జాతీయం-అంతర్జాతీయం

TRS MLA: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెర్యాల అతి పురాతనమైన ఆలయానికి విరాళం

TRS MLA

TRS MLA : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు చెర్యాల అతి పురాతనమైన ఆలయానికి రూ.లు.5,00,000/- విరాళం అందించారు.

ఈ రోజు (04-07-2021) ఉదయం గం.7.45 ని.లకు.. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం చెర్యాల గ్రామ శివారులో గల అతి పురాతనమైన శివాలయం మరియు  శ్రీ సీతారాముల వారి మందిరం పునర్ నిర్మాణం చేపట్టబడుచున్న సందర్భంగా మాన్యశ్రీ గూడెం మహిపాల్ రెడ్డి TRS MLA PATANCHERU గారు రూ.లు.5,00,000/- (ఐదు లక్షల రూ.లు) విరాళం ప్రకటించారు.

కొన్ని నెలల క్రితం ఈ ఆలయంలో విగ్రహాలను గుర్తుతెలియని కొంతమంది ఆగంతకులు ధ్వంసము చేయడం కారణంగా గ్రామస్తులు ఆలయాన్ని పునర్నిర్మించాలని అన్నే సంకల్పము తో చెర్యాల గ్రామస్తులు ఒక్క కమిటీగా ఏర్పడి నిధులు సమీకరిస్తున్నారు. 

TRS MLA: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెర్యాల అతి పురాతనమైన ఆలయానికి విరాళం

ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీ సి.చంద్రశేఖర్ TSGREA అధ్యక్షుడు, టి.నాగభూషణం TSGREA రామచంద్రపురం ఉపాధ్యక్షుడు తో కలిసి రామచంద్రపురం TSGREA  ముఖ్య కార్యకర్తలు శ్రీ సి హెచ్.రాములు, శ్రీ బి.వెంకటేశ్వర్లు, శ్రీ పి.శంకర్, శ్రీ నార్సిమ్లు తమ సంకల్పాన్ని ఎమ్మెల్యే మాన్యశ్రీ గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించుకున్నారు. 

తను ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, తన వంతు సహాయంగా మాన్యశ్రీ గూడెం మహిపాల్ రెడ్డి. TRS MLA PATANCHERU గారు రూ.లు.5,00,000/- (ఐదు లక్షల రూ.లు) విరాళంగా ఇచ్చారు. 

తానే స్వయంగా చేర్యాల గ్రామం చేరుకొని శివాలయం లో ప్రత్యేక  పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా మాన్యశ్రీ గూడెం మహిపాల్ రెడ్డికి గౌరవ పూర్వక సన్మానము చేయడం జరిగింది.

TRS MLA

ఈ కార్యక్రమం లో మాన్యశ్రీ చింతా ప్రభాకర్ సంగారెడ్డి మాజీ TRS MLA గారు, శ్రీ మెట్టు కుమార్ యాదవ్ కార్పోరేటర్ PTC గారు, తదితరులు పాల్గొన్నారు . అందరూ కలిసి ఆ భగవంతుని సన్నిధిలో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.