China Sun: సృష్టికే ప్రతి సృష్టి చేస్తున్న మానవ మేథస్సు ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణకి శ్రీకారం చుట్టింది, కనీవిణి ఎరుగని అధ్భుతాన్ని కళ్ళముందు ఉంచింది, ఇటు మనుషులనే కాదు అటు సూర్యుడిని కూడా షాక్ తినేలా చేసింది.
భగ భగ మండే భానుడికి సైతం పోటి దారుడు వచ్చేసాడు, జీవి మనుగడాను శాసిస్తున్న సూర్యుడు కూడా షాకయ్యే రీతిలో వేడిని పుట్టిస్తున్నారు.
ఈ భూగోళానికి సూర్యుడు ఒక్కడే అని అందరికి తెలుసు, కాని ప్రస్తుతం అది మారిపోయింది, ఎందుకంటే ఇప్పుడు చైనా కృత్రిమ సూర్యుడిని (China Sun) రంగం లోకి దించింది.
కొన్నేల్ల క్రితం చైనా ఈ విషయం చెపితే అన్ని వట్టి మాటలే అనుకున్నారు చాలా మంది, కాని దానిని నిజం చేసి చూపించింది డ్రాగన్ కంట్రీ .
సూర్యుడు కాస్త కన్నెర్ర చేసిన తట్టుకోలేనిది ఏకంగా భూమ్మీద సూర్యుడి శక్తిని పునర్‌సృష్టి చేయడం సాధ్యమా అంటే ఇంతకాలం అందరూ అసాధ్యమే అని అనుకున్నారు, కాని చైనా మాత్రం సాధ్యమేనని చేసి చూపించింది.
ప్రపంచ దేశాలపై తాము ఆధారపడకుండా ప్రపంచ దేశాలే తమపై ఆధారపడేలా చేయాలన్నది చైనా ఆధునిక సిద్ధాంతం.
అందులో భాగంగా ఆ దేశం ప్రతీది తమ కోసం ప్రత్యేకంగా తయారు చేసుకుంటోంది, భానుడి శక్తిని భూమ్మీద పొందేందుకు కృత్రిమ సూర్యుడిని (China Sun) అభివృద్ధి చేసింది.
దానిని ఆవిష్కరించడమే కాదు అత్యంత ఉష్ణోగ్రతతో మండించి అందరిని ఆశ్చర్యపరిచింది, ఇది నిజంగా అధ్భుతమే. మేధస్సుకు మేత పెట్టే ఆవిష్కరణే, అసలుకు నకిలికి తేడా లేకుండా ప్రత్నామ్నాయ వస్తువులను తయారుచేసే చైనీయులు సూర్యుడికి పోటి దారుడుని ప్రపంచానికి పరిచయం చేసారు.
సాధారణ సూర్యుడిని పోలిన దినకరుడిని దించేసారు, సాధారణంగా పొద్దున్నే కనిపించే సూర్యుడు సాయంత్రం కాగానే అస్తమిస్తాడు, కాని రాత్రయిన కనిపించే సూర్యుడిని (China Sun) చూపిస్తాం రండి అని అంటోంది చైనా.
సరికొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించడం లో చైనా ది అందవేసిన చేయి, ఇప్పడికే వివిధ రంగాలలో పలు రకాల ప్రయోగాలతో అగ్ర రాజ్యాలకే సవాలు విసురుతున్న డ్రాగన్ కంట్రి కొద్ది రోజుల క్రితం అరుణ గ్రహం పై రోవన్ ను సురక్షితంగా ల్యాండ్ చేయించి కొత్త రికార్డ్ ను సృష్టించింది, తాజాగా కృత్రిమ సూర్యుడిని సృష్టించడంలోను సక్సెస్ అయింది.
తాము ఏది అనుకుంటే అది చేసి తీరాల్సిందే అనే పంతం పట్టుకున్న చైనా స్యయంగా దేశీయ టెక్నాలజీ తో ఓ కృత్రిమ సూర్యుడిని (China Sun) తయారు చేసుకుంది, అయితే ఇది ఆకాశంలో కంపించే సూర్యుడు కాదు, నేలపై నిప్పులు కురిపించే సూర్యుడు కంటే రెట్టింపు శక్తిని అందించే రియాక్టర్లతో చేసిన సూర్యుడు, దాని పేరే హెచ్ హెల్-2ఎం (HL-2M) టోకామాక్ రియాక్టర్.
హెచ్ హెల్-2ఎం (HL-2M) ను చైనా మరో సూర్యుడు (China Sun) అని పిలుస్తున్నా ఇదో అణు విచ్చేదనా రియాక్టర్, ఇది అచ్చం సూర్యుడి తరహాలో పనిచేస్తుంది.
అణు ప్రక్రియ ద్వారా సూర్యుడు వేడిని సృష్టిస్తాడో చైనా రూపొందించిన ప్రయోగాత్మక అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ రియాక్టర్ ద్వారా ఆ ఉష్ణోగ్రతను సృష్టించారు, సిచువాన్ లో ఏర్పాటు చేసిన ఈ రియాక్టర్ లో శక్తివంతమయిన అయస్కాంత క్షేత్రం లో మెటల్ ప్లాస్మా ను విచ్ఛిన్నం చేస్తారు.
