జాతీయం-అంతర్జాతీయం

Pangolin : పులి కూడా తినలేని జంతువు- మనిషి వేట తో మనుగడకే పెను ముప్పు

pangolin
Pangolin : చాలా మంది దీనిని చూసి పెంగ్విన్ అంటుంటారు, కాని ఇది పాంగోలిన్, దీని శరీరం పై ఉండే గట్టి పొలుసుల వల్ల పులులు సైతం పాంగోలిన్‌లను తినలేవు, ప్రపంచం లో ఎక్కువగా అక్రమ రవాణాకు గురయ్యే జంతువు పాంగోలిన్.

పాంగోలిన్ (Pangolin) జంతువు అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు థాయ్ ఇవాన్ ఇంగ్రియన్, 2014 లో సైంట్ వియత్నాం వైల్డ్ లైఫ్ స్థాపించిన థాయ్ ఇవాన్ దాదాపు 1500 పాంగోలిన్‌లను కాపాడారు.

పాంగోలిన్‌లు చాలా ప్రత్యేకమయినవి, మనకు ఎలాంటి హాని చేయవు, మనుషుల మీద దాడి చేయవు, కాని మానవులే వేటాడుతూ వాటికి ప్రమాదకరంగా మారుతున్నారు.

ఫారెస్ట్ రేంజర్స్ కు శిక్షణ ఇచ్చేందుకు వియత్నాం లో మొట్టమొదటి యాంటి పోచింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసారు థాయ్, జంతువులను అక్రమంగా వేటాడడాన్ని ఇది అడ్డుకుని శిభిరాలను ధ్వంసం చేసింది.

pangolin

పాంగోలిన్ మాంసం, పొలుసులకు బాగా డిమాండ్ ఎక్కువ, పాంగోలిన్ పొలుసులలో ఉండే ఔషధాలు ఆస్తమా, క్యాన్సర్ వంటి రోగాలను నయం చేస్తాయని చైనా, వియత్నాం ప్రజలు నమ్ముతుంటారు.

పాంగోలిన్ ప్రతిఘటించే జంతువులు కాదు కాబట్టి వేటగాళ్ళు వీటిని సులభంగా వేటాడగలరు.

విద్యార్థులు, ప్రజల కోసం పాంగోలిన్ సంరక్షణ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి, వియత్నాం మొట్టమొదటి పాంగోలిన్ పునరావాస కేంద్రాన్ని కూడా థాయ్ ఇవాన్ ఏర్పాటు చేసారు.

ఇది దాదాపు 500 పాంగోలిన్ లను తిరిగి అడవులకి పంపింది, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్‌మెంట్ సైతం థాయ్ ఇవాన్ కృషిని గుర్తించింది.

ఇది కూడా చదవండి : సముద్ర గర్భం లో 110 బిలియన్ డాలర్ల నిధి