Corona 3rd Wave : కొత్త వేరియంట్ బలం పుంజుకొని విజృంబిస్తే వ్యాక్సిన్ లు ఏమి చేయలేవన్న అంచనాలు భయానక భవిష్యత్తును కళ్ళకు కడుతున్నాయి.
కొత్త వేరియంట్ (Corona 3rd Wave ) బలం పుంజుకొని విజృంబిస్తే వ్యాక్సిన్ లు ఏమి చేయలేవన్న అంచనాలు భయానక భవిష్యత్తును కళ్ళకు కడుతున్నాయి, మిగతా దేశాల సంగతి పక్కన పెడితే జన సాంద్రత విపరీతంగా ఉన్న మన దేశం లో థర్డ్ వేవ్ వస్తే పరిస్థితులు ఊహించడానికి కూడా వీలు లేనంత దారుణంగా మారతాయి అనడం లో ఎలాంటి అనుమానం లేదు.
ఇండియా లో మొదటి వేవ్ అంత తీవ్రంగా రాలేదు, దీనితో కరోనా ని జయించేశామని భ్రాంతిలో ప్రభుత్వాలు మునిగిపోయాయి, అదును చూసి దెబ్బ కొట్టిన సెకండ్ వేవ్ దాటికి ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలింది.
దేశ విభజన కంటే దారుణమయిన విషాదాలను చూడాల్సి వచ్చింది, ఆధునిక సాంకేతిక యుగం లో ఊహకు కూడా అందనంతగా జరిగిన ప్రాణ నష్టాన్ని దేశం భరించాల్సి వచ్చింది, అయితే సెకండ్ వేవ్ పీక్స్ స్టేజ్ లో ఉన్నప్పడు అత్యంత అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వాలు వైరస్ కాస్త నెమ్మదించగానే మళ్ళీ సడలింపులు ఇచ్చేశాయి.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భీకర దాడి తప్పదని పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది, కరోనా వేవ్ లు ఎన్ని వచ్చినా వాటికి విరుగుడు వాక్సినేషన్ మాత్రమే, టీకా తో పాటు యాంటీ బాడీలు వ్యాధి వ్యాప్తి అవకుండా నిరోధిస్తాయి, కానీ యాంటిబాడీ ల శాతం ప్రాంతాల వారీగా మారుతుందని సీరో సర్వే చెబుతుంది.
దేశం లో వాక్సినేషన్ కార్యక్రమమం ఆశించినంత వేగంగా సాగని మాట నిజమే అయినా 18 ఏళ్లు దాటిన పెద్దల జనాభాలో సగం మందికి కనీసం ఒక విడత వ్యాక్సిన్ అందించిన మైలు రాయిని దేశం దాటింది, అలాగే ఒకే రోజు కోటి వ్యాక్సిన్ లు వేసిన రికార్డు కూడా నమోదు అయినది.
మరో కొత్త వేరియంట్(సీ.1.2), అన్నీ వేరియంట్లకు ఒకటే విరుగుడు సాధ్యమేనా ?
భయపడినంతగా జరుగుతుంది, మనం భయపడుతున్నట్లే కరోనా వైరస్ రూపాంతరం చెందింది, కరోనా కొత్త వేరియంట్ ను సౌత్ ఆఫ్రికా లో గుర్తించారు, మరికొన్ని దేశాలకు కూడా విస్తరించిన కొత్త వేరియంట్ మళ్ళీ కోవిడ్ కల్లోలాలకి కారణం అవుతుందన్న ఆందోళన కన్పిస్తుంది.
డెల్టా వంటి కొత్త వేరియంట్లతో కరోనా ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోంది, ఇప్పుడు మరో కొత్త స్ట్రెయిన్ ను వైద్య నిపుణులు గుర్తించారు, కొత్త రకం వేరియంట్ ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని గుర్తించారు, కొత్త రకం వేరియంట్ ను సీ.1.2 గా పిలుస్తున్నారు, సౌత్ ఆఫ్రికా లో కొత్త రకం వేరియంట్ వెలుగు చూసింది, ఈ ఏడాది మే నెలలో కొత్త వేరియంట్ ను గుర్తించారు.
ఆగస్టు నెల నాటికి చైనా, కాంగో, మారీషస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ లలో కూడా ఈ వేరియంట్ విస్తరించింది, కరోనా బీటా, డెల్టా వేరియంట్ మాదిరిగానే కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుందని గుర్తించారు, సీ.1.2 పేరుతో పిలిచే కొత్త వేరియంట్ కూడా యాంటీ బాడీలను తట్టుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఫస్ట్, సెకండ్ వేవ్ విజృంభన ఆధారంగా థర్డ్ వేవ్ కి సిద్దం కావాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడవ ముప్పుకు (Corona 3rd Wave ) అవకాశం ఉంది, ఇప్పుడు మరో కొత్త వేరియంట్ అందరినీ భయపెడుతోంది, అదే సీ.1.2.
అందుబాటులో ఉన్న రక్షణ వ్యాక్సిన్ లను అధిగమించి ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం దీనికి ఉందని శాస్త్రజ్ఞులు తెలిపారు, సార్స్ కొ 2 వేరియంట్ లు అన్నిటికన్నా వేగంగా మ్యూటెంట్ అయ్యే లక్షణం దీనికి ఉందని సౌత్ ఆఫ్రికా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
థర్డ్ వేవ్ కి (Corona 3rd Wave ) రెండు మూడు నెలలు టైమ్ ఉందని అనుకోవద్దని, కొన్ని రాష్ట్రాలలో కేసుల పెరుగుదలతో ఇప్పటికే ముందస్తు సంకేతాలు కన్పిస్తున్నాయని ICMR హెచ్చరించింది.
థర్డ్ వేవ్ (Corona 3rd Wave ) దేశం అంతటా ఉండకపోవచ్చు అని, సెకండ్ వేవ్ అంత తీవ్రత కూడా ఉందని అన్నారు, నిభందనలు పాటించకున్నా, పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడినా, రాబోయే పండుగలు సూపర్ స్పైడర్ లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.