Cryptocurrency Market : ఎలోన్ మస్క్ ముందు బిట్ కాయిన్ కు జై అన్నారు, ఆ తర్వాత అంతా తూచ్ అని మొదటికి వచ్చేసారు, దీనితో బిట్ కాయిన్ గిల గిలా కొట్టుకుంటుంది, ఇప్పుడు డాజీ కాయిన్ గురించి ప్రస్థావిస్తున్నారు, అసలు క్రిప్టో కరెన్సీ మీద వినిపిస్తున్న అనుమానాలేంటి తెలుసుకుందాం.
Cryptocurrency Market : క్రిప్టో కరెన్సీ అనేది వర్చువల్ కరెన్సీ, ఇవి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కోడ్ ల ద్వార పని చేస్తుంటాయి,సాధారణ కరెన్సీలు భౌతికంగా చలామణి అవుతుంటాయి, క్రిప్టో కరెన్సీ లు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేము, అవి పూర్తిగా డిజిటల్ రూపం లో మాత్రమే ఉంటాయి.
పేరుకు తగ్గట్టుగానే క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ సాంకేతికతలు క్రిప్టో కరెన్సీ కి మూలాధారాలు, ప్రస్తుతం బిట్ కాయిన్, ఎథీరియం,స్టెల్లార్, రిపుల్, డాష్ సహా ఇతర క్రిప్టో కరెన్సీ లు మనుగడ లో ఉన్నాయి. వీటన్నిటిలో బిట్ కాయిన్ కు ఎక్కువ ఆధరణ దక్కింది.
Cryptocurrency Market: క్రిప్టో కరెన్సీ ప్రస్థావన వచ్చినపుడు చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ బ్లాక్ చైన్ సాంకేతికత పై చర్చ జరుగుతుంటుంది, బ్లాక్ చైన్ అనేది డేటా బేస్ ఆధారంగా పనిచేసే ఓ ప్రత్యేక టెక్నాలజి. ఇందులో ఇన్‌ఫర్మేషన్ అనేది బ్లాకులుగా విభజన చెంది అదంతా ప్రపంచ వ్యప్తంగా వేరు వేరు సర్వర్ లలో స్టోర్ అయి ఉంటుంది.
ఇలా ఒక సర్వర్‌కు మరో సర్వర్ అనుసంధానమై ఈ వ్యవస్థ పనిచేస్తుంది, ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపం లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎంతటి హ్యాకర్లయినా చోరీ చేయడం దాదాపు అసాధ్యం అని, ఆ కారణంగానే క్రిప్టో కరెన్సీలను ఎవ్వరు నియంత్రిచడం కూడా జరగదన్నది మరి కొందరి వాదన.
బిట్ కాయిన్లను పొందాలంటే కంప్యూటర్ల ద్వారా మైనింగ్ చేయాల్సి ఉంటుంది, ఇవి పరిమిత సంఖ్య లో ఉంటాయి.
మొత్తం మీద 2.1 కోట్ల బిట్ కాయిన్లు మాత్రమే మనుగడలో ఉంటాయి, ఇప్పటివరకు ఇలా 1.5 కోట్ల బిట్ కాయిన్లు చలామణి లోకి వచ్చాయి, ఇంకా 25లక్షల బిట్ కాయిన్లు మాత్రమే రావాల్సి ఉంది.
ఎలాగు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకోని లాభాలు గడించాలని పెట్టుబడులు పెట్టిన సమయం లో మస్కు మీద అభిప్రాయాలు వినిపించాయి, లాభం కోసం ఆయన ఎంత రిస్క్ తీసుకోడానికి అయిన వెనుకాడరు, కార్ల కొనుగోలు లకి బిట్ కాయిన్లను అనుమతించి మార్కెట్ లో ఉన్న వాటిని సేకరించి ఒక్క చోటికి చేర్చేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని అనుకున్నారంతా.
అలా జరిగినపుడు డిమాండ్ పెరుగుతుందని ఎదో ఒకరోజు కరెన్సీకి బద్దులుగా బిట్ కాయిన్లను విక్రయిస్తే అనూహ్యమయిన లాభాలను గడించడమే మస్కు ప్లాన్ అని అంచనా వేసారు, అకస్మాత్తుగా మస్కు సంచలన నిర్ణయం తీసుకున్నారు, బిట్ కాయిన్ ల విషయం లో యు టర్న్ తీసుకున్నారు, తప్పుకుంటె తప్పుకున్నారు కాని ఊరికే ఉన్నారా అంతే ఆయన చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
Cryptocurrency Market: క్రిప్టో కరెన్సీ లో ఇప్పుడిప్పుడే వినిపిస్తున్న మరో పేరు డాజీ కాయిన్, జోక్ గా తెరపైకి వచ్చిన డాజీ కాయిన్ పేరు వైరల్ అవుతుంది, అందుకే దీన్ని మీమ్ కాయిన్ అని కూడా అంటారు.
