జాతీయం-అంతర్జాతీయంబిజినెస్

Sea Treasure : సముద్ర గర్భం లో 110 బిలియన్ డాలర్ల నిధి – ట్రెజర్ హంట్ రేసు లో భారత్

sea treasure
Sea Treasure : అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న భారత్ ఇప్పుడు సముద్ర గర్భం లో దాగిన ఖనిజ నిల్వల కోసం సాగర మథనం స్టార్ట్ చేయబోతోంది.

ఆకాశం అంతు చూసేస్తున్నాం, అంతరిక్షం అంచుల వరకు వెళ్ళిపోతున్నాం, మరి సముద్రం సంగతేంటి, సాగర గర్భం లో ఏముంది, అంతులేని జంతుజాలం తో పాటు అపారమయిన ఖనిజ నిల్వలు ఉన్నాయా?, ఉంటే అవెక్కడున్నాయి, అవి ఎలా ఉన్నాయి,  ఈ దిశగా భారత్ ఏమైన ప్రయత్నాలు చేస్తుందా చేస్తే అవి ఎంత వరకు వచ్చాయి, ఇప్పుడు తెలుసుకుందాం.

సాగర గర్భం లో సహజ వనరులు, కళ్ళు బైర్లు కమ్మే అంత ఖనిజ నిల్వలు, వేల మీటర్ల లోతున లక్షల కోట్ల సంపద..

sea treasure

ట్రెజర్ హంట్ రేసు లో భారత్ .. సాగర మథనానికి సై అంటున్న ఇండియా..

సముద్రం అంటే అంతులేని జల రాశి, ఈ అపారమయిన జలనిధే అనంత ప్రాణకోటికి జీవనాధారం, అయితే సముద్రం లో మత్స్య జాతులు, ముత్యపు చిప్పలు, పగడాల దిబ్బలే కాదు లెక్కలేనన్ని ఖనిజ నిక్షేపాలు కుడా ఉన్నాయి.

సల్ఫైడ్లు,ఫెర్రో మాంగనీస్, పాలీమెటాలిక్ వంటి అపార నిధి అంతా సాగర అంతర్భాగంలోనే నిక్షిప్తమై ఉంది, మరి మూడు వైపులా సముద్రాలనే కలిగి ఉన్న భారత్ ఏం చేస్తోంది, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, తూర్పున బంగాళా ఖాతం ఉన్నాయి. అయినా ఇప్పడి వరకు మనం వాటిని పెద్దగా పట్టించుకోలేదు, అక్కడి (Sea Treasure) సంపదను వెలికి తీయలేదు, కనీసం మన జలాల్లో కొలువైన ఖనిజాల విలువను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకంటే ఎన్నో వేల కిలో మీటర్ల అడుగున ఆ ఖనిజ నిధి (Sea Treasure) దాగి ఉంది కాబట్టి, వాటిని వెలికితీసే టెక్నాలజీ మన వద్ద లేదు కాబట్టి, కాని ఇప్పుడు పరిస్థితులు
మారాయి, అత్యాధునిక టెక్నాలజీని సైతం ఇప్పుడు భారత్ అందిపుచ్చుకుంటోంది.

సముద్ర గర్భం లో దాగిన ఖనిజ (Sea Treasure) నిల్వలపైన కన్నేసింది, సాగర మథనం స్టార్ట్ చేయబోతోంది, సాగర సంపద అయిన ఖనిజాలు,సహజ వనరుల్లో దాదాపు 95% వరకు సముద్ర గర్భం లోనె ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవాలంటే అవి ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకలాంటే సముద్రాలను అన్వేషించాలి, కాని అది ఆశా మాశీ విషయం కాదు. ఎందుకంటే ఇందుకోసం కిలో మీటర్ల లోతుకు వెళ్ళాలి. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే ఇలాంటి ప్రాజెక్ట్ ను చేపట్టుతాయి.

సాధారణంగా ఇలాంటి సముద్ర గర్భ కార్య కలాపాలన్నింటిని ఐక్యరాజ్యసమితి విభాగం అయిన ఇంటర్‌నేష్నల్ సీ బెడ్ అతారిటీ ఐ ఎస్ ఎ పర్యవేక్షిస్తుంది, ఆ సంస్థే 2002 లో హిందూ మహా సముద్రం లోని 75వేల చదరపు కిలో మీటర్ ల ప్రాంతాన్ని అన్వేషణ కోసం భారత్ కు కేటాయించింది.

