Maldives Beach : మాల్దీవుల గురించి మనకు తెలియని కొన్ని విషయాలు- అవేంటో తెలుసుకోండి మరీ.
మన అసియా లో అతి చిన్న దేశం, వివాహం అయిన వారికి హనీమూన్ అంటే మొదటగా వినిపించే పేరు మాల్దీవ్స్, మన సెలబ్రెటీలు కూడా చాలామంది ఇక్కడికి తరచూ వెళ్తుంటారు, మాల్దీవ్స్ ను పర్యాటకులకు స్వర్గధామం అని చెప్పాలి, అలాంటి అందమైన దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏషియా లో అతి చిన్న దేశం మాల్దీవులు (Maldives Beach), ఈ మాల్దీవులకు ఒక చరిత్ర ఉంది, అక్కడి వారు చెప్పే కథల ప్రకారం కోయి మాలై అనే సింహళ యువరాజు, శ్రీలంక చక్రవర్తి కుమార్తెతో మాల్దీవ్ ల లగూన్ లో చిక్కుకున్నాడు, చివరికి అక్కడే ఉండి పోయి అక్కడ రాజ్యాన్ని పాలించాడు, అలా మాల్దీవ్స్ కి మొదటి సుల్తాన్ గా పరిపాలన చేశాడు.
అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం తీరాల నుండి చాలామంది నావికులు ఇక్కడికి వచ్చేవారు, ఇలా జాలర్ల తో నిత్యం చాలా రద్దీగా ఉండేది ఈ ప్రాంతం, ముఖ్యంగా మూప్లా సముద్రపు దొంగలు ఈ ప్రాంతాన్ని ఎంతో ఇబ్బందికి గురి చేశారు.
16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఈ దీవులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు, 1558 నుంచి 1573 వరకు పోర్చుగీసువారు పాలించారు, వారి పాలన నచ్చక మహమ్మద్ అల్ ఆజామ్ అనే దేశభక్తి గల వీరుడు వారిని తరిమేశాడు, తర్వాత అక్కడి ప్రజలు హిందూమతం, బౌద్ధమతం పాటించేవారు.
1796 నుంచి బ్రిటిషర్లు ఈ దేశాన్ని పాలించి జూలై 25 1965న ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు, ఈ తర్వాత ఈ దేశంలో గణతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఈ దీవులు 1965లో స్వాతంత్రం పొందిన కూడా ఇక్కడ మూడు సంవత్సరాలు సుల్తాన్ పరిపాలన కొనసాగింది.
చూడచక్కని పగడపు దీవులు తో కలిసి ఉన్న ఈ దేశం మూడు వందల చదరపు కిలోమీటర్లు ఉంది, ఇక్కడ భూమి 40 శాతం సముద్రం, 60 శాతం భూమిని కలిగి ఉంది, ఈ దేశంలో మొత్తం 1100 చిన్న దీవులు ఉన్నాయి, ఇందులో 287 దీవులు పర్యాటక, వ్యవసాయం కోసం వాడుతున్నారు, మిగిలిన దీవుల దగ్గరికి టూరిస్టులు వెళతారు కానీ, ఎలాంటి సౌకర్యాలు అక్కడ ఉండవు.
ఈ దేశ జనాభా 5.50 లక్షలు ఉంది, మరో విషయం ఏమిటంటే ఈ దేశంలో 36 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు
మాల్దీవుల కి ఆసియా నుంచి ప్రతి సంవత్సరం 60 శాతం మంది టూరిస్టులు వస్తూ ఉంటారు, ప్రపంచంలో అతి చిన్న ఇస్లామిక్ కంట్రీ కూడా.
మాల్దీవుల రాజధాని మాలే, మాల్దీవ్స్ దేశ కరెన్సీ రూఫియా, మన రూపాయి ఇక్కడ ఐదు రూపాయల తో సమానం, ఈ దేశంలో అధికారిక భాష ధివేహీ.
మాలే నగరం రంగురంగుల భవనాలతో ఎంతో అందంగా ఉంటుంది, ఇక్కడ లైబ్రరీలు, ఫిష్ మార్కెట్ లు చాలా ప్రసిద్ధి గాంచినవి, మనం ఎన్నడూ చూడని అనేక రకాల సీ ఫుడ్స్ ఇక్కడ ఉంటాయి.
మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ అనేక శతాబ్దాల నుంచి మత్స్య పరిశ్రమ, సముద్ర ఉత్పత్తుల పైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ఇక్కడ ప్రజల జీవన ఆధారం ఈ పరిశ్రమలే, అందుకే ఈ దేశ ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది, మాల్దీవుల మత్స్య (Maldives Beach) పరిశ్రమ జాతీయ స్థూల ఆదాయంలో 15 శాతానికి పైగా ఉంది, అంతేకాదు దేశంలోని 30 శాతం పైగా జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది.
దేశం మొత్తం 105 పర్యాటక రిసార్ట్ లు పనిచేస్తున్నాయి, దాంతో పాటు పర్యాటక రంగం తో పాటు చాపల (Maldives Beach) అల్లకం, లక్క పని, హస్తకళలు, కొబ్బరి తాళ్ల తయారీ, ఇలా సాంప్రదాయక కుటీర పరిశ్రమలు ఉన్నాయి.
కొత్తగా ప్రింటింగ్ కంపెనీలు, పివిసి పైపులు తయారీ, ఇటుకల తయారీ, సముద్రం (Maldives Beach) లో ఉపయోగించే ఇంజన్ల మరమ్మతుల కంపెనీలు, దుస్తుల పరిశ్రమలు పెట్టారు.
మాల్దీవ్స్ ప్రజలు తన ఉనికిని కాపాడుకోవడానికి, మహా సముద్రం నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి కాపాడుకోవడానికి “ద సిటీ ఆఫ్ హోప్” అనే ఒక ఆధునిక నగరాన్ని నిర్మించుకుంటున్నారు, సముద్ర గర్భం నుంచి ఇసుకను బయటకు తీసి పోగేసి సముద్రమట్టానికి రెండు మీటర్ల ఎత్తున ఉండేలా కృత్రిమ దీవిని సిద్ధం చేస్తున్నారు.
ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న మాల్దీవ్స్ (Maldives Beach) లో చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి, మరి అవేంటో చూద్దాం.
- రోడ్డు మీద కిస్ లు, హగ్ లు ఇచ్చుకోవడం ఇక్కడ నేరం.
- ఇక్కడికి వేరే చోట నుంచి ఆల్కహాల్ తీసుకురాకూడదు.
- అక్కడ బికినీ వేసుకున్న అక్కడ రిసార్ట్ లో మాత్రమే వేసుకోవాలి.
- ఈ దేశంలో ఫిల్టర్ లీటరు నీటిని మాత్రమే తాగాలి, నేరుగా టాప్ నీటిని తాగకూడదు.
- పంది మాంసం, పొగాకు ఉత్పత్తులు, డ్రగ్స్ ఎవరైనా తీసుకొచ్చిన, వాడిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు.
- ఇక్కడ ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.
- సముద్రం దగ్గర చెత్త వేయకూడదు.
- ప్లాస్టిక్ కూడా ఎక్కువ వాడకూడదు, సముద్రంను చాలా శుభ్రంగా ఉంచాలి.
- ఇక్కడ బ్లాక్ టార్టాయిస్ అమ్మడం నేరం.
- ఇక్కడ వ్యభిచారం నేరం.