Vijayawada: ఒక వ్యక్తి ఖాతా లో కోటి రూపాయలు! ఏం చేసాడో చూడండి.

Dalitha Bandhu Huzurabad

Vijayawada 1 Crore:

కోటి రూపాయలు ఖాతా లో పడితే ఎవరైన షాకవుతారు కదా , ఇలాంటి పరిస్థితే  విజయవాడ (Vijayawada) లోని వన్ టౌన్ లోని ఒక వ్యక్తి కి ఎదురు అయింది. అతని బ్యాంక్ ఖాతా లో కోటి రూపాయలు వచ్చేసరికి అతను చాలా సంబరపడ్డాడు. అతను ఒక వారం వరకు ఆగి, అతనికి ఏ బ్యాంకు నుంచి ఫోన్ రాకపోయేసరికి వారం తరువాత ఆ డబ్బులను డ్రా చేసుకొని అవసరాలకు వాడుకొని,  తన అప్పులు కూడా తీర్చుకున్నాడు, అయితే ఇంతలోనే ఉషోదయ మెడికల్స్ కంపెనీ వాళ్ళు తప్పుడు లావాదేవీ జరిగిన దానిపై విజయవాడ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేసారు, తరువాత వన్ టౌన్ సిఐ ఆ కేసు ను గురించి విచారించారు.

Vijayawada

Vijayawada వన్ టౌన్  సిఐ  మీడియా తో మాట్లాడుతూ “ఉషోదయ మెడికల్స్ కంపెనీ వాళ్ళకి లావాదేవీలు జరపడానికి రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అని, అయితే బ్యాంక్ ఆఫ్ బరోడ లో ఉన్న అకౌంటు ద్వారా కోటి రూపాయలు మరొక బంక్ ఐన ఇండియన్ ఓవర్సీస్ కి బదిలీ  చేసేటపుడు  చిన్న పొరపాటు జరిగిందని, వాళ్ళు  బ్యాంక్ చెక్ మీద అకౌంటు నంబర్ కరెక్టు గానే రాసిన గాని, వాళ్ళు నెఫ్ట్ ద్వారా బదిలీ చేసేటపుడు ఒక చలానా ఫాం లో మాత్రం ఒక నంబర్ తప్పు వేసిన దానికి బ్యాంక్ వాళ్ళు అది గమనించకుండా చలానా మీద వేసిన నంబర్ ఆధారంగా ఆ కోటి రూపాయలు ఆ నంబర్ కే బదిలీ చేసారని చెప్పారు. ఒక వారం తరువాత ఉషోదయ మెడికల్స్ యాజమాన్యం వారు వారి ఖాతాలో చూసుకుంటే డబ్బులు జమ కాలేవు అని వాళ్ళకి అర్దమైంది, తరువాత బ్యాంకు లో వెరిఫై చేసుకుంటే ఉమర్ ఖాన్ అనే వ్యక్తి ఖాతా లో కి జమ అయినది అని తెలుసుకున్నారు. తరువాత వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. సిఐ, ఉమర్ ఖాన్ అనే వ్యక్తి ని పిలిపించి  అతని ద్వార ఆ డబ్బుని రికవరీ చేసి అకౌంట్ ను సీజ్ చేసారు అని సిఐ తెలిపారు.” ఒక చిన్న పొరపాటు వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందో కదా.

ఇది కూడా చదవండి : బంగారం, తగ్గిన వెండి ధరలు