జాతీయం-అంతర్జాతీయంలైఫ్ స్టైల్

Diamond Rain: వజ్రాల వర్షం కురిసే గ్రహాలు

Diamond
Diamond Rain: జూపిటర్ గ్రహం పైన  వర్షం కురిసినట్లు ఆకాశం నుండి వజ్రాలు (Diamonds) కురుస్తాయి, వాతావరణం లో ఉండే అత్యధిక పీడనం కారణంగా గ్రాఫైట్ వజ్రాలుగా మారి వర్షాలుగా కురుస్తాయి.

లక్షలాది జీవులకు ఆశ్రయం ఇస్తున్న మన భూమిపై వాతావరణం అన్ని రకాలుగా ఉంటుంది, సరైన సమయానికి ఋతువులు వస్తాయి, సరయిన కాలం లో వర్షాలు కురుస్తాయి.

స్వచ్ఛమయిన నీటితో కూడిన జీవ జలం వర్షంలా కురుస్తుండడం వల్లే భూమి సమస్త జీవులకు ఆవాసంగా మారింది, ఇక్కడ మంచు కూడా కురుస్తుంది, అందుకే భూమి అన్ని రకాల జీవాలతో విరబూసింది.

అయితే ఇప్పడివరకు మనకి తెల్సిన ఖగోళ పరిజ్ఞానం మేరకు మరి ఏ ఇతర గ్రహం పైన కనిపించలేదు, మనం నివసించే సౌర కుటుంబం లోను ఒక్కో గ్రహం లోనూ ఒక్కో రకమయిన వాతావరణం ఉంటుంది, ఒక్కో రకమయిన వర్షం కురుస్తుంటుంది.

ఒక గ్రహం పైన కరిగిన ఇనుము వర్షం లా కురిస్తే మరో గ్రహం పై ఏకంగా వజ్రాలే (Diamonds) కురుస్తాయి, నమ్మలేరు కదూ!.. కాని అదే నిజం..

గంటకి 8వేల కిలోమీటర్ల వేగం తో గాలులు వీచే గ్రహాలు ఉన్నాయి, ఇనుము సైతం కరిగిపోయె అంత ఎండలు కాచే గ్రహాలు కూడా ఉన్నాయి.

ఇంతటి విపరీతమయిన వాతావరణ పరిస్థితులు ఉన్న గ్రహాలు ఎక్కడో కాదు మన సౌర కుటుంబం లోనే ఉన్నాయి, అవి భూ గ్రహానికి పూర్తి భిన్నంగా ఉండే వాతావరణం కలిగి ఉంటాయి, మొదట మెర్క్యురీ గ్రహం గురించి చూద్దాం.

Diamond Rain

Mercury : మెర్క్యురీ అంటే బుధ గ్రహం, సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే ఈ గ్రహం పై విపరీతమయిన ఉష్ణోగ్రతలు ఉంటాయి, అందుకే ఇక్కడ వాతావరణం అసలే ఉండదు, అందుకే గ్రహం పై అసాధారణ పరిణామాలు సంభవిస్తాయి.

పగటి సమయం లో 800డిగ్రీల సెంటిగ్రేడ్ల వరకు ఉండగా రాత్రి సమయం లో మైనస్ 300 డిగ్రీలకి పడిపోతుంది, వాతావరణం లేని కారణంగా అక్కడ వర్షం, గాలి అవేమి ఉండవు, సూర్యుడు నుండి వచ్చే సోలార్ మాలిక్యూల్స్ కారణంగా సోలార్ తుఫానులు సంభవిస్తూ ఉంటాయి.

Venus : వీనస్ గ్రహం అనగా శుక్ర గ్రహం. వీనస్ అనే అందమయిన పేరున్న ఈ గ్రహం పైన సౌర కుటుంబం లోనే అత్యంత దుర్భరమయిన వాతావరణం ఉంటుంది.

ఈ గ్రహం పై ఒక పొరలా కార్బన్ డయాక్సైడ్ కప్పబడి ఉంటుంది, సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఒక్కోసారి వేడి 900 ల డిగ్రీ ఫారెన్ హీట్ వరకు వెలుతుంది, ఇక్కడ వర్షం కురుస్తుంది, కాని అది నీరు మాత్రం కాదు, ఇదంతా సల్ఫర్ యాసిడ్ తో నిండి ఉంటుంది.

ఇలాంటి వర్షం లో తడిస్తే చర్మం చూస్తుండగానే కాలిపోతుంది, అయితే విపరీత ఉష్ణోగ్రత ల కారణంగా వర్షం కిందకి పడేలోపే ఆవిరై పోతుంది, ఇంత తీవ్ర స్థాయి లో ఉష్ణోగ్రత ఉన్నపటికి ఇక్కడ మంచు కూడా ఉండడం విచిత్రం, అయితే ఈ గ్రహం మీద మనుషులు నివసించడానికి ఎట్టి పరిస్థితుల్లోను వీలు కాదు.

Jupiter : జూపిటర్!… మీరు నమ్మండి నమ్మకపోండి, ఇక్కడ వర్షం కురిసినట్లు ఆకాశం నుండి వజ్రాలు (Diamonds) కురుస్తాయి, ఇక్కడ వాతావరణం లో ఉండే మీథేన్ వర్షం కార్బన్ గా మారి గ్రాఫైట్ గా రూపాంతరం చెందుతాయి, వాతావరణం లో ఉండే అత్యధిక పీడనం కారణంగా గ్రాఫైట్ వజ్రాలుగా మారి వర్షాలుగా కురుస్తాయి.

ఒక సెంటిమీటర్ డయా మీటర్ లో వజ్రాలు కురుస్తుంటాయి, ఈ రెండు గ్రహాలపై ఉండే వాతావరణం లో సాధారణంగా హైడ్రోజన్ ఉంటుంది, రెండు గ్రహాలపై యావరేజ్ గా 160 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు ఉంటాయి, అదే శని గ్రహం పై 218ల ఉష్ణోగ్రత ఉంటుంది.

ఇది కూడా చదవండి : కరోనా నిర్ధారణ ఫేస్ మాస్క్ తో -సెన్సార్ టెక్నాలజీ మాస్క్