జాతీయం-అంతర్జాతీయం

Sisters Rebirth in Vizag : మళ్ళీ పుట్టిన అక్కాచెల్లెళ్లు.. ఇది దేవుడి లీలా? లేక మెడికల్ మిరాకిలా?

sisters rebirth in vizag
Sisters Rebirth in Vizag : మళ్ళీ పుట్టిన అక్కాచెల్లెళ్లు.. విశాఖలో అమ్మ కు దూరమైన ఇద్దరు చిన్నారులు సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజు అదే సమయంలోనే జన్మించారు.

పునర్జన్మల  మీద ఎవరి నమ్మకం వారిది, సైన్స్ కు అందని రహస్యాలు అప్పుడప్పుడు సాక్షాత్కారం అవుతాయి, విశాఖలో అమ్మ కు దూరమైన ఇద్దరు చిన్నారులు సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజు అదే సమయంలోనే జన్మించారు, మళ్లీ తమ పిల్లలే  తిరిగి పుట్టారని (Sisters Rebirth in Vizag) తల్లిదండ్రులు సంతోషంలో ఉంటే, వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే  కనిపిస్తుంది.

sisters rebirth in vizag

సెప్టెంబర్ 15, 2019 గోదావరి నది ప్రమాదాల్లో అతి పెద్ద విషాదం, రాజమండ్రి నుంచి భద్రాచలం బయల్దేరిన  వశిష్ట బోట్  గోదావరి నదిలో మునిగి పోయింది, దేవీపట్నం మండలం ఖర్చులూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జలసమాధి అయ్యారు.

sisters rebirth in vizag

ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన మూడేళ్ల గీతా వైష్ణవి, 18 నెలల ధాత్రి అనన్య మృతి చెందారు, బంగారు బొమ్మాల్లాంటి  పిల్లల్ని పోగొట్టుకున్న భాగ్యలక్ష్మి, అప్పలరాజు దంపతులకు భవిష్యత్తు అంధకారంగా  కనిపించింది, అప్పటికే భాగ్యలక్ష్మి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది, దీంతో ఇక పిల్లలు పుట్టరని క్రుంగిపోయారు, మళ్ళీ  పిల్లలు కావాలనే కోరికతో విశాఖ లో ఒక IVF సెంటర్ ను సంప్రదించారు.

sisters rebirth in vizag

కృత్రిమ గర్భాదారణ ద్వారా భాగ్యలక్ష్మికి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు (Sisters Rebirth in Vizag) పుట్టారు, సాధారణంగా అయితే ఇది సైన్స్  సాధించిన అద్భుతం, కానీ భాగ్యలక్ష్మి, అప్పలరాజు లకు  మాత్రం ఇది దేవుడిచ్చిన వరం, ఎందుకంటే మరణించింది ఇద్దరు ఆడపిల్లలు కాగా, ట్విన్స్ రూపంలో జన్మించింది కూడా ఇద్దరు ఆడపిల్లలే, అది ప్రమాదం జరిగిన రోజు మరియు అదే సమయానికి.

sisters rebirth in vizag

ఇది నిజంగా మిరాకిల్ అంటున్నారు వైద్యులు, వాస్తవంగా భాగ్యలక్ష్మికి అక్టోబర్ లో డెలివరీ అవ్వాల్సింది ఉంది, గత నెలలో ఒకసారి పురిటి నొప్పులు వచ్చాయి, అయితే ప్రీమెచ్యూర్  కావడంతో జాగ్రత్తలు తీసుకొని పురుడు వాయిదా వేశారు వైద్యులు,సెప్టెంబర్ 15 సాయంత్రం సమయంలో ఆపరేషన్ చేసి ఇద్దరు ఆడపిల్లలను బయటకి తీశారు, ఏ సమయానికి అయితే పిల్లలు అమ్మకు దూరం అయ్యారో అదే సమయానికి బిడ్డలు ఒడికి చేరడం నమ్మశక్యం కానీ నిజం అటున్నారు డాక్టర్లు.

ఇవి కూడా చదవండి :
Maldives Beach : మాల్దీవుల గురించి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
Schools Colleges Reopen : తెలంగాణా లో స్కూల్స్ తెరవడానికి హైకోర్టు ఏం చెప్పింది!
Tirumala New Steps Way : తిరుమల భక్తుల కోసం సిద్ధమైన కొత్త ఒక నడక మార్గం
Haldiram Snacks : హల్దీరామ్స్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు