జాతీయం-అంతర్జాతీయం

Zomato : ఫుడ్ డెలివరీ బాయ్ గా మారిన సరస్వతీ పుత్రుడికి బైక్ బహుమతి (75 K)

Zomato

Zomato Delivery Boy :

కరోనా కష్టాలని అధిగమించేందుకు కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నాడు సరస్వతి పుత్రుడు కాస్త ఫుడ్ డెలివరీ బాయ్ గా మారాడు, తోటి వారిలా బైక్ లేకున్నా సైకిల్ పైనే సర్వీస్ చేయడం ప్రారంభించాడు.

దూరం, సమయం, వాతావరణం తో పని లేకుండా వచ్చిన ప్రతీ ఆర్డర్ సకాలంలో అందిస్తూ తన పని చేసుకుంటూ పోయాడు. ఈ అంకిత భావమే బైక్ ను బహుమతి పొందేలా చేసింది, పది మందిలో ప్రత్యేకంగా నిలిపింది.

జూన్ 14 సోమవారం సమయం రాత్రి 10.00 గంటలకు  కింగ్ కోటి కి చెందిన రాబిన్ ముఖేష్ జోమాటోకి ఒక ఆర్డర్ బుక్ చేసాడు, ఒక పక్క జోరు వర్షం పడుతుంది, ఆర్డర్ ఇచ్చిన టి ఇప్పుడే వచ్చే అవకాశం లేదని అలోచన లో పడ్డాడు, ఇంతలో డెలివరీ బాయ్ ఫోన్ చేసి “సార్ మీ ఆర్డర్ తీసుకొచ్చా కిందకి రండి అని” అన్నాడు, కిందకి వచ్చిన రాబిన్ ముఖేష్ ఆ డెలివరీ బాయ్ ని చూసి చలించిపోయాడు, లక్డికపూల్ లో ఆర్డర్ లో ఉన్న నిలోఫర్ ఛాయ్ తీసుకోని కింగ్ కోటి కి పది నిమిషాల్లోనే చేరుకున్నాడు డెలివరీ బాయ్ అఖిల్ మహమ్మద్.

అందులోనూ వర్షం లో తడుచుకుంటూ సైకిల్ పై వచ్చాడు, డెలివరీ లో ఏ మాత్రం ఆలస్యం చేయలేదు, అలా వచ్చిన అఖిల్ ను చూసి ఆశ్చర్యపోయిన ముఖేష్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు, అఖిల్ తో సెల్ఫీ దిగాడు.

హైదరాబాద్ పాత బస్తీ తలాపుకట్టకు చెందిన అఖిల్ కు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, ఒక సోదరుడు, తండ్రి చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Zomato
Photo credit: Twitter

కరోనా కారణంగా ఆయనకు ఉపాధి కరువయింది, బి.టెక్ మూడవ ఏడాది చదువుతున్న అఖిల్ ఈ సమయం లో తండ్రికి ఆర్ధికంగా అండగా నిలవాలాని నిర్ణయించుకున్నాడు, చదువుకుంటూనే జోమాటో (Zomato) డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు, బైక్ లేకపోవడం తో రోజు సైకిల్ పైన నే డెలివరీ లు అందిస్తున్నాడు.

నిజానికి హైదరాబాద్ లో డెలివరీ బాయ్ గా పని చేయాలంటే ఖచ్చితంగా బైక్ ఉండాల్సిందేనని ఆయా సంస్థలు (Zomato) నిభందనలు పెట్టాయి, అయితే అఖిల్ ద్విచక్ర వాహనదారులు ఎంత వేగంగా డెలివరీ చేస్తారో అంతే వేగంగా (Zomato) ఫుడ్ డెలివరీ చేస్తానని జోమాటోప్రధినిధులను ఒప్పించి ఉద్యోగం లో చేరాడు, నాటి నుంచి డెలివరీ సమయం లో ఏ మాత్రం తేడా లేకుండా సర్విస్ చేస్తున్నాడు.

బి.టెక్ చేస్తూ డెలివరీ బాయ్ గా పని చేస్తున్న అఖిల్ కష్టం చూసిన రాబిన్ ముఖేష్ అతడి ఫోటో ను ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్ లో పోస్ట్ చేసాడు.

గ్రూప్ సభ్యులు వెంటనే స్పందించారు, ఈ యువకుడు కుటుంబం కోసం పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు, బైక్ ఇస్తే మరింత వేగంగా పని చేసే అందుకు బాగుంటుంది అని అఖిల్ తెలపడం తో 12 గంటల్లో Rs 75000/- లు సమీకరించి టీవీఎస్ ఎక్సెల్ బహుమతిగా ఇచ్చారు.

ఇది కూడా చదవండి : ముంబైలో సెలబ్రిటీలు ఎక్కడ తింటారో తెలుసా!