జాతీయం-అంతర్జాతీయం

Telangana Dalit Bandhu : దళిత బంధు కోసం 500 కోట్లు విడుదల తెలంగాణా ప్రభుత్వం

dalit bandhu
Telangana Dalit Bandhu : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు కోసం 500 కోట్లు విడుదల చేసింది. అందులో రూ. రెండు వేల కోట్లు హుజూరాబాద్ కే కేటాయించింది.

రూ.500 కోట్లకు తెలంగాణా రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణా రావు బడ్జెట్ రిలీజు ఆర్డర్ ఇచ్చారు.
దళిత బంధు పథకం కింద ఆ పథకానికి అర్హులయిన దళిత కుటుంబాలకు రూ.పది లక్షలు చొప్పున ఇస్తామని తెలంగాణా ప్రభుత్వం గతం లో ప్రకటించిన విషయం అందరికీ తెలుసు.

మొదట పైలెట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు (Dalit Bandhu) ఈ పథకం వర్తించేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు.

eruvaka pournami

అలా అమలు చేస్తే రూ.రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంచనా వేసారు. కాని ఇప్పుడు మాత్రం అందులో కెవలం పావు వంతు నిధులు మాత్రమే రిలీజ్ చేసారు.

అయితే దళిత బంధు (Dalit Bandhu) మీద అఖిల పక్ష మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రూ.1200 కోట్లు దీని ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి కెసీఆర్ హామీ ఇచ్చారు.

మరి ఈ సాయం అందరికీ అందుతుందా?

dalit bandhu

సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దళిత బంధు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం రిలీస్ చేసిన రూ.500 కోట్ల తో ఒక్కో దళిత కుటుంబానికి రూ.పది లక్షలు ఇస్తే అయిదు వేల కుటుంబాలు మాత్రం లాభం పొందుతారు.

దీనితో కేవలం అయిదు వేల కుటుంబాలకు మాత్రమే డబ్బులు అందుతాయా? మరి మిగతా దళిత కుటుంబాల వారికి ఎప్పుడిస్తారు అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి.

సీఎంవో ఇచ్చిన లెక్కల ప్రకారం హుజూరాబాద్ మండలం లో 5,323 దళిత కుటుంబాలు, కమలాపుర్ మండలంలో 4,346, వీణవంకలో 3,678, జమ్మికుంటలో 4,996, ఇల్లందుకుంటలో 2,586 చొప్పున మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి.

Coinbazzar

పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్న హుజూరాబాద్ మండలం లో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నయి అనే దాని మీద అధికారులలో తర్జన భర్జన జరుగుతోంది.

మొదట సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి అని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే జరిగి ఇప్పటికీ అవుతుంది కావున చాలా మార్పులు జరిగాయని చెప్పారు. దీనితో దళిత కుటుంబాల లెక్కలు మరోసారి సరిచూడాలని కేసీఆర్ అజ్ఞాపించారు.

మరొక వైపు మిషన్ భగీరథ పథకంలో సేకరించిన వివరాల ఆధారంగా కూడా దళిత కుటుంబాలను లెక్కలోకి తీసుకొనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది.

ఇది కూడా చదవండి : టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు హవా