ఈ సంధర్బంగా పదిహేను కోట్ల డిగ్రీల సెల్సియస్ శక్తి రిలీజ్ అవుతుంది, సూర్యుడి పరమాణు కేంద్రం లో అత్యధిక శక్తి ఉంటుంది .అందులోని అణువులు విచ్ఛిన్నం అయినపుడు భారి శక్తి ఉత్పత్తి అవుతుంది.
చైనా తయారు చేసి రియాక్టర్ కూడా అదే విధంగా పని చేస్తుంది, పైగా సూర్యుడు విడుదల చేసిన శక్తి కంటే పది రెట్లు ఎక్కువ శక్తి విడుదల చేస్తుంది, హైడ్రోజన్, హీలియం అణుకలయికతో సూర్యుడికి మండే స్వభావం ఏర్పడుతుంది .
పదిహేను మిలియన్ సెల్సియస్ వద్ద సూర్యుడు ఎర్రటి నిప్పులను కక్కుతాడు, గతేడాది దీనిని యాక్టివేట్ చేసిన సమయం లోనే ఇరువయై సెకనులలో 160మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకింది, అంటే నిజమయిన సూర్యుడి నుంచి వచ్చే వేడిమి కన్న పదిరెట్లు అధిక వేడి ని ఉత్పత్తి చేసింది.
ఆ తరువాత మరోసారి నిర్వహించిన టెస్ట్ లోను ఈ కృత్రిమ సూర్యుడికి (China Sun) 100 సెకనులకు 180 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ వేడిని పుట్టించింది, తాజాగా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ 101 సెకన్ల పాటు 216 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ వేడిని సృష్టించింది, అంటే 120మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్పత్తి అయింది అన్నమాట.
సూర్యుడిలోను విచ్చిన్నం వల్లే కాంతి ఏర్పడుతుంది, భూమిపైన ఉన్న ప్రాణులకే సూర్యకాంతే ఆధారం, ఈ సూత్రాన్ని అనుసరించే చైనా ప్రభుత్వం ఈ కృత్రిమ సూర్యుడికి (China Sun) పురుడు పోసింది.
దీని సిచువాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది, ప్రస్తుతం చాలా దేశాలు కృత్రిమ సూర్యుడిని సృష్టించే పనిలో ఉన్నాయి, ఇప్పటికే దక్షిణ కొరియా రేసులోకి ఎంటర్ అవగా ఫ్రాన్స్ కూడా ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలు పెడుతోంది.
చైనా తో పాటు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సూర్యుడి కేంద్ర భాగం లోని ఉష్ణొగ్రత కంటే ఎక్కువ వేడి ని జ్వలింప చేసి అధ్భుతాన్ని సాధించారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కే-స్టార్ అనే కృత్రిమ సూర్యుడిని రూపొందించారు, దీనిని 100 మిలియన్ ఉష్ణొగ్రత వద్ద 20సెకన్ల కు పైగా మండించి అప్పట్లో రికార్డులు నెలకొల్పారు.
2008లోనే కే-స్టార్ లో న్యూక్లియర్ ఫ్యూజన్ సాధించగలిగారు, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు 2018లో 10కోట్ల ఉష్ణొగ్రతను 1.5సెకన్లపాటు కొనసాగేలా చేయగలిగారు.
చైనా, దక్షిణ కొరియా బాట లోనే ఫ్రాన్సు కూడా నడుస్తోంది, అక్కడ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను తయారు చేస్తున్నారు, ఇదంతా చూస్తుంటే అన్ని దేశాలు ఇంధనం, అణువాయుధాల కోసం ఆర్టిఫిషియల్ సూర్యుడిల బాట పడుతున్నారని అర్ధం చేస్కోవచ్చు.
చైనా ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి అణుపరిజ్ఞానం ఉన్న ప్రతీదేశమూ ఇదే పని చేస్తుంది, మన భారత్ కి కూడా అణుపరిజ్ఞానం ఉంది.
రష్యా, అమెరికా వంటి దేశాలు ఇదే పనిలో పడుతాయి, ఎందుకంటే దీని ద్వారా క్ళిన్ పవర్, చీప్ పవర్, రిలయబుల్ పవర్ లభిస్తుంది.
భారి థర్మల్, భారి సోలార్ ప్లాంట్లకన్నా ఇవి ఎంతో మేలు కాని ఈ విధానం లో భద్రత ఒక్కటే సందేహం, ఎందుకంటే అనేక దేశాలు రేడియేషన్ ప్రమాదాల భయం తో ప్లాంట్లు మూసేస్తున్నాయి, జరగరానిది ఏదైన జరిగితే ఎలా.
రియాక్టర్ లు పేలడం మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము, ఇంత భారి రియాక్టర్ పేలితే పరిస్తితి ఏంటి అనే భయం వారిని వెనుకడుగు వెయిస్తోంది, కాని చైనాకి మాత్రం అవేమి పెద్దగా పట్టడం లేదు .
చైనా లో పుట్టిన కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం కాలేదా, ఇప్పటికీ కొన్ని దేశాలు కరోనా వల్ల ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో వున్నాయి.
అలాగే ఈ రియాక్టర్‌కు ఏమైన జరిగితే ప్రపంచమంతా భరించాలిసిందే అవి విస్పోటనాలు కావొచ్చు, అణుధార్మిక వ్యాప్తి కావొచ్చు మరింకేదైన కావొచ్చు, అందుకే చైనా చర్యలతో ప్రపంచ దేశాల్లో వణుకు మొదలయింది.