క్రీడలు

P. V. Sindhu Olympics : టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు హవా, సెమీస్ కు చేరిన మన తెలుగు రత్నం పీవీ సింధు

Sindhu
P. V. Sindhu :  టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో పీవీ సింధు హవా కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్స్ లో 5వ ర్యాంకర్ జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచి మీద వరుస సెట్లలో విజయం సాధించింది.

టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో పీవీ సింధు హవా కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్స్ లో 5వ ర్యాంకర్ జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచి మీద వరుస సెట్లలో విజయం సాధించింది. 21-13, 22-2- తేడా తో విజయ ఢంకా మోగించింది.

మొదటి సెట్ లో చాలా అలవోకగా గెలిచిన పీవీ సింధు (Sindhu) కి రెండవ సెట్ లో మాత్రం తన ప్రత్యర్థి నుంచి ఒక సవాల్ ఎదురయింది. పీవీ సింధు మరియు అకానె యమగుచి ఇద్దరు ప్లేయర్‌లు వారి ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు.

Sindhu

రెండవ సెట్ లో గేం పాయింట్ కాచుకునీ మరీ మన తెలుగు తేజం సింధు, యాభై ఆరు నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ మ్యాచులో మన సింధు గెలిచింది, ముందు గతం లో వీరిద్దరూ పద్దెనిమిది సార్లు తలపడగా 11-7 తో పీవీ సింధు దే పైచేయి.

షార్ట్‌కట్స్ మరియు అక్యూరసీ షార్ట్స్ , బుల్లెట్టులా దూసుకెళ్ళే స్మాష్‌లు, ఇలా షటిల్ పై పట్టు ఉన్నది కాబట్టే సింధు (Sindhu) ఆటలో నెగ్గింది.

Sindhuస్వర్ణ పతాకం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది, మొదటి సెట్ నుంచే మంచిగా తెలివిగా ఆడిన సింధు తన ప్రత్యర్థికి ఒత్తిడిని పెంచింది.

తనదైన శైలి లో స్మాష్ షాట్లు, డ్రాప్ షాట్లు వేసుకుంటు తన ప్రత్యర్థిక మీద మొదటి నుంచే దూకుడు ప్రారంభించింది. మొదటి సెట్ ను 21-13 తో కైవసం చేసుకున్న పీవీ సింధు, అదే దూకుడును రెండవ సెట్ లోనూ కొనసాగించింది.

pv sindhu

అకానె యమగుచి తనకు అయిన వెన్ను గాయం తరువాత మునుపటి వేగం కంటే తగ్గిందని స్వయంగా ఆమెనే చెప్పింది, ఇంకా తన పుట్టిన జన్మ స్థలం అయిన టోక్యో జరుగుతున్న ఒలంపిక్స్ లో తీవ్రమయిన ఒత్తిడి అకానె యమగుచి లో కనిపించింది.

ఇంకా రేపు సెమీస్ మ్యాచు జరగనుంది. కాని సింధు యొక్క ప్రత్యర్థి ఎవరో ఖరారు కాలేదు.రేపు ఈ మ్యాచు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి : కరెంట్ బిల్ ను తగ్గించుకోండి