సినిమా

Simran : సెకండ్ ఇన్నింగ్స్ తో సిమ్రాన్ రీ ఎంట్రీ-తొలిసారి గా విలన్ పాత్రలో

Simran
Simran makes her re-entry in Telugu movie with villain role

హీరోయిన్‌లందరూ ఇప్పుడు వారు తమ రూటు మార్చుకుంటున్నారు, ఒక్కప్పుడు అందానికే ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లు ఇటీవలి కాలం లో నటనకే వారి ప్రథమ ప్రాధాన్యత అని అంటున్నారు.

భారీగా రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినా కూడా వారికి ఆ పాత్ర నచ్చితే తప్ప చేయము అని చెప్పుతున్నారు, మొన్నటి వరకు స్టార్ హీరోయిన్లు గా ఉన్న వారు కొంచెం వయసు పెరిగితే అక్క పాత్రలోను, వదిన పాత్రలోను, తల్లి మరియు విలన్ పాత్రలోను నటించడానికి మొహమాట పడట్లేదు.

ఆ జాబితాలోకే ఇప్పుడు సిమ్రాన్ (Simran) కూడా వచ్చారు, ఒక్కప్పుడు సిమ్రాన్ అగ్ర హీరోలతో నటించారు, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో సిమ్రాన్ విలన్ గా (రీ ఎంట్రీ) ఇవ్వబోతున్నారు.

Simran

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న “సర్దార్” అనే సినిమా లో విలన్ గా నటించస్తుందని ప్రచారం.

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యం లో రానున్న ఈ సినిమా లో రజిషా విజయన్, రాశి ఖన్నా నటిస్తున్నారు, సిమ్రాన్ (Simran) పాత్ర మాత్రం ఈ సినిమా కు కీలకం అని ప్రచారం నడుస్తోంది.

పిఎస్ మిత్రాన్ దర్షకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి, ఈ చిత్రం షూటింగు ఆగష్టు నెలలో ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి : తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి