Telugu Kids Story: రవి అనే ఆరేళ్ళ అబ్బాయి తన తల్లిదండ్రులతో పాటు రామాపురం లో ఉండే వాడు, తన తండ్రి ఒక పేద రోజు కూలి. ఆ జీతం తోనే ఇల్లు ను నెట్టుకొస్తూ ఉండేవారు, వారికి చిన్న ఖర్చు కూడ ఏదో పెద్ద కష్టం లాగా అనిపించేది.
ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడ వర్షాలు మొదలయ్యాయి, రవి దగ్గర గొడుగు లేకపోవడం తో తడుస్తూ ఎలాగో అలా స్కూల్ కు చేరుకున్నాడు, కాని ఆలస్యం అయిపోయింది. తనని చూడగానే టీచర్ ఇలా అంది “రవి అక్కడే ఆగిపో నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను వర్షం లో తడుచుకుంటు రావొద్దు అని, వర్షం లో గొడుగు వేసుకోని రావాలని”, అన్నది.
అప్పుడు తన తోటి విద్యార్థులు టీచర్ తో “గొడుగు ఉంటే కదా తీసుకు రావడానికి, ప్రతీ సారి అంటుంటాడు, వచ్చే ఏడాది గొడుగు తీసుకొస్తానని, కాని తీసుకురాడు” అని రవిని ఎగతాళి చేసారు.
అప్పుడు టీచర్ రవి తో, నువ్వు ఇలా తడిసి వస్తే తరగతి లోకి అనుమతించను, నీ వల్ల తరగతి మొత్తం పాడవుతుంది అని అన్నది, ఇక రవి తరగతి బయటే నిల్చోని పాఠాలు విన్నాడు.
తరువాత రోజు రవి వాళ్ళ నాన్న తో గొడుగు కొనమని అడిగాడు, వాళ్ళ నాన్న తప్పకుండా కొనిస్తాను, త్వరలోనే కొంటాను అని అంటాడు , కాని వాళ్ళ అమ్మ ఎలా కొంటారు, మీకొచ్చె జీతం తో మనకు పూట కూడ సరిగ గడువదు కదా అని అనుకుంటు బాధ పడుతారు.
ఇంకా రవి ఆరోజు స్కూల్ కి వర్షం లోనే వెళతాడు, వర్షం బాగా ఎక్కువయ్యేసరికి ఒక చెట్టు కింద ఆగుతాడు. తరువాత చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు. అలా మధ్యాహ్నం అవుతుంది , రవి కి ఆకలి వేయటం మొదలవుతుంది, సరిగ్గా అదే చెట్టు కిందకి ఒక సాధువు కూడ వచ్చి నిల్చుంటాడు. తరువాత రవి తన టిఫిన్ డబ్బా తీసి తినడం మొదలు పెడతాడు, ఒక చపాతి ముక్క తీసి తింటాడు, అపుడు సాధువు తనని చూస్తాడు. తరువాత ఇంకో ఒక చపాతి ముక్క తీసి తింటాడు మళ్ళి సాధువు తనని చూస్తాడు, ఇంకో ముక్క తీసి తింటున్నప్పుడు తనని సాధువు చూడడం గమనిస్తాడు.
అప్పుడు రవి సాధువు తో బాబా తింటారా అని అడుగుతాడు, అపుడు బాబా రవి తో నాకు రెండు ముద్దలు పెడితే నీకే మేలు జరుగుతుంది అని, ఈ రోజు వర్షం కారణంగా నాకు భిక్ష దొరకలేదు అని అంటాడు.
అప్పుడు రవి తన దగ్గర ఉన్న రెండు చపాతిలు తనకి ఇచ్చి, తను ఎందుకు ఇక్కడ ఉన్నాడో సాధువు కి తన బాధ చెప్తాడు, అప్పుడు ఆ సాధువు రవి మంచితనానికి మెచ్చుకోని ఒక మంత్రించిన గొడుగు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రవి ఆ గొడుగు తీసుకోని స్కూల్ కి వెళతాడు.
Telugu Kids Story: ఆరేళ్ళ బాలుడు – అద్భుత గొడుగు
స్కూల్ అయిపోయాక వర్షం మొదలవుతుంది, కొంతమంది దగ్గర గొడుగు ఉండదు, అది చూసి రవి మీరు ముగ్గురు నా గొడుగు లోకి వచ్చేయండి అని అంటాడు, మేము ముగ్గురం అంత చిన్న గొడుగు లో ఎలా పడుతాం అని అంటే పూర్తిగా తడిసిపోవడం కన్నా ఇది మంచిది కదా అని అంటాడు, వాళ్ళు వెళ్ళి గొడుగు కింద నిలబడతారు, మిగిలిన మిత్రుల వద్ద కుడా గొడుగు లు గాలికి కొట్టుకు పోతాయి, అప్పుడు రవి మీరు కూడా రండి అనగానే వారు వచ్చి నిలబడగానే ఆ గొడుగు మరింత పెద్దగా మారి పోతుంది, అది చూసి అందరు ఆశ్చర్యపోతారు రవి తో పాటు.
ఇంకా వారు ఊర్లోకి వెళుతుంటారు, మధ్య మధ్య లో ఆ గొడుగు కింద ఇంకా వారు కుడా వచ్చి నిల్చు ఉంటారు, ఆ గొడుగు పెరుగుతూ ఉంటుంది, అది చూసే వారికి గోవర్ధన పర్వతాని పైకెత్తిన శ్రీకృష్ణుడు లాగా రవి కనిపిస్తునాడు.
ఒక రోజు తరవాత, ఆ ఊరి జమీందారు రవి ఇంటికి వచ్చి అడుగుతాడు, మీ దగ్గర అద్భుత గొడుగు ఉందట కదా అని..
దానిని మన ఊరి మంచి పని కోసం వినియోగిద్దాం అని ఒక సలహా చెప్తాడు, ” ఆ గొడుగు కింద అందరిని నిలబెట్టి రవి గొడుగు పట్టుకొని చెరువుకి ఊరుకి మధ్యలో నిలబడితే, గొడుగు చెరువు నుండి కాలువ దాక పెద్దయిపోతుంది, అపుడు వాన నీరు మొత్తం చెరువులోకి లేదా కాలువలోకి పోయి పడుతుంది. అపుడు ఊరికి సంవత్సరమంతా నీళ్ళ సమస్య తీరిపోతుంది అని అంటాడు”.
ఇక జమీందారు చెప్పినట్టుగానే రవి అచ్చం అలానే చేస్తాడు. అపుడు వర్షం నిజంగానే గొడుగు మీదుగా పడి చెరువులొకి మరియు కాలవలోకి వెళ్లిపోతుంది, ఇక ఇలా రోజు చేసేసరికి ఊరు చెరువు మొత్తం నిండి పచ్చని పంట పొలాలకి సరిపడే నీరు అందుతుంది. రవి వల్లనే చెరువు నిండినదని, పొలాలు పండాయి అని రవిని మెచ్చుకుంటారు.
ఒకరికి సహాయం చేస్తే మనకి అది ఏ విధంగా అయిన తిరిగి ఇంకో రూపం లో మనకి మంచి చేస్తుంది.