లైఫ్ స్టైల్

Onion Samosa: ఇంట్లోనే సులభంగా ఉల్లిపాయ సమోసా

onion samosa

సినిమా హాల్లో తినే బెస్ట్ ఉల్లిపాయ సమోసా (Onion Samosa) ని ఎక్‌స్ట్రా క్రంచీగా క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూద్దాం.

Onion Samosa కావాల్సిన పదార్థాలు :

1) ఉల్లిపాయలు-300గ్రాములు
2) మైదా పిండి-1 కప్పు
3) ఉప్పు-రుచికి తగినంత
4) కారం-అర టీ స్పూన్
5) గరం మసాలా-పావు టీ స్పూన్
6) నూనె- డీప్ ఫ్రై కి సరిపడ
7) మైదా పేస్టుకు- ఒక కప్పు మైదా

Onion Samosa : ముందుగా మూడు వందల గ్రాముల ఉల్లిపాయలను మీడియం సైజ్ ముక్కలుగా తరిగి ఒక క్లాత్ మీద పరిచి కనీసం ఒక గంట పైన ఆరనివ్వండి, ఇప్పుడు సమోసా షీట్స్ కోసం ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి, ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి.

తరువాత గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ పిండిని పగుళ్లు లేకుండా మృదువుగా గా కలుపుకోవాలి, అలా పగుళ్లు లేకుండా రావాలంటే 5నిమిషాల పైన బాగా కలుపుకోవాలి, పిండి సెమి సాఫ్ట్ గా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు, మెత్తగా కలుపుకున్న ఈ పిండిని కొన్ని వుండలుగా చేసేయాలి.

తరువాత పొడి పిండి చల్లి కాస్త మందంగా అన్ని సమానంగా ఒకే తీరుగా ఒకే సైజు లో ఉండే విధంగా చేసుకోవాలి, ఇలా కాస్త మందంగా వత్తుకున్న రోటీ ల మీద నూనె పూయండి, ఆ తరువాత పైన మైదా పిండిని జల్లించండి, మైదా జల్లించాక నాలుగు రోటీలను ఒక దాని మీద మరొకటి పెట్టి సాధ్యమైంత పలుచగా పిండి జల్లుకుంటు వత్తుకోండి.

పలుచగా వత్తుకున్న ఈ నాలుగు రోటిలు ఒక రొట్టిలా అంటుకుపోతుంది, ఈ రోటీని వేడి పెనం మీద వేసి చాల కొద్దిగా రోటీ మీద అక్కడక్కడ తెల్లని మచ్చలు వచ్చేవరకు కాల్చి, తిప్పి మరో వైపు కూడా తెల్లగా కాల్చాలి, అలా కాలిస్తేనే సెగ లోపల దాకా కూడా తగిలి సమోసా షీట్స్ సులువుగా వస్తాయి, మరీ ఎకువగా కనుక కాలిస్తే అప్పడాల్లా సమోసా షీట్స్ విరిగిపోతాయి అని గుర్తుపెట్టుకోండి..

పెనం మీద నుంచి తీసిన వెంటనే గుండ్రంగా ఉన్న ఈ రోటీ అంచులను స్కేల్ తో నాలుగు అంచులనీ తీసేస్తే చక్కగా చతురస్రాకారం లో అవుతుంది, ఈ చతురస్రాకారం ను సరిగ్గా మద్యలోకి కట్ చేసుకోండి, ఈ ప్రక్రియ అంతా పెనం మీద నుండి తీసిన వెంటనే జరిగిపోవాలి లేకపోతే రోటి లు సాగిపోతాయి.

గంట సేపు గాలికి ఆరబెట్టిన ఉల్లిపాయల్లో రుచికి తగ్గ ఉప్పు, అర (టీ) స్పూన్ కారం, పావు (టీ) స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఉంచుకోండి.

onion samosa

ఉల్లిపాయలు గంట సేపు ఆరితేనే వాటిలోని చెమ్మ(తేమ) ఆరి సమోసాలు చల్లారినా కూడా క్రిస్పీ గా ఉంటాయి, ఇప్పుడూ షీట్స్ ను సీల్ చేయడానికి పావుకప్పు మైదా పిండిలో నీళ్ళు పోసి చిక్కని పేస్ట్(మిశ్రమం)లా చేసుకోండి, తరువాత సమోసా షీట్స్ ని వేళ్ళ మీదకి తీసుకోని దాన్ని ఓ మూల నుండి సరిగ్గా త్రిభుజాకారం లో మడత పెట్టండి, తరువాత మళ్ళీ అక్కడినుండి ఇంకో మడత పెట్టండి.

ఇప్పుడు సరిగ్గా అది కోన్ మాదిరిగా అవుతుంది అందులోకి ఓ టేబుల్ స్పూన్ ఉల్లిపాయ మిశ్రమం వేసుకోండి. తరువాత మిగిలిన షీట్ అంచుల వెంట చిక్కని మైదా మిశ్రమం ను పూసి మూసేయండి.

అలా మిగతా సమోసాలన్నిటిని చేసి వాటిని గాలికి ఆరనివ్వాలి, అప్పుడు ఉల్లిలో నుండి వచ్చే మిగిలిన నీటిని పైన ఉండే షీట్స్ పీల్చేస్తాయి, నూనె లో వేగిన  తరవాత ఆ నీరు ఆవిరి అవుతుంది, అప్పుడు సమోసాలు ఎక్‌స్ట్రా క్రంచీగా ఉంటాయి.

ఇప్పుడు ఆ ఉల్లిపాయ సమోసాలను (Onion Samosa) వేడెక్కిన నూనె లో వేసి మీడియం నుంచి తక్కువ మంట మీద మాత్రమే బంగారు(గోల్డెన్)బ్రౌన్ రంగు వచ్చే అంతవరకు వేపుకోవాలి.

నూనె విపరీతమైన వేడి మీద ఉన్న, ఎక్కువ మంట మీద వేపిన చూడడానికి చాలా ఎర్రగా క్రంచీగా కనిపిస్తాయి, కాని పైపొర మాత్రమే క్రంచీగా ఉంటుంది, లోపల అంతా మెత్త మెత్తగా ఉండిపోతుంది అని గుర్తుంచుకోండి.

సమోసా షీట్స్ లోపల దాకా క్రంచీగా వేగాలంటే మీడియం నుంచి తక్కువ మంట మీద మాత్రమే జాగ్రత్తగా వేపుకోవాలి. అంతే ఈ టిప్స్ పాటిస్తే ఎక్‌స్ట్రా క్రంచీగా, క్రిస్పీగా ఉండే ఉల్లిపాయ సమోసాలు (Onion Samosa)  తయారు.

ఇది కూడా చదవండి : ఫుడ్ డెలివరీ బాయ్ కి TVS XL బైక్ బహుమతి