Reliance Jio Smart Phone (Next) 2021:మరో కొత్త స్మార్ట్ 5జి ఫోన్ను లాంచ్ చేయనున్న జియో

Reliance Jio
Reliance Jio జియో అనేదాన్ని ఈ తరం అస్సలు మరిచిపోదు, భారత దేశ పల్లెల ముఖ చిత్రాన్నే మార్చేసింది ఈ జియో, జియో కొత్త శుభవార్త మోసుకొచ్చింది. మరి వాటి సంగతులేంటొ చూద్దాం.

అంబానీ గారు అదిరిపోయే ఫోనును కొత్తగా విడుదల చేయనున్నారు, అదే ఈ జియో ఫోన్ నెక్స్ట్.

జియో (Reliance Jio) సిమ్ముల ఆఫర్లు లాగనే ఈ ఫోన్లను చాలా తక్కువ ధరకు అమ్మబోతున్నారు, ఇంకా దీని కంటే తక్కువ ధరకు వచ్చే ఫోను దేశం లోనే కాదు ప్రపంచం లోనే ఉండదు అని సమాచారం, దానిని అంత తక్కువ ధరకు అమ్మబోతున్నారట.

గూగుల్ సంస్థ వారు దీని మీద పెట్టుబడులు పెట్టారు, గూగుల్ మరియు జియో లు కలిసి ఈ సరికొత్త స్మార్ట్ ఫోను తయారు చేస్తున్నారు, వినాయక చవితి వరకు మార్కెట్లోకి దానిని విడుదల చేసే పనిలో ఉన్నారు, ఇది 4జి ఫీచర్ తో రానుంది.

Reliance Jio

5జి ఫీచర్లు ఉన్న ఫోన్లను కూడా తయారు చేసి వాటిని కూడా తక్కువ ధరకి అమ్మే ఆలోచన లో ఉన్నారు అంబాని.

భారత ఆర్ధిక వ్యవస్థ ఎగుమతులల్లో 2.8 శాతం ముఖేష్ అంబానీ వాటానే ఉంది.

అంబాని సంస్థ వారు కస్టమ్స్, ఎక్సైజ్ ట్యాక్స్ లు 21,000 వేల కోట్లు, జిఎస్‌టి కింద 85,000 కోట్ల రూపాయలు, ఇంకా వ్యాట్ కింద 3211కోట్ల రూపాయలు ఇన్‌కం ట్యాక్స్ కట్టారు దేశానికి.

ఇంకా వారు దేశానికి 3లక్షల 24వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు మరియు రిలయన్స్ కంపెనీ లో 35,000 ల కొత్త ఉద్యోగాలు కూడా కల్పించారు.

ఇది కూడా చదవండి : సిమ్రాన్ రీ ఎంట్రీ విలన్ పాత్రలో