జాతీయం-అంతర్జాతీయం

SBI ATM: ఎటిఎం(ATM) సెన్సార్‌లనే తప్పుదోవ పట్టించిన కేటుగాళ్ళు (48 Lakhs)

SBI

SBI ATM: ఎటిఎం (ATM) మెషీన్ లోని చిన్న లొసుగును ఆసరాగా చేసుకోని లక్షల రూపాయలను దండుకున్నారు.

ఎటిఎం (ATM) దొంగతనం అంటే మెషీన్ ను పగలగొట్టడమో లేదంటే మెషీన్ నే ఎత్తుకెళ్ళిన సంఘటనలను చూసాం, కాని చెన్నై లోని ఓ ముఠా స్మార్ట్ గా ఆలోచించి ఎటిఎం ను దోచుకున్నారు.

ఎస్‌బిఐ (SBI) ఎటిఎం (ATM) మెషీన్ లోని చిన్న లొసుగును ఆసరాగా చేసుకోని లక్షల రూపాయలను దండుకున్నారు, సుమారు 48లక్షలను చోరీ చేసారు.

ఎటిఎం (ATM) నుండి డబ్బులను డ్రా చేసుకున్నపుడు 20సెకనులు కీలకమయిన సమయం గా పరిగణిస్తారు, డబ్బులు బయటికి రాగానే 20సెకన్ల లోపు తీసుకోవాలి. లేదంటే ఆ నోట్లను మెషీన్ వెనక్కి తీసుకుంటుంది, వెంటనే మూత పడిపోతుంది, అక్కడ ఉన్న సెన్సార్లు డబ్బులు తీసుకోలేదని  గ్రహించి సమాచారం పంపిస్తాయి, అకౌంట్‌లో బ్యాలెన్స్ అంతే ఉంటుంది.

SBI

డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు ఎటిఎం మూత పడిపోకుండా చేతితో ఆపితే డబ్బులు తీసుకోలేదని సెన్సార్లు గ్రహిస్తాయి, దీనినే తమ ఆయుధంగా వాడుకున్నారు కేటుగాళ్ళు, దీనితో SBI ఎటిఎం (ATM) నుండి డబ్బులు తీసుకున్నా తీసుకోలేదని సెన్సార్లు గ్రహించాయి.

అకౌంట్‌లలో బ్యాలెన్స్ తప్పుగా చూపించగా బ్యాంక్ అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేసారు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక నిందితున్ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి : త్రవ్వకాల్లో బయటపడ్డ పురాతన శ్రీవారి విగ్రహం