Tirumala New Steps Way : తిరుమల భక్తుల కోసం అలిపిరిలో సిద్ధమైన కొత్త ఒక నడక మార్గాన్ని అక్టోబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నాలు టీటీడీ చేస్తుంది.
నాలుగు నెలలుగా మూసివేసిన అలిపిరి మెట్ల మార్గాన్ని (Tirumala New Steps Way) అక్టోబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నాలు టీటీడీ చేస్తుంది, గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ అలిపిరి మెట్ల మరమ్మత్తు పనులు చేస్తుంది, దాదాపు 36 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి, రిలయన్స్ 25 కోట్ల రూపాయలు విరాళంగా అందిస్తుంటే, మరో 11 కోట్ల రూపాయలు మాత్రమే టీటీడీ కేటాయిస్తుంది.
అలిపిరి నడక మార్గానికి (Tirumala New Steps Way) సంబంధించి 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి పైకప్పులు శిథిలావస్థకు చేరుకున్నాయి, అవి ఎప్పుడు భక్తులపై పడి పోతాయో అన్నటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలోఈ కొత్త మార్గాన్ని నిర్మిస్తున్నారు, అలిపిరి మార్గం నుచి నరసింహ స్వామి ఆలయం వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీవారి పాదాల మండపం నుంచి గాలిగోపురం వరకు పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు పూర్తిచేసింది టీటీడీ, ఇక గాలి గోపురం నుంచి జింకల పార్కు సంబంధించి దాదాపు 30 ప్రాంతాలలో స్లాబ్ నిర్మాణం చేపట్టిన అటువంటి పరిస్థితులు ఉన్నాయి.
జింకల పార్కు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు దాదాపు అరవై ప్రాంతాలలో స్లాబ్ ఏర్పాటు చేయవలసిన పనులు ఉన్నాయి, ఇవన్నీ మరో 15 రోజుల్లో పూర్తి చేసేలా ప్రస్తుతం ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు, సెప్టెంబర్ చివరి కల్లా అలిపిరి నడక మార్గాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు పూర్తిచేసి, భక్తులను అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అనుమతించేలా టీటీడీ ఏర్పాటు చేస్తుంది.
అక్టోబర్ 7వ తేదీన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అంతకుముందే భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
పైకప్పు పనులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి విధానానికి భిన్నంగా టీటీడీ ప్రస్తుతం నిర్మాణ చేపడుతుంది, గతంలో ఫ్లాట్ రూఫ్లు ఉండడం వల్ల వాటి పై నీటి నిల్వలు ఏర్పడి, తర్వాత శ్లాబ్ లు ఎప్పుడు పోతాయో అన్న పరిస్థితి కి చేరుకుంది, ఆ నేపథ్యంలో ప్రస్తుతం రూఫ్ కి సంబంధించి ఒక విభిన్న తరహాలో నిర్మాణం చేస్తున్నారు.
వి షేప్ లో ఉండేలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు, దీనివల్ల వీటిపై నీటి నిల్వలు ఉండే అవకాశాలు ఉండవు, వర్షాకాలంలో కూడా శ్లాబ్ లపై నీరు ఉండదు, దీనితో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండవు.
ప్రస్తుతం చేపట్టినటువంటి కట్టడాలు, మరో 50 సంవత్సరాలపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు, అలిపిరి నడక మార్గం (Tirumala New Steps Way) నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు కాలినడకన విచ్చేస్తుంటారు, ఈ మార్గంలో ప్రతి నిత్యం 20 వేల నుంచి 40 వేల మంది భక్తులు నడక సాగిస్తుంటారు, శ్రీవారి మెట్టు నడక మార్గం 5 వేల నుంచి 10 వేల మంది భక్తులు మాత్రమే ప్రయాణం సాగిస్తుంటారు.
అక్టోబర్ మొదటి వారంలో ఈ అలిపిరి నడక మార్గంను (Tirumala New Steps Way) భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ E.O. ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మూడు దశలకు సంబంధించిన పనులలో మొదటి దశ పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో రెండు మూడు దశలకు సంబంధించినటువంటి పనులను మరో 15 రోజుల్లో పూర్తి చేసి సెప్టెంబర్ చివరి కల్లా పూర్తిగా మరమ్మత్తు పనులు పూర్తి చేసే విధంగా ప్రస్తుతం ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, ఆ దిశగా కూడా పనులు కొనసాగుతున్నాయి.