Top Directors :కెరీర్ లో హిట్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ తీసే ప్రతీ మూవీ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడం అనేది డైరెక్టర్‌కు పెద్ద టాస్క్. ఒక బ్లాక్‌బస్టర్ ఇచ్చాక ఆ డైరెక్టర్ తీసే తరువాత మూవీ మీద చాలా అంచనాలు ఉంటాయి.
ఇలా ఒత్తిడిలో చాలా మంది డైరెక్టర్ కన్‌ఫ్యూస్ అయిపోయి ఫ్లాప్స్ ఇస్తుంటారు, కాని మొదటి సినీమా నుండి చాలా తక్కువ సందర్భాలలో ఫ్లాప్స్ ఇస్తూ మినిమం ఖచ్చితమైన వినోదాత్మక కంటెంట్ తో మన తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నారు కొందరు డైరెక్టర్స్.
మరి అలా దాదాపు హిట్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ మనల్ని చాలా అరుదుగా నిరుత్సాహ పరిచే డైరెక్టర్స్ లిస్ట్ (Top Directors) లో మన తెలుగు డైరెక్టర్స్ ఎవరున్నారో ఒకసారి చుసేద్దాం.
1. ఎస్ ఎస్ రాజమౌళి
- సినిమాలు- 11
- బ్లాక్‌బస్టర్స్- 11
Top Directors: ఎస్ ఎస్ రాజమౌళి తీసిన 11 సినిమాల్లో ప్రతి సినిమా హిట్ సినిమాలే, తీసే ప్రతీ సినిమాకి ఆయన మీద అంచనాలు పెరిగిపోతున్నా కూడా ప్రతి సినిమా కి ఒక స్టోరీ, ఒక కొత్త అనుభూతి ని ఇస్తూ తీసిన సినిమాలనే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టేలా తీసాడంటే అది మన జక్కన్నకే సొంతం.
అందుకే ఈ లిస్ట్ లో మన రాజమౌళి గారిదే మొదట స్థానం.
ఎస్ ఎస్ రాజమౌళి మగధీర, ఈగ, బాహుబలి, బాహుబలి 2 వంటి గొప్ప భారి (VFX) చిత్రాలను తీసాడు.
ఆయన ఇంకా “RRR” (రైస్ రోర్ రివోల్ట్) అని ఇంకో భారి చిత్రానికి దర్శకత్వం చేస్తున్నారు.
ఈ చిత్రం మీద ఆడియెన్స్ కి చాల అంచనాలు ఉన్నాయి, మగధీర చిత్రాన్ని ₹ 79.26 కోట్లు పెట్టి తీసారు, మరియు బాహుబలి ని ₹ 218.80కోట్లు, బాహుబలి 2 ను 1276.98 కోట్లు పెట్టి నిర్మించారు, వాటికి కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.
2.కొరటాల శివ
- సినిమాలు- 4
- బ్లాక్‌బస్టర్స్ – 4
Top Directors: మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను నాలుగు సినిమాలను కొరటాల శివ తీసాడు, తీసింది నాలుగు సినీమాలు అయిన కూడా ఆయన హీరోల కి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్ హిట్‌లే ఇచ్చాడు, కొరటాల శివ సినిమా వస్తుంది అంటే చాలు హిట్ బొమ్మ అని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యే స్థాయికి ఎదిగారు.
కొరటాల శివ భవిష్యత్తులో నిర్మించబోయే చిత్రాలు ఆచార్య, AA21, NTR30.
3.త్రివిక్రం శ్రీనివాస్
- సినిమాలు -11
- హిట్‌లు-10
- ఫ్లాప్స్- 1
Top Directors: గురూజి కెరీర్ లో ఒక అఙ్యాతవాసి ని పక్కన పెడితే మిగతా సినిమాలు అన్ని ఎబౌవ్ యావరేజ్ మరియు సూపర్ హిట్ యె. అదేంటి ఖలేజా కూడా ఫ్లాప్ అయింది కదా అని అంటారా.అది అప్పుడు క్లాసిక్ యె ఇప్పుడు క్లాసిక్ యే అని జనాలే అంటున్నారు.ఆయన సినిమాలు మినిమం గ్యారంటీ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.