అయితే కొనుగోలు చేసిన బిట్ కాయిన్ కరెన్సీ ను విక్రయిస్తామని ప్రకటించిన మస్క్ ఆ తరువాత డాజీ కాయిన్ గురించి ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది, 1952 లోని ఓ సాంగ్ తో పాటు మరో ఇమేజ్ ట్వీట్ చేసిన మస్క్ ఇందులో ఎన్ని డాజీ లు ఉన్నాయంటూ ఒక ప్రష్న వదిలారు, అంతే ఇపుడు డాజీ కాయిన్ మీద చర్చ మొదలయింది.
నిజానికి ఇప్పుడే కాదు మొదటి నుంచి డాజీ కాయిన్ సంబందించి పరోక్షంగా సపోర్ట్ చూపిస్తూ వచ్చారు మస్క్, దీనితో ఆ కరెన్సీ విలువ పెరుగుతోంది. నిజానికి గత వారం రోజులుగా క్రిప్టో కరెన్సీ విలువ పడిపోతోంది.
Cryptocurrency Market: బిట్ కాయిన్ , ఎథీరియం లతో పాటు డాజీ కాయిన్ విలువ నేల చూపులు చూస్తోంది.
మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా మస్క్ ట్వీట్ తర్వాత డాజీ కాయిన్ విలువ 22% పెరిగింది, త్వరలో ఇది ఒక్క డాలర్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నది మార్కెట్ వర్గాల అంచనా, ఇలాంటి పరిస్థితుల్లో డాజీ కాయిన్ మీద మస్క్ ఎందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు అనే విషయం ను కొందరు డీ కోడ్ చేసే బిజీ పనిలో ఉన్నారు.
నిజానికి ఇప్పుడే కాదు గత రెండు నెలలుగా డాజీ కాయిన్ గురించి మస్క్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు, సోషల్ మీడియా లోను దీని గురించి జోరుగా ప్రచారం జరిగింది, అయితే దీని వెనుక భారి కారణమే ఉందని కొందమంది నిపుణులు అంటున్నారు.
బిట్ కాయిన్ లో మైనింగ్ లో భారీగా విధ్యుత్ వినియోగిస్తున్నారని దీని కారణంగా పర్యావరణానికి హాని జరుగుతుందని అందుకే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాని మస్క్ ప్రకటించాడు.
బిట్ కాయిన్ మైనింగ్ కు 707 కిలోవాట్ల విధ్యుత్ అవసరం, డాజీ కాయిన్ కు కేవలం 0.12 కిలోవాట్ల విధ్యుత్ మాత్రమే అవసరం అవుతుంది.
Cryptocurrency Market: క్రిప్టో కరెన్సీ మీద నమ్మకం తీసుకొచ్చేందుకు బిట్ కాయిన్ లో మస్క్ పెట్టుబడులు ఇన్వెస్ట్ చేసారు, ఆయన మాటలను వేదంగా భావించేవాల్లు అందులో భారిగా పెట్టుబడులు పెట్టారు, అయితే వాళ్ళకి మిగిలింది కష్టమా, నష్టమా అనే విషయాలను పక్కన పెడితే క్రిప్టో కరెన్సీ మీద ఒక నమ్మకం అనేది క్రియేట్ చేసాడు, ఇప్పుడు బిట్ కాయిన్ పెట్టుబడులను విక్రయిస్తామని చెప్పి డాజీ కాయిన్ మీదకి అందరి దృష్టి మళ్ళిస్తున్నారు.
Cryptocurrency Market: బిట్ కాయిన్ ను దెబ్బకొడితేనే ఇతర క్రిప్టో లకు డిమాండ్ పెరుగుతుంది, మస్క్ వ్యూహం ఇదే కావొచ్చన్న ప్రచారం సాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగి డాజీ కాయిన్ ను మస్క్ సొంతంగా అభివృద్ధి చేసి కీలకంగా మారితే పెట్టుబడులు వెల్లువల వచ్చే అవకాశం ఉంది.
అయితే దీని అంతటికి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కారణం అన్నట్లుగా బిట్ కాయిన్ విషయం లో ఆయన చర్యలు ఉన్నాయన్నది మరికొందరి వాదన, వ్యాపారం విజయం కోసం ఎలాంటి రిస్క్ కి అయినా సిద్ధం అన్నట్లు ఉండే మస్క్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మీద కూడా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.