మొదట్లో దీన్ని 15ళ్ళకు కేటాయించిన 2017 లో మరో ఐదేళ్ళు పొడిగించింది, అయితే భారత్ కు ఐ ఎస్ ఎ(ISA) కేటాయించిన భాగం లోనే భారీగా ఖనిజ నిధి (Sea Treasure) ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

sea treasure

అక్కడ 380 మిలియన్ టన్నుల(38 కోట్ల టన్నుల) ఖనిజాలు (Sea Treasure) ఉన్నట్లు అంచనా వేస్తున్నారు, వాటిలో 4.7 మిలియన్ టన్నుల నికెల్, 4.29 మిలియన్ టన్నుల రాగి, 0.55 మిలియన్ టన్నుల కోబాల్ట్ 92.59 టన్నుల మాంగనీస్ తో పాటు ఐరన్ భారీగా ఉంటాయని అంచనా వేసారు, వాటి విలువ 110 బిలియన్ డాలర్లు గా ఉంటుందని లెక్కగట్టారు, అంటే దాదాపు 10వేల కోట్లకి పైగా అన్నమాట.

కాలంతో పరుగులు పెడుతున్న ప్రపంచం, కాలానికి వేగంగా టెక్నాలజీ తో దూసుకుపోతోంది, అందుకే స్మార్ట్ ఫోన్ ల్యాప్‌టాప్ లు నిత్యావసర వస్తువులుగా మారాయి, అయితే వాటి తయారీకి కావల్సిన సరుకు మాత్రం భూమి ఉపరితలం మీద ఎక్కువగా అందుబాటులో లేవు, అందుకే హిందూ మహాసముద్రం మీద భారత్ దృష్టి కొనసాగించింది, సంద్రం లో చోటు చేసుకునే వాతావరణం మార్పుల అధ్యయనం తో పాటు సముద్రం నుంచి ఎనర్జీ, మంచి నీరు పొందే అవకాశాలు, సముద్ర జీవశాస్త్రం లో ఆధునిక సాంకేతికతకు పెద్ద పీట వేయడం వంటి అంశాలపై దృష్టి పెడతారు.

ఆధునిక వైద్యం లో కోబాల్ట్ కీలక పాత్ర పోషిస్తుండగా స్టీల్ తయారీలో నికెల్ అధికంగా అవసరం అవుతుంది, ముఖ్యంగా భవిష్యత్తు తరాన్ని శాషించనున్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈ ఖనిజ సంపద ఎక్కువగా ఉపయోగపడుతోంది, 75కిలో వాట్ల బ్యాటరీ ఉండే ఒక్కో విధ్యుత్ వాహననికి 56 కిలోల నికేల్ 12కిలోల మాంగనీస్,7కిలోల కోబాల్ట్, 85కిలోల రాగి అవసరం అవుతాయి,ఇప్పడికైతే ఇవి భూ ఉపరితలం మీద నుండి తీస్తున్నా అవి తరిగిపోయే అవకాశం ఉంది అందుకే సాగర గర్భం నుండి వెలికితేసె పనిలో ఉన్నారు.

భారత్ ఇప్పడికే మూలకాల కోసం చైనా పై అధికంగా ఆధారపడుతున్నది, ఐ ఎస్ ఏ (ISA) 29 లైసున్స్లు మంజూరు చేయగా అందులో నాలుగింటిని చైనా కైవసం చేసుకుంది.

సముద్ర గర్భం లో ఖనిజాన్వేషణ లో లాభాలు భారీగానే కనిపిస్తున్నా పర్యావరణం పడే ప్రభావాం విషయం లో చాలా ఆందోళనలు ఉన్నాయి, సరిగా అవగాహన లేకుండా తవ్వకాలు చేపడితే సరిదిద్దలేనంత స్థాయిలో నష్టం జరిగే చాన్స్ ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

భూ వాతావరణాన్ని క్రమబద్దీకరించడం లో కీలకపాత్ర పోషిస్తున్న మహా సముద్రాల్లో వాతావరణం దెబ్బతింటే మానవాళికే ప్రతికూల పరిస్థితులు ఎదురు అవుతాయని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి : సృష్టికి ప్రతి సృష్టి- ప్రచండ భానుడి ప్రతిరూపం (చైనా ప్రయోగం)