క్రీడలు

Khel Ratna : ఆర్ అశ్విన్, మిథాలీ రాజ్ లకు ఖేల్ రత్న అవార్డు 2021 Won!

Khel Ratna
Khel Ratna: 2021వ సంవత్సరం ఖేల్ రత్న అవార్డు కు ఆర్ అశ్విన్, మిథాలీ రాజ్ లకు  బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సిఫారసు చేసింది.

భారతదేశ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (Ashwin), భారతదేశ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) లకు దేశ అత్యున్నత క్రీడా గౌరవమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (Khel Ratna) అవార్డును ఇవ్వాలని సిఫారసు చేయాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) BCCI నిర్ణయించింది.

ఏఎన్ఐ ప్రకారం కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్ పేర్లను అర్జున అవార్డుకు సిఫారసు చేయాలని నిర్ణయించారు.

Khel Ratna

34 ఏళ్ల రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేకర్ ఆర్ అశ్విన్ (Ashwin) 2010లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 79 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.

తాజాగా మిథాలీ రాజ్ 22 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ కెరీర్ ను కలిగి ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ గా నిలిచింది.

38 ఏళ్ల మిథాలీ రాజ్ 1999 జూన్ 26న క్రికెట్ లో ప్రవేశం చేసింది, పురుషుల మరియు మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ కంటే సచిన్ టెండూల్కర్ 91 రోజులు మాత్రమే ఎక్కువ సుదీర్ఘ కెరీర్ ను కలిగి ఉన్నాడు.

అలాగే ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ ఎఫ్) ఫుట్ బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రికి సిఫారసు చేసింది మరియు ఒడిశా ప్రభుత్వం ఖేల్ రత్న  అవార్డుకు ఏస్ స్ప్రింటర్ దూటీ చంద్ ను నామినేట్ చేసింది, దూటీతో పాటు ఒడిశా ప్రభుత్వం మరో ఐదు సిఫార్సులను కూడా బిసిసిఐ క్రీడా మంత్రిత్వ శాఖకు పంపింది.

2020 సంవత్సరం నాటికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన ఐదుగురు గ్రహీతల్లో రోహిత్ శర్మ కూడా ఉన్నారు, గత ఏడాది సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల తర్వాత ఈ అవార్డుతో సత్కరించబడిన నాలుగో క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు.

ఇది కూడా చదవండి : స్పైస్ జెట్ & ఇండిగో విమాన టికెట్ కేవలం 998/- మాత్రమే