సినిమా

PSPK28: పవన్‌కళ్యాణ్ మరో సినిమా

Mythri Movie Makers @MythriOfficial

Pawan Kalyan New Movie PSPK28:

పవన్‌కళ్యాణ్ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ సినిమాకు (PSPK28) సంబంధించి ఆయన  అభిమాని  తయారు (క్రియేట్)  చేసిన పవన్‌కళ్యాణ్ ఫోటోతో పాటు,  పలు వార్తలు సామాజిక మాధ్యమాల(సోషల్ మీడియా) లో ఆ సినిమా గురించి చక్కర్లు కొడుతున్నాయి,  ఈ సందర్భం లో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది.

PSPK28
Photo credit: Madhu2honey/Wikipedia

‘‘పవన్‌కళ్యాణ్ 28వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ మరియు టైటిల్‌ ఈ ఏడాది ఉగాది రోజున విడుదల చేయాలని అనుకున్నాం.  అయితే, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం,  ప్రస్తుతం సామాజిక మాధ్యమాల(సోషల్ మీడియా) లో ఆ సినిమా గురించి అనేక వార్తలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి, అభిమానులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి,  సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అఫిషియల్(అధికారిక) అకౌంట్స్ ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తాం’’ – అని ట్విటర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ తెలిపారు.

PSPK28 Movie @MythriOfficial
Photo credit: @MythriOfficial/twitter.com

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు,  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్‌ యర్నేని,  వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని (PSPK28) నిర్మిస్తున్నారు, మరోవైపు పవన్‌కళ్యాణ్ వరుస సినిమాలతో జోరు మీదున్నారు,  ఇప్పటికే పవన్‌కళ్యాణ్ యొక్క ‘హరి హర వీరమల్లు’ మరియు ‘అప్పయనుమ్‌ కొషియుమ్‌’ రీమేక్‌ సినిమా ల షూటింగ్‌ మొదలైంది,  కరోనా కారణంగా వాటి చిత్రీకరణ వాయిదా పడింది, ప్రభుత్వం సినీమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన వెంటనే పవన్‌కళ్యాణ్ గారు రంగంలోకి దిగనున్నారు.

ఇది కూడా చదవండి : నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు