Corona 3rd Wave in India : అక్టోబర్ నుండి తారాస్థాయికి చేరనున్న కరోనా, దేశంలో కరోనా మూడవదశ ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ హెచ్చరిక.
దేశంలో కరోనా మూడవదశ (Corona 3rd Wave in India) ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ హెచ్చరించింది, మూడవ దశ అక్టోబర్ లో తారా స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని తెలిపింది.
నిపుణుల కమిటీ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి NITM సమర్పించింది, చిన్నారులు పెద్దసంఖ్యలో తర్వాత కరోనా బారిన పడితే దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు ఏమాత్రం సరిపోవని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
కరోనా మూడవదశ (Corona 3rd Wave in India) అక్టోబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు అని, పెద్దల వలె పిల్లలు కూడా ప్రభావితం కావచ్చని కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచనలు చేసింది, ఈ మేరకు కమిటీ తమ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు ఓ వార్తా సంస్థ కథనం పేర్కొంది.
మూడవ దశ లో చిన్నారులు భారీగా కరోనా బారిన పడి ఆసుపత్రి లో చేరే పరిస్థితి తలెత్తితే వైద్యసిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు వంటి వైద్య సేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవని నిపుణుల కమిటీ పేర్కొంది, అలాగే చికిత్స సమయంలో వైరస్ సోకిన పిల్లల తో వచ్చిన సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కోవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలని ప్రతిపాదించింది.
అలానే వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు టీకా వేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది, 3rd వేవ్ ను ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చిన్న పిల్లల వైద్య సేవల వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇటీవలే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
మరొకవైపు చిన్నారులకు టీకా అందించే దిశగా అడుగులు పడుతున్నాయి, మూడు రోజుల క్రితం అత్యవసర ఆమోదం పొందిన జైడస్ క్యాడిలా దేశం లో పన్నెండేళ్ళు దాటిన వారికి అందుబాటులోకి వచ్చింది, సెప్టెంబర్ మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభం కానున్నట్లు తెలిపింది, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ కూడా ప్రస్తుతం పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో భారత్ లో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టించింది. వైద్య సేవలు, ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా భాదితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా మూడవదశ (Corona 3rd Wave in India) ఆందోళన మొదలైంది, దానితో ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా వైద్య సదుపాయాల కల్పనకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రతీ వంద పాజిటివ్ కేసు లలో 23 మందికి ఆసుపత్రి లో వైద్య సేవలు అందేలా సన్నాహాలు చేయాలని ‘నీతి ఆయోగ్’ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది.