జాతీయం-అంతర్జాతీయం

Congress Party 2021: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

Congress Party Chief
Congress Party: రేవంత్ రెడ్డి తెలంగాణా పీసీసీ అధ్యక్షులిగా నియమితులయ్యారు, రేవంత్ వర్గం ఫుల్ జోష్, ఫుల్ ఖుషీ లో ఉంది.

ఎంతో మంది కాంగ్రెస్ (Congress Party) కార్యకర్తలు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది, గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కాంగ్రెస్ (Congress Party) అధిష్టానం చాలా కసరత్తులు చేసింది పీసీసీ అధ్యక్షున్ని ఎన్నిక చేసే క్రమంలో.

ఆ క్రమం లోనే రాహుల్ గాంధీ సూచనల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్య ఠాకూర్ తెలంగాణా లో దాదాపు 170 మంది నేతల అభిప్రాయాలను ఆయన సేకరించారు.

ఒక్కరే విడివిడిగా ఒక్కొక్కరి అభిప్రాయాన్ని నమోదు చేసుకోని ఒక నివేదిక రూపం లో అధిష్టానికి సమర్పించారు.

ఆ నివేదిక ఆధారంగా అందులో మెజారిటీ వర్గం రేవంత్ రెడ్డి కే పార్టి పగ్గాన్ని అప్పగించాలని, ఆయనైతేనే పార్టీని ముందుకు తీసుకెళ్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

అదే అభిప్రాయాన్ని ఒక నివేధిక రూపం లో మానిక్య ఠాకూర్ అధిష్టానానికి ఇవ్వడం, అధిష్టానం ఆయన పేరును ఖరారు చేస్తూ ప్రకటించే సమయం లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు రావడం వల్ల కొంతమంది సీనియర్లు ఈ సమయం లో అధ్యక్షత మార్పు చేస్తే గనుక ఉప ఎన్నికల మీద ప్రభావం పడుతుందని అంటు అధిష్టానానికి చెప్పడం తో ప్రకటన వాయిదా పడింది, ఆ వాయిదా కాస్త మళ్ళి ఇన్నాలకు దానికి మోక్షం లభించిందని చెప్పవచ్చు.

ఈ లోపు కొంతమంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వర్గం సీనియర్లే కావచ్చు, వ్యతిరేకిస్తున్న నేతలే కావచ్చు వారంతా తమ తమ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

ఇక్కడ అధిష్టానానికి తమకు తెలిసిన వారి ద్వారా లేదా నేరుగా ఫిర్యాదులు చేయడం రేవంత్ కి ఇస్తే అసంతృప్తి కి గురవుతారు అంటూ ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు చేసుకుంటు వచ్చారు.

కాని అధిష్టానం చివరికి మెజారిటీ నేతల అభిప్రాయానికే మొగ్గు చూపింది. చేసిన కసరత్తు ఆధారంగానే రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎంపిక చేసారు.

Congress Party Chief

దీనితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లను మొత్తం ఇలాగా క్యాంపైన్ కమిటీ, ఎలక్షన్ మ్యానేజ్మెంట్ కమిటీ, ఏ ఐ సి సి ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ వంటి అనుబంధ కమిటీ లని సైతం దీనిలో ప్రస్తావించారు.

Congress Party వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, గీతా రెడ్డి, జగ్గా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్,మహేష్ కుమార్‌గౌడ్ లను ఎంపిక చేసారు.

సామాజిక సమీకరణాలను దృష్టి లో పెట్టుకొని మైనారిటీ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే లాగా అజారుద్దీన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఆయన క్రికెటర్ గా కూడా ఉన్నారు కాబట్టి ఆ పాపులారిటీ మైనారిటీ వర్గం నుంచి ప్రాతినిధ్యం ఈ రెండు ఉపయోగపడతాయని ఆయన పేరును ఎంపిక చేసారని మనం భావిచవచ్చు.

అలాగే గీతా రెడ్డీ దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే లాగా అమె పేరును ప్రతిపాదించినట్లు గా మనం భావించవచ్చు.

ఇంకా అంజన్ కుమార్ యాదవ్,మహేష్ కుమార్‌గౌడ్ ఈ ఇద్దరు కూడా ఓబిసి వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా పది మంది పేర్లను ప్రస్తావించారు, ఆ పది మందిలో సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి,  మల్లు రవి, పోడెం వీరయ్య, సురేష్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, టి.కుమా, జావేద్ అమీర్ ఈ పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా ఏ ఐ సి సి పేరుకొంది.

ఇది కూడా చదవండి : Mexican Fried Rice