జాతీయం-అంతర్జాతీయం

Panjshir Afghanistan : ఆర్మీ వర్సెస్ తాలిబన్ యుద్ధం

Panjshir Afghanistan
Panjshir Afghanistan : తాలిబన్ ప్రతిఘటన నాయకుడు  అహ్మద్‌ షా మసూద్‌ చర్చలు విఫలం అయ్యాయి, ఆర్మీ వర్సెస్ తాలిబన్ యుద్ధం మొదలైంది.

పంజ్ షీర్ (Panjshir Afghanistan) లో యుద్ధం మొదలైంది, తాలిబన్లు పంజ్ షీర్   ఎంట్రెన్స్ దగ్గరికి చేరుకున్నారు, తాలిబన్ ప్రతిఘటన నాయకుడు  అహ్మద్‌ షా మసూద్‌ చర్చలు విఫలం అయ్యాయి.

వేలాది మంది తాలిబన్  యోధులు పంజ్ షీర్ (Panjshir Afghanistan) కు బయల్దేరారు, కాబూల్ కు  150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజ్ షీర్ ను  సొంతం చేసుకోవాలనే  లక్ష్యంతో ఉన్నారు తాలిబన్లు, అదంతా   సులభం కాదని అంటున్నారు అహ్మద్‌ నాయకత్వంలోని పంజ్ షీర్ బలగాలు.

Panjshir Afghanistan

పంజ్ షీర్ ఎంట్రెన్స్ దగ్గరకు తాలిబాన్ లు  చేరుకున్నట్టు ట్వీట్ చేశారు ఆఫ్ఘన్  తొలి ఉపాధ్యక్షుడు  అమృల్లా సలై, ఇప్పటికే  పంజ్ షీర్  వ్యాలీ  వైపు  వచ్చే సలాంగ్ హైవే ను తమ బలగాలు   మూసివేసాయని  తెలిపారు, గతంతో పోలిస్తే పంజ్ షీర్ ప్రతిఘటన దళాలు మరింత బలపడ్డాయి అని  మొదటి  నుంచి చెబుతున్నారు అమృల్లా సలై.

పంజ్ షీర్ (Panjshir Afghanistan) యుద్ధ వీరులతోపాటు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి చెందిన సైనికులు  కూడా తమతో ఉన్నారని  చెప్పుకొస్తున్నారు, 6 వేల మందికి   ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని చెప్పుకొచ్చాడు.

Panjshir Afghanistan

పంజ్ షీర్ ను  హస్తగతం  చేసుకునే శక్తి తాలిబాన్లకు లేదని చెపుతున్నారు అక్కడి నాయకుడు అహ్మద్ మసౌద్,, యుద్దాన్ని  తాము ఎప్పుడూ కోరుకోవడం లేదని, తాలిబన్లు వినకపోతే పోరాడడానికి తాము సిద్ధంగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు, ఇప్పుడు తాలిబన్ బలగాలు పంజ్ షీర్ ను  చేరుకోవడంతో యుద్ధం మొదలైనట్టే అని తెలుస్తోంది.

యుద్ధానికి కావలసిన ఆయుధాలు పేలుడు పదార్థాలు కూడా పంజ్ షీర్ బలగాలు సిద్ధం చేసుకున్నాయి.

talibans afghanistan

ఇప్పుడు పంజ్ షీర్ బలగాల దగ్గర హెలికాప్టర్లు, మిలటరీ వాహనాలు, యుద్ధ ట్యాంకులుకూడా   ఉన్నాయి తెలుస్తోంది, సోవియెట్  బలగాలను తిప్పి కొట్టినట్టే తాము తాలిబన్ బలగాలను కూడా తిప్పికొడతాం అంటున్నారు పంజ్ షీర్ లీడర్.

ఇటు తాలిబన్లు కూడా గతంతో పోలిస్తే చాలా  బలపడ్డారు, విదేశీ బలగాలతో పోరాటం చేసి యుద్ధంలో మరింత ఆరి తేరారు, అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన డంపుల్లో అత్యాధునిక ఆయుధాలను  తాలిబన్లు సొంతం చేసుకున్నారు.

talibans afghanistan

అమెరికాకు చెందిన  మిలటరీ వాహనాలు, తాలిబన్ల  వశం అయ్యాయి, అంతేకాదు లొంగిపోయిన ఆఫ్గాన్ బలగాల  నుంచి ఆయుధ సంపత్తిని తాలిబన్లు సొంతం చేసుకున్నారు.

సోవియట్ బలగాలతో యుద్ధం చేసిన రోజులకూ , ఇప్పటి రోజులకు కు పరిస్థితులు ఉన్నాయి. పంజ్ షీర్ యోధులు ఎంత బలంగా ఉన్నారో, తాలిబన్లు కూడా  అంతే బలంగా ఉన్నారు.

Panjshir Afghanistan

ఈ పరిస్థితులలో తాలిబన్లను పంజ్ షీర్  యోధులు తిప్పి కొట్టగలరా? సోవియట్ దళాల పైన సాధించిన నాటి విజయం ఇప్పుడు తాలిబన్ల పైన సాధ్యమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి :
పిల్లలకు సూది లేని కోవిడ్-19 వ్యాక్సిన్ వివరాలు చూడండి!
Corona 3rd Wave in India : అక్టోబర్ నుండి తారాస్థాయికి చేరనున్న కరోనా!
Goa Corona : కరోనాను నియంత్రించడానికి లాక్ డౌన్ ను పొడిగించిన గోవా సర్కార్ ఎప్పటివరకో తెలుసా!
ఐఫోన్ 13 వచ్చేస్తోంది వివరాలివే!