేషన్ దేశంలో బెస్ట్ సీఎం (Best CM in India) ఎవరో అనే విషయంపై ఇటీవల కొత్త సర్వే నిర్వహించింది, ప్రజల యొక్క  మూడ్ తెలుసుకునేందుకు నిరంతరం ఈ సర్వే నిర్వహిస్తూ ఉంటుంది, అయితే ఈసారి జరిపిన సర్వేలో ఆసక్తి కరమైన ఫలితాలు వచ్చాయి.

ఈ సర్వేలో దేశంలోనే మంచి పరిపాలన చేస్తున్న సీఎం గా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు,  ఉత్తమ ముఖ్యమంత్రి (Best CM in India) గా యోగి 19 శాతం ఓట్లతో అగ్రస్థానం తన సొంతం చేసుకున్నారు.

Best CM in India

దేశ రాజధాని  అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 14 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలువగా , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్ అయినా దీదీ  మమతా బెనర్జీ మూడవ స్థానంలో నిలిచారు, నాలుగో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అయిదవ స్థానం లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ నిలిచారు.

అయితే గత సంవత్సరం మూడ్ ఆఫ్ ది నేషన్ జరిపిన సర్వే లో ఉత్తమ ముఖ్యమంత్రి (బెస్ట్ సిఎం) గా  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినిలచిన   సంగతి అందరికీ తెలుసిందే కదా.

Best CM in India

మోస్ట్ పాపులర్ సిఎమ్స్ ఇన్ దేర్ హోమ్ స్టేట్స్ లో  తమిళనాడు సీఎం స్టాలిన్  ను స్వరాష్ట్ర ప్రజల బెస్ట్ సీఎం అంటున్నారు, ఆ  రాష్ట్రంలో 42  శాతం మంది ఆయనకు ఓట్లు వేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు, అలాగే ప్రజాదరణలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 38 శాతం తో రెండవ స్థానం లో, కేరళ ముఖ్యమంత్రి పినరయి  విజయన్  35 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

Best CM in India

మోస్ట్ పాపులర్ సిఎమ్స్ ఇన్ దేర్ హోమ్ స్టేట్స్ లో టాప్ 10 లో  ఏపీ  సీఎం జగన్ పేరుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా టాప్ టెన్ జాబితాలో లేదు.

ఈ సర్వేలో భాగంగా 19  రాష్ట్రాల్లో 115 లోక్ సభ  నియోజకవర్గాల్లో  230 అసెంబ్లీ స్థానాల్లో గత నెల 10-12  తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సర్వే కొనసాగింది.

ఇవి కూడా చదవండి :
కొత్తగా మార్కెట్లోకి వస్తున్న మడత ఫోన్లు – అద్భుతమైన ఫీచర్లతో
ఇప్పుడు గూగుల్ మీట్ లో అదిరిపోయే కొత్త ఫీచర్
అదిరిపోయే ఫీచర్స్ – గూగుల్ పిక్సెల్ 6 సిరీస్
ఐఫోన్ 13 వచ్చేస్తోంది వివరాలివే!