Garlic Benefits: మనం ఇంట్లో వృధాగా పారబోసే వెల్లుల్లి వేస్ట్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయి.
మనం సాధారణంగా వెల్లుల్లి పొట్టు తీసిన తర్వాత పడేస్తుంటాము, కాని ఆ పొట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఇదా మనం ఇన్ని రోజులు పడేసాము అని అనుకుంటారు, దీని ద్వారా అన్ని లాభాలు ఉన్నాయి మరి .
ఈ వెల్లుల్లి పొట్టు లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, మరియు యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.
వీటిని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
Garlic Benefits టిప్ 1: వెల్లుల్లి పొట్టు ను సాంబ్రాణి పొగ లో వేసుకొని పొగ పట్టుకోవడం వల్ల తలస్నానం చేసినపుడు తలలో నీరు పోయేలా చేసి జలుబు రాకుండా చేస్తుంది. బాలింతలకు తలకి వెల్లుల్లి వేసి సాంబ్రాణి పడితే ఒంట్లో నీరు చేరదు, పసి పిల్లలకు జలుబు, సైనస్ రాకుండా చేస్తుంది.
Garlic Benefits టిప్ 2: సైనస్ ఉన్నవాళ్ళకి రాత్రి నిద్రపోయేటపుడు ముక్కు మూసుకుపోయి గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది, అటువంటపుడు ఈ వెల్లుల్లి పొట్టు ను ఒక కాటన్ బట్ట లో వేసి దగ్గరికి చేర్చి ఒక ముడి లాగ వేసి దిండు పక్కన పెట్టుకోని వాసన చూడడం వల్ల ఈ వాసన ముక్కు ద్వార గొంతు లోకి పోవడం వల్ల గొంతు నొప్పి తగ్గిపోతుంది మరియు ముక్కు కూడా దిబ్బడ పోయి బాగా గాలి పీల్చుకోవచ్చు మరియు బాగా నిద్రపడుతుంది.
Garlic Benefits టిప్ 3: వెల్లుల్లి పొట్టు ను ఒక కాటన్ బట్ట లో వేసి దగ్గరికి చేర్చి ఒక ముడి లాగ వేసి ఒక సంచి లాగా చేసుకోని దోస పెనం ను కొంచెం వేడి చేసి దాని మీద ఆ సంచి ని ఉంచి వేడి చేసుకోవాలి, ఎక్కడ నొప్పులు ఉన్నాయో, కండరాల నొప్పి దగ్గర గాని ఆ సంచి తో కాపురం పెట్టుకుంటే త్వరగా ఉపశమనం ఉంటుంది.
Garlic Benefits టిప్ 4: తలలో చాలా మందికి పేలు ఉంటాయి, దురద సమస్య తో బాధ పడుతుంటారు. వారు వారానికి రెండు సార్లు సాంబ్రాణి పొగ లో వెల్లుల్లి పొట్టు వేసుకోని పొగ పట్టుకుంటే అసలు పేల్లే రావు, ఉన్న పేల్లన్ని పోతాయి, ఒకవేళ పేలు లేకపోతే జుట్టు రాలడం తగ్గిపోతుంది, మరియు జుట్టు కూడా బాగా పెరుగుతుంది.
Garlic Benefits టిప్ 5: వెల్లుల్లి పొట్టు మొక్కలకు ఎరువు లాగా కూడా ఉపయోగపడుతుంది, 24గంటలు నీటిలో వెల్లుల్లి పొట్టు నాన బెట్టి తరువాత ఆ నీటిని మొక్కలకు పోస్తే వెల్లుల్లి తొక్కు లో ఉన్న సల్ఫర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్ ఇవన్ని ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, సల్ఫర్ ఘాటు వాసన వల్ల పురుగులు ఏవి చెట్ల దగ్గరకి రావు.