లైఫ్ స్టైల్

Easy Cake Recipe: ఇంట్లోనే చాలా సులభంగా చాక్లేట్ కేక్

Cake Recipe

Cake Recipe in Telugu: మిక్స్డ్ చాక్లేట్ కేక్

ఒక డిఫరెంట్ పద్దతిలో కేకు ను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం, ఇది మిక్స్డ్ ఫ్లేవర్స్ తో,రుచులతో ఉంటుంది, పిల్లలైతే ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.

మిక్స్డ్ చాక్లేట్ కేక్ (Cake Recipe) కు కావలిసిన పదార్థాలు:

1. మైదా(ఒక కప్పు)
2. పాలు(అర కప్పు)
3. పెరుగు(అర కప్పు)
4. వంట నూనె (పావు కప్పు)
5. చక్కెర(అర కప్పు)
6. బేకింగ్ పౌడర్(ఒక టి చెంచా)
7. బేకింగ్ సోడా(అర టి చెంచా)
8. కోకా పౌడర్ (రెండు చెంచాలు)

ముందుగా దీని కోసం ఒక కేక్ టిన్ తీసుకోవాలి, లేదా వెడల్పుగా ఉన్న ఒక స్టీల్ పాత్ర అయిన తీసుకోవచ్చు. కేక్ టిన్ కు ఆయిల్(నూనె) ను రాసుకోవాలి, కింద బట్టర్ పేపర్ వేసుకోవాలి, బట్టర్ పేపర్ లేకపోతే మైదా ని కూడా వేసుకోవచ్చు,  ఈ బట్టర్ పేపర్ ను కూడా ఆయిల్(నూనె) తో రాసుకోవాలి, తరువాత దానిని పక్కన పెట్టుకోవాలి.

ఇపుడు ఒక మిక్సీ జార్ లో అరకప్పు చక్కెర ను తీసుకోని మెత్తని పొడి లాగా గ్రైండ్ చేసి మిక్సింగ్ గిన్నె లోకి తీసుకోవాలి, ఇప్పుడు అందులో ఒక అర కప్పు పాలు పోసుకోవాలి, మరియు అర కప్పు పెరుగు వేసుకోవాలి, పావు కప్పు వాసన లేని నూనె వేసుకోవాలి, ఇపుడు అన్ని బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి.

తరువాత అందులోకి కప్పు మైదా వేసుకోవాలి, ఇంక ఒక (టి) చెంచా బేకింగ్ పౌడర్, అర (టి) చెంచా బేకింగ్ సోడా వేసుకోని జల్లించుకోవాలి, ఇపుడు అంతా మిశ్రమాన్ని కట్ అయిండ్ ఫోల్డ్ పద్దతిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఒక చిన్న గిన్నె లో రెండు టేబుల్ స్పూన్ ల కోకా పొడి, టేబుల్ స్పూన్ ల నీరు వేసుకొని కలుపుకోవాలి.

మనం ముందుగా తయారు చేసిన కేకు మిశ్రమం ను సగం తీసుకోని అందులోకి మనం కలిపిపెట్టుకున్న కోకా పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మనకి ఇప్పుడు రెండూ మిశ్రమాలు సిద్దంగా ఉన్నాయి.

Cake Recipe

కేకు ను బేక్ చేసుకోడానికి మందంగా ఉన్న ఒక పాత్రను పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో ఒక చిన్న స్టాండ్ ను పెట్టుకోవాలి, తరువాత ఆ గిన్నెను మూత పెట్టి పది నిమిషాలు వేడి (ప్రి హీట్) చేసుకోవాలి. అది ప్రి హీట్ లోపల సన్నగా పొడుగ్గా ఉన్న ఒక గ్లాస్ ను తీసుకోని అందులో సగం వరకు నీటిని పొసి ఉంచుకోవాలి, ఈ గ్లాస్ ను తీసుకెల్లి కేకు టిన్ మద్యలో పెట్టాలి, అలా పెట్టడం వల్ల కేకు ఆకారం బాగా వస్తుంది.

తరువాత రెండూ కేకు మిశ్రమాలను ఒకేసారి రెండు వైపుల నుండి పోసుకోవాలి. ఇలా చేస్తే కేకు చూడడానికి రెండు రంగులతో బాగుంటుంది మరియు రుచి కూడా చాలా బాగుంటుంది.

తరువాత ఈ కేక్ టిన్ ను ముందుగా ప్రి హీట్ చేసుకున్నా పాత్ర  మద్య లో పెట్టి పొయ్యిని సిమ్ము లో పెట్టుకోవాలి. 30 నుండి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి.

40 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే కేకు బాగా ప్లఫ్ఫీ గా రావాలి. ఇపుడు కేకు టిన్ ను వెంటనే తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారాక మద్యలో ఉన్న గ్లాస్ ను మెల్లిగా తీసేయాలి.

అంతే డిఫరెంట్ పద్దతిలో కేకు తయారైపొయినట్టే, ఈ కేకు మంచి సాఫ్ట్ గా రుచిగా ఉంటుంది, ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి నచ్చితే ఫ్రెండ్స్ కి ఈ కేక్ తయారీ (Cake Recipe) పద్దతిని షేర్ చేయండి.

ఇది కూడా చదవండి : వెల్లుల్లి వేస్ట్ తో ఇన్ని అద్భుతాలా