జాతీయం-అంతర్జాతీయం

Corona Test : కరోనా నిర్ధారణ ఫేస్ మాస్క్ తో -సెన్సార్ టెక్నాలజీ మాస్క్

Corona Test
Corona Test : ఫేస్ మాస్క్ తో కరోనా నిర్ధారణ చేయవచ్చు అని హార్వర్డ్ అండ్ ఏంఐటి (MIT)రీసర్చర్లు గుర్తించారు. సరికొత్తగా కనిపెట్టిన సెన్సార్ టెక్నాలజీ ద్వారా కరోనా నిర్ధారణ చేయవచ్చు అని అంటున్నారు, దానికోసం హార్వర్డ్ అండ్ ఏంఐటి (MIT)రీసర్చర్లు సెన్సార్ టెక్నాలజీ ను అభివృద్ది చేసారు.

ఈ మాస్క్ ధరించిన వారికి కరోనా ఉందో లేదో సులభంగా కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడం లో ఇది బాగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు, ఈ టెక్నలజీ ద్వారా శ్వాస లో కరోన వైరస్ కణాలు ఉన్నాయో లేదో అనేది (Corona Test) ద్వారా   90 నిమిషాల్లో అనగా  ఒక గంటన్నర లో ఇది చెప్పేస్తుంది.

ఈ మేరకు శాస్త్రవేత్తలు విడుదల చేసిన శాస్త్రీయ అధ్యయనం లో తెలిపారు.

సెన్సార్ టెక్నాలజీ ఫేస్ మాస్క్(Sensor Technology Face Mask Corona Test) ను ధరించగానే ఫేస్ మాస్క్ పైన అమర్చిన సెన్సార్ ఫీచర్ బటన్ యాక్టివేట్ అవుతుంది.

దీనిని మనం ప్రెగెన్సీ టెస్త్ చేసుకునే లాగానే ఫలితాలను చూసుకోవచ్చు, ఈ ఫలితాలు పిసిఆర్ (PCR) పరీక్షల లాగా కరెక్ట్ ఫలితాలు అని శాస్త్రవేత్తలు తెలిపారు.

Corona Test

ఫేస్ మాస్క్ లతో పాటు ప్రోగ్రామబుల్ బయోసెన్సర్లను (programmable bio sensor ) ఇతర దుస్తులతో కలిపి ధరించడం  ద్వార ప్రమాదకరమయిన పదార్థాలను ముందుగానే కనిపెట్టవచ్చని చెబుతున్నారు. వారి మూడేళ్ళ నిరంతర శ్రమే ఈ సెన్సార్ టెక్నాలజీ అని చెప్పుకొచ్చారు.

పరిశొదకులు సెన్సార్ టెక్నాలజీ ను మొదట 2015 లో జికా (zika) వైరస్ ను కనుగొనడానికి ఒక టూల్ గా వాడారు, అందులో వచ్చిన ఫలితాలు వారికి సంతృప్తిని ఇచ్చాయి, ఇప్పుడు దానికే మరి కొంత టెక్నాలజీ ను జోడించి ఫేస్ మాస్క్ లాగా పెట్టుకునేలాగా అభివృద్ది చేసారు.

ఈ పరిశోధనకు హార్వర్డ్ యూనివర్సిటీ జాన్సన్ & జాన్సన్ మరియు డిఫెన్స్ థ్రేట్ రిడక్షన్ ఏజన్సీ లు నిధులని అందించాయి.

సెన్సార్ టెక్నాలజీ ఫేస్ మాస్క్ ను వాడేవారు స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా హానికరమయిన మందులకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చు.

దీని ద్వారా ప్రమాదకరమయిన పదార్థాలు మరియు వ్యాధికారక వస్తువులతో పనిచేసే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నర్సులు,సైనిక సిబ్బంది హానికరమయిన, ప్రమాదకరమయిన వాయువులకు గురయ్యే స్థలాల్లో వాడుకోవచ్చునని చెప్పారు.

ఇది కూడా చదవండి : 22 లక్షలు తెచ్చిపెట్టిన మైక్రోసాఫ్ట్ బగ్