Amazon Alexa : అమెజాన్ కు అలెక్సా తో చిక్కులు

Amazon Alexa
Amazon Alexa: అలెక్సా పేరున్న మనుషులపై జోక్స్ వేయడం తో పాటు వారిని హేళన చేయడం వల్ల నలుగురిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అమెజాన్ తన వాయిస్ అసిస్టెంట్ “అలెక్సా” వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన విషయం తెలిసిందే కదా. అయితే నిజానికి మన ఇళ్ళల్లోని అమెజాన్ ఎకో, ఎకో డాట్ స్పీకర్లకు వాయిస్ కమాండ్ ఇచ్చేందుకు “అలెక్సా” అనే పదాన్ని వాడటం సర్వ సాధారణం అయిపొయింది.

కాని ఇప్పుడు అదే “అలెక్సా” పేరు అమెజాన్ (Amazon Alexa) ఈ-కామర్స్ దిగ్గజానికి చిక్కులు తెచ్చి పెట్టింది, అలెక్సా పేరున్న మనుషులపై జోక్స్ వేయడం తో పాటు వారిని హేళన చేయడం వల్ల నలుగురిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హే గూగుల్. అన్నం తిన్నావా? హే గూగుల్, ఐ లవ్ యు! అలా అంటు చాలా మంది కుర్రాళ్ళు గూగుల్ వాయిస్ కమాండ్ ను ప్రశ్నిస్తూ టైంపాస్ చేయడం గమనిస్తూ ఉంటాం.

యాపిల్ ఫోన్లు వాడే వాళ్ళు కూడా “సిరి” విషయం లో ఇదే ధోరణి ని పాటిస్తుంటారు, కాని అమెజాన్ “అలెక్సా” విషయం లోనే ఆ పేరు ఎక్కువగా పాపులర్ కావడం వల్ల “అలెక్సా” పేరున్న మనుషులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పాఠశాల, కళాశాల, ఉద్యోగం చేసే స్థలాల్లో “అలెక్సా” పేరున్న మనుషులకు కామెంట్ చేస్తూ ఆట పట్టిస్తుండడంతో వారు చాలా మనస్తాపానికి గురవుతున్నారు, ఈ సంధర్భం లో వారు వారి పేరు చెప్పుకోడానికి ఇష్టపడకపోగా, కొంతమంది వారి పేరును సైతం మార్చుకుంటున్నారు.

Amazon Alexa

అమెజాన్ సంస్థ వర్చువల్ అసిస్టెంట్ “అలెక్సా” కారణంగా తమ పిల్లలు హేళనకు, ఎగతాళికి గురి అవుతున్నారని, ఇది వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని చాలా మంది తల్లితండ్రులు “అలెక్సా” అనే పేరును మార్చాలని అమెజాన్ ను ఒత్తిడి చేస్తున్నాయి.

ఒక మనిషిని అవమానిచడానికి “అలెక్సా” అనే పదం ఒక ఆయుధంగా మారిందని, అమెజాన్ “అలెక్సా” అనే పేరును పెట్టే ముందు కొంచెం కూడా మోరలిటీ గురించి ఆలోచించలేదని అంటున్నారు.

యుకే లోనే “అలెక్సా” అనే పేరున్న మనుషులు 4,000 మంది కి పైగా ఉండగా, అమెరికా, జర్మనీ లో ఉన్న ప్రజలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

అయితే ఈ అభ్యంతరాలపై అమెజాన్ సంస్థ స్పందిస్తూ ఇలా జరగడం చాలా బాధాకరం, దానికి మేము చింతిస్తున్నాం.. “అలెక్సా” (Amazon Alexa) పేరుకు బదులుగా ఉన్న “ఎకో, కంప్యూటర్, అమెజాన్” వంటి పేర్లను కూడా ఉపయోగించుకోవచ్చు అని సూచించింది.

ఇది కూడా చదవండి : పులి కూడా తినలేని జంతువు