జాతీయం-అంతర్జాతీయం

Haldiram Snacks : హల్దీరామ్స్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు

haldirams snacks
Haldiram Snacks : హల్దీరామ్స్,  హల్దీరామ్స్ ఉత్పత్తుల గురించి మీకు తెలుసా? కొన్ని ఆశక్తికరమయిన విషయాలు.

హల్దీరామ్స్ ఉత్పత్తులు (Haldiram Snacks ) భారతదేశ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి, ఈ సంస్థ ఉత్పత్తుల విషయానికి వస్తే భారతీయ సాంప్రదాయాలను దృష్టి లో ఉంచుకొని వాటిని తయారు చేస్తుంది, ఇలా 400 కు పైగా ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తేగా అందులో కుకీస్, స్వీట్స్, ఊరగాయలు, పాపడ్ లు మరెన్నో భారతీయ రుచులు ఉన్నాయి.

హల్దీరామ్స్ (Haldiram Snacks ) యొక్క  ప్రయాణం రాజస్థాన్ లో ఉన్న ఒక చిన్న దుకాణం నుంచి ప్రారంభం అయినది, హల్దీరామ్స్ రాజస్థాన్ లోని బికనీర్ లో మొదలయింది, ఇది ప్రపంచ ప్రఖ్యాత బికనీర్ భుజియా, ఉప్పగా ఉండే చెరుకు అది, బికనీర్ లోని దాదాపు ప్రతీ ఒక్కరూ భుజియాను తయారు చేస్తారు, కానీ హల్దీరామ్స్ మాత్రం ఒక ప్రత్యేకమయిన గుర్తింపు ఉంది, ఈ సంస్థ భారతదేశము లో నమ్కీన్ లను బ్రాండ్ చేసిన మొట్టమొదటి సంస్థ అయింది.

haldirams snacks

1937 లో హల్దీరామ్ అగర్వాల్ అని పిలువబడే గంగా బిషన్ అగర్వాల్ భుజియాను విక్రయించడానికి  బికనీర్ లో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు, గంగా బిషన్ అగర్వాల్ తాత అయిన  తన్సుఖ్ దాస్ భుజియా తయారీని ప్రారంభించారు, హల్దీరామ్ దానిని ముందుకు తీసుకువెళ్ళి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

1990 లో ఈ హల్దీరామ్ (Haldiram Snacks ) బ్రాండ్ ఢిల్లీ లోని హల్దీరామ్, కోల్‌కత్తా లోని హల్దీరామ్ భుజియావాలా, నాగ్ పూర్ లోని హల్దీరామ్ ఫుడ్స్  అని మూడు భాగాలుగా విడిపోయినది.

మొదటిది ఉత్తరాన ఉన్న మార్కెట్లపై దృష్టి పెడితే, రెండవది తూర్పున ఉన్న మార్కెట్లపై  పనిచేస్తుంది, మూడవది పశ్చిమ, దక్షిణాది మార్కెట్లలో పని చేస్తుంది, ఈ సంస్థ అధినేత ప్రతీ ఉత్పత్తి నాణ్యతను, రుచిని నిత్యం పర్యవేక్షించేవారు, ఆ సంప్రదాయం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది, అందుకే నేటికీ ఉత్తమమయిన వాటిని మాత్రమే హల్దీరామ్ అందిస్తోంది.

haldirams snacks

హల్దీరామ్స్ ఉత్పత్తులను (Haldiram Snacks ) నేటికీ ఇంట్లోనే తయారుచేస్తూ ఉంటారు, ప్రతీ ఉత్పత్తి పరిశీలన ప్రక్రియ పూర్తి అయిన తరువాతే బయటకి వస్తుంది. నాణ్యత, రుచిలో ఏకరూపత సారూప్యత,అద్భుతమయిన ప్యాకేజింగ్, బలమయిన పంపిణీ వ్యవస్థ వల్ల నేడు భారత దేశ వ్యాప్తంగా ఈహల్దీరామ్స్ బ్రాండ్ బాగా ప్రాచుర్యం పొందింది.

ముడి పదార్థాల ధరలు పెరిగినా, పన్నుల భారం పెరిగినా కూడా హల్దీరామ్స్ తన ఉత్పత్తుల ధరలను ఎప్పుడూ పెంచలేదు, అందుకే ఈ సంస్థ తయారుచేసిన స్నాక్స్, సావరీస్, స్వీట్స్, రెడీమేడ్ ఫుడ్, కుకీస్, బిస్కెట్లు, పాల ఉత్పత్తులు, ఊరగాయలు, పండ్ల రసాలు, ఇలా నాలుగు వందల రకాల ప్రొడక్ట్స్ ను హల్దీరామ్స్  ఉత్పత్తి చేస్తుంది.

haldirams snacks

2015 నాటికి, భారతదేశం యొక్క  రూ.5,500 కోట్ల సాంప్రదాయ స్నాక్స్ వ్యాపారం లో ఈ హల్దీరామ్స్ అనేది  40% వాటాను కలిగి ఉంది, ఇంకో ఆసక్తికరమయిన విశేషం ఏమిటంటే, ఇప్పటి వరకు మంచి అభివృద్ది ఉన్నప్పటికీ ఈ సంస్థ వేరే సంస్థల నుంచి ఫైనాన్సింగ్ పొందడానికి ప్రయత్నించలేదు, కానీ పోటీ పెరిగే కొద్దీ, వారు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికీ, ఉన్న వియోగదారులను మెయింటైన్ చేయడానికి ఆకర్షణీయమయిన నినాదాలను, రంగురంగుల హోర్డింగు లతో ముందుకు వస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి :
Maldives Beach : మాల్దీవుల గురించి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
Corona 3rd Wave in India : అక్టోబర్ నుండి తారాస్థాయికి చేరనున్న కరోనా!
Goa Corona : కరోనాను నియంత్రించడానికి లాక్ డౌన్ ను పొడిగించిన గోవా సర్కార్ ఎప్పటివరకో తెలుసా!
Panjshir Afghanistan : ఆర్మీ వర్సెస్ తాలిబన్ యుద్ధం