క్రీడలు

WTC 2021 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో టీం ఇండియా ఓటమికి కారణం చెప్పిన సచిన్

WTC 2021

WTC 2021: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ఆట లో టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణం జట్టు పైన ఒత్తిడి అని చెప్పిన సచిన్.

రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లి, రహానే  వంటి ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌ మ్యాన్ లు ఉన్నా కూడా టీం ఇండియా ప్రతిష్టాత్మక (WTC 2021) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో చేతులెత్తేసింది.

గత ఆస్ట్రేలియా పర్యటన లో మేటి బ్యాట్స్‌ మ్యాన్లు, బౌలర్లు లేకుండానే కంగారులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన భారత్ ఇప్పుడు ప్రముఖ ఆటగాళ్ళు ఉండి కూడా ఫైనల్ లొ ఓటమి పాలయింది.

రెండేళ్ళ పాటు సాగిన  (WTC 2021) ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో 520 పాయింట్లతో అగ్రభాగాన నిలబడడం ద్వారా ఫైనల్ కు సగర్వంగా  అడుగుపెట్టిన కోహ్లి సేన కీలక సమయం లో అదే ప్రదర్శన చేయడం లో విఫలమైంది.

రెండు రోజులు పూర్తిగా వర్షార్పనమై మ్యాచ్‌లు కోల్పోవడం ద్వారా అవమానకర ఓటమి ఎదురుకుంది, మన ప్రధాన బ్యాట్స్‌మ్యాన్‌లు ఓపికగా తెలివిగా ఉంటే మ్యాచ్ ఖఛ్చితంగా డ్రా అయ్యేది, కాని కివిస్ బౌలర్లు స్వింగ్ బౌల్స్ లతో పాటు మన అగ్రగామి బ్యాట్స్‌మ్యాన్లు వికెట్స్ అవలీల గా వేసే బంతులను ఆడలేని బలహీనతను సొమ్ముచేసుకోని దెబ్బకొట్టారు.

ఓటమి పై సచిన్ మాట్లాడుతూ నేను ముందే చెప్పినట్లుగా ఆరవరోజు మొదటి సెషన్ లో విరాట్ కోహ్లి, పుజారాలు కలిసి మొదటి పది ఓవర్లు కీలకంగా ఆడమని చెప్పాను, కాని కోహ్లి, పుజారాలు ఇద్దరు పది బంతుల తేడా తోనే పెవిలియన్లో చేరారు, దీనితో జట్టు పైన చాలా ఒత్తిడి పెరిగింది అని సచిన్ అన్నాడు.

ఆ ఇద్దరు పది ఓవర్ల పాటు పరుగులేమి రాకున్న క్రీజులో  పాతుకపోయి ఉంటే టీం ఇండియా ఓటమి నుండి తేరుకునేది అని సచిన్ తన ట్విట్టర్ లో పేర్కోన్నాడు.

WTC 2021

మొదటి సారి జరిగిన (WTC 2021) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ లో భారత్ ఓటమి గురించి కోహ్లి ఇలా అన్నాడు, మొదట నేను కేన్ విలియంసన్ కు అతడి టీం కు శుభాకాంక్షలు చెబుతున్నాను, వారు ఈ ఆట ఆడినంత సేపు చాల కనిస్టెంట్ గా పర్‌ఫాం చేసారు, ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ఆటను మనసు పెట్టి ఆడారు, అందుకే వారికి ఈ విజయం సొంతమయింది. మొదటి రోజు ఆట జరగలేదు, పూర్తిగా ఆగిపోయింది, తరువాత రోజు ప్రారంభించారు, మేము ఆ ముమెంటం (వారి ఆట వేగాన్ని) అందుకోలేకపోయాము. మేము ఆరోజు కేవలం 3వికెట్లు మాత్రమే పోగొట్టుకున్నాం, ఆట మధ్య మధ్య లో ఆగకుండా ఉండి ఉంటే ఇంకొన్ని ఎక్కువ రన్స్ చేసేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.

న్యూజీలాండ్ బౌలర్స్ మాత్రం వారి యొక్క ప్లాన్స్ ను సరిగ్గా ఉపయోగించారు, అందుకే మేము వెనుకబడ్డాం, నాకు ఎందుకో 30 నుండి 40 రన్‌లు తక్కువ చేసాము అనిపిస్తుంది, ఇక నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఎందుకు లేరో అన్న ప్రశ్నకు అది జరగాలంటే ఒక ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ టీం లో ఉండాలి, అయితే చాల కాలంగా ప్రస్తుతం మేము ఆడిన ఫర్మాట్ తో చాలా బాగా విజయాలను అందుకున్నాము, మా ప్లేయింగ్ ఎటువంటి తప్పు లేదు.

కైల్ జెమీషన్ చాలా బాగా బౌలింగ్ చేసాడు, ఇంటర్నేష్నల్ క్రికెట్ లో చాలా బాగా ఎదుగుతున్నాడు, అతను మంచి ఏరియాస్‌ను ఎంచుకొని బౌలింగ్ చేస్తాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవడానికి అతను అర్హుడు.

ఇంకా మాకు ఇంగ్లాండ్ లో చాలా మ్యాచ్‌లు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిలో బాగా ఆడుతామని కోహ్లి అన్నాడు, ఎందుకంటే మా దగ్గర చాల మంచి టీం ఉందని కూడా చెప్పాడు.

ఇది కూడా చదవండి : ఇంట్లోనే సులభంగా ఉల్లిపాయ సమోసా