ఈయన అలా వైకుంఠపురంలో, అరవింద సమేత , అ ఆ, S/O సత్యమూర్తి, అత్తారింటికి దారేది వంటి గొప్ప హిట్ చిత్రాలను అందించాడు.
4.అనిల్ రావిపూడి
- సినిమాలు- 5
- హిట్‌లు- 5
Top Directors: అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ తో మొదలు పెడితే తరువాత వచ్చిన సుప్రీం, రాజా ద గ్రేట్, ఎఫ్2 (F2) మరియు మన సూపర్‌స్టార్ తో తీసిన సరిలేరు నీకెవ్వరు అన్ని ఎంటర్టైనింగ్ తో కామెడీ తో కూడి ఉన్నాయి.
అనిల్ రావిపూడి సినిమా అంటే థియేటర్ కి వెళ్ళిన ఆడియెన్స్ మొహం లో మొదటి నుండి చివరి వరకు ఒక చిరునవ్వు ఉండాలి అని ఒక ట్రెండ్ సెట్ చేసాడు.
ఈయన ఎఫ్3(F3) ని ఎఫ్2(F2) కి సీక్వెల్ ని తీయబోతున్నారు.
5.వంశీ పైడిపల్లి
- సినిమాలు-5
- హిట్‌లు – 4
- సాధారణంకన్నా ఎక్కువ- 1
తన మొదటిసినిమా మున్నా సినిమా ఇచ్చిన అనుభవం వల్ల ఏమో వంశీ తన తరువాతి నాలుగు సినిమాలను పక్కగా రాసుకోని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాడు, మున్నా తరువాత వచ్చిన బ్రృందావనం, ఎవడు, ఊపిరి, మరియు మహర్షి అన్ని హిట్లె.
6.సుకుమార్->
- సినిమాలు -7
- హిట్‌లు- 5
- సాధారణంకన్నా ఎక్కువ- 2
సుక్కు తీసిన అన్ని సినిమాలు అందరికి నచ్చాయి.
జగడం, 1(నేనొక్కడినే), ఆర్య2 సినిమాలు థియేటర్ లో ఆడకపోయిన చాలా అభిమానులు ఈ సినిమాలకు, ఈయన సినిమాస్ అంటే లాజిక్స్, ఎమోషన్స్, పాటలు అన్ని పక్కగా ఉంటాయి.
సుకుమార్ 100% లవ్, ఆర్య 2, వన్ నేనొక్కడినే, నాన్నకి ప్రేమతో, రంగస్థలం వంటి మంచి చిత్రాలను తీసాడు.
7.క్రిష్ జాగర్లమూడి ->
- సినిమాలు -7
- హిట్‌లు- 5
- సాధారణంకన్నా ఎక్కువ – 2
క్రిష్ మొదటి సినిమా గాయం తరువాత వేదం, క్రిష్ణం వందే జగద్గురుం, కంచె మరియు గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలు ఏది ఆడియెన్సును నిరుత్సాహ పరుచలేదు.
కాని ఆ తరువాత ఎన్‌టిఆర్ బయోపిక్ కొంచెం నిరుత్సాహ పరిచాయి కాని క్రిష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటది.
8.సురేందర్ రెడ్డి ->
- సినిమాలు- 9
- హిట్‌లు-6
- ఫ్లాప్స్- 3
అతనొక్కడే లాంటి సినిమా తోనే బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఆ తరువాత తీసిన అశోక్, అతిధి తో నిరుత్సాహ పరిచాడు, కాని మళ్ళి కిక్ , ఊసరవెల్లి, రేసుగుర్రం, ధృవ, మరియు సైరా నరసింహారెడ్డి తో తను ఎంటో నిరూపించుకున్నాడు.