జోక్స్ & కథలు

Ant and Crow Story : చీమ మరియు కాకి నీతి కథ

ant and crow
Ant and Crow Story : ఎవరికీ అయినా ముందు చూపు చాలా అవసరం అన్ని తెలియచెప్పే కథ

ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి, చెట్టు క్రింద పుట్టలో చీమ (Ant) జీవిస్తూ ఉండేవి.

కాకి ది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ (Ant) చాలా నెమ్మదస్తురాలు, దేని గురించి అయినా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది, అవి రెండు రోజూ ఉదయన్నే లేచి వాటి వాటి ఆహార వేటను కొనసాగించడం లోను హడావిడిగా ఉండేవి.

చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది, దాన్ని చెట్టు కింద వరకు మోసుకెళ్ళి తినగలినంత తిని మిగిలింది దాని స్థావరంలో దాచి పెట్టుకునేది.

ant and crow story

కాని కాకి మాత్రం హాయిగా స్వేచ్చగా గాలిలో ఎగురుతూ కావ్ కావ్ మని పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది, పంటల చేలలోకి దొంగతనంగా వెళ్ళి తిన్నంత తిని పాడు చేయలిగినంత పాడు చేసేది. ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని పరుగులు పెట్టించి అందకుండా గాలిలోకి రివ్వున ఎగిరిపోయి చాలా ఆనందించేది.

ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది దానిని చూస్తూనే ఆనందం లో మునిగిపోయింది. ఆ గింజను చుస్తూ ఇది చాలా పెద్దగా ఉంది దీనిని భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది అని చీమ అనుకుంటుంది, అలా అనుకొని ఆ గింజను లాక్కెళ్ళుతుంది.

అది నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కన్నా పెద్దదిగా ఉన్న ఆ ఆహారపు గింజను మోయలేక వస్తున్న ఉన్న చీమ (Ant) ను చూసి కాకి పకపకా నవ్వుతుంది.

ant and crow story

దానితో చీమ (Ant) కి కోపం వచ్చి “ఓయ్ పొగరు బోతు కాకి, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావ్.?” అని ప్రశ్నిస్తుంది.
అప్పుడు కాకి చీమతో నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది, నువ్వెంత నీ ఆకలి ఎంత..ఎందుకు ఎప్పుడు ఆహారాన్ని లాక్కు వెళ్ళి గూటిలో పెట్టుకుంటు రోజంతా శ్రమ పడుతుంటావు.

నన్ను చూడు గాలిలో ఎగురుకుంటూ, హాయిగా పాటలు పాడుకుంటూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటలని పాడు చేసి ఆ రైతును ముప్పు తిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతానో, నువ్వు కూడా ఆలా ఉండొచ్చు కదా, ఇన్ని కష్టాలెందుకు అని అంటుంది.

దానికి చీమ ఏమి సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది, కోతలు పూర్తయ్యి పంట అంతా రైతుల ఇళ్ళకు వెళ్ళిపోతుంది, ఇంతలో భారీ వర్షాలు వస్తాయి.అడవి అంతా వర్షం తో ముద్ద ముద్ద అయొపోయింది, గూడు నేల కూలడంతో కాకి కి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు.

ant and crow story

అప్పుడు కాకి చీమ ఇంటికి వచ్చి ‘మిత్రమా వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను, నన్ను కొంత కాలం నీ ఇంట్లో ఉండనివ్వు, నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా కొంచెం పెట్టు ‘ అని బ్రతిమాలుతుంది.

అప్పుడు చీమ పకపకా నవ్వి కాకి తో వర్షాలు వస్తాయి అని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను, ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది.

ఆ తరువాత కాకి కి తను చేసిన తప్పేంటో తెలిసి బుద్ది వస్తుంది, కాకి కి ముందు చూపు వల్ల లాభం ఎంటో తెలిసి వస్తుంది. అప్పడి నుండి కష్టపడి ఆహారం సేకరించడం అలవాటు చేసుకుంటుంది.

నీతి: ముందు చూపు చాలా అవసరం

ఇది కూడా చదవండి : సత్యదేవ్ తిమ్మరుసు హిట్టా / ఫట్టా.?