టెక్నాలజీ & గాడ్జెట్లులైఫ్ స్టైల్

Save Electricity Bill : అన్‌ప్లగ్ తో కరెంట్ బిల్ ను తగ్గించుకోండి

electricity bill
Save Electricity Bill : మిక్సీ, గ్రైండర్, మైక్రో ఒవెన్ అన్నీ కూడా పొదుపుగా వాడుతున్నాం కదా. అయినా ఇంత బిల్లా? అని ఆశ్చర్య పోతున్నారా?కరెంట్ ను ఎలా తగ్గించాలి? బిల్లు తక్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

దేవుడా.. ఈ నెల కరెంట్ బిల్ల్ (Electricity Bill) ఏంటి ఇంత వచ్చిందీ? అని భయపడుతున్నారా.? పెద్దగా వాడనూలేదు కదా..అయినా కూడా ఇంత వచ్చిందేంటి?.

మిక్సీ, గ్రైండర్, మైక్రో ఒవెన్ అన్నీ కూడా పొదుపుగా వాడుతున్నాం కదా. అయినా ఇంత బిల్లా? అని ఆశ్చర్య పోతున్నారా?కరెంట్ ను ఎలా తగ్గించాలి? బిల్లు (Electricity Bill) తక్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

electricity bill

మనం మనకు తెలియకుండానే కరెంటును అనవసరంగా ఖర్చు చేస్తున్నామన్న సంగతి అందరికి తెలియదు. అది కూడా అన్ని స్విచ్చులు ఆఫ్ చేసినా కూడా.

మొత్తం కరెంట్‌బిల్లు లో తక్కువలో తక్కువ ఒక శాతం పవర్ ఆఫ్ చేసిన ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్ వల్ల వస్తుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు, మనం టీవీ చూసాక రిమోట్ తో ఆఫ్ చేసి వేరే పనుల్లో మునిగిపోతాం, లేదా పడుకుంటాం.

రిమోట్ తో ఆఫ్ చేసినా స్విచ్చాఫ్ చేయకుండా వదిలేస్తాం. ఇలా చేయడం వల్ల స్టాండ్‌బై మోడ్ లోకి టీవీ వెళ్ళిపోతుంది.అలా వెళ్ళిన టీవీ రోజుకు సుమారు ఇరవై నాలుగు వాట్ల కరెంట్ ను తీసుకుంటుంది. ఇది మనకు మొదట్లో తక్కువే అనిపించినా ఇది ఇలాగే ప్రతీరోజూ జరిగితే చాలా కరెంట్ ఖర్చు అవుతుంది.

మొబైల్‌ఫోన్ ఛార్జర్:

మనలో చాలా మంది సెల్‌ఫోన్ ను ఎంత ఎక్కువ వాడుతామో ఛార్జింగ్ పెట్టేప్పుడు అంత నిర్లక్ష్యం చేస్తాం, ఛార్జింగ్ పెట్టినప్పుడు మధ్యలో ఫోన్ కాల్ వస్తే స్విచ్చాఫ్ చేయకుండా ఫోన్ తో మాట్లాడుతూ ఉంటాం. అలా ఛార్జింగ్ ప్లగ్ నుంచి ఛార్జర్ తీయకపోతే రోజుకి 1.3 వాట్ల కరెంట్ వృధా అవుతుంది. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ఛార్జర్ పాడవుతుంది కూడా..ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

electricity bill

వైఫై మోడెం:

వైఫై పరిధిలో నుంచి సెల్‌ఫోన్స్ గాని, ల్యాప్‌టాప్లుగాని దూరంగా ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలు ఇది ఆన్ లోనే ఉంటుంది. దీని వల్ల ఎంత కరెంటు ఖర్చు అవుతుందో చెప్పలేము గాని దానిని వాడనపుడు, రాత్రి పూట పడుకున్నప్పుడు దానిని ఆఫ్ చేయడమే కాకుండా దాని ప్లగ్గులు తీసేయడం చాల ఉత్తమం.

ఓవెన్స్:

electricity bill

ఈమధ్య కాలంలో దీని వాడకం బాగా పెరిగిపోయింది. ఈ ఓవెన్‌లు ఒక్క రోజులో 108 వాట్ల కరెంట్ ను లాగేస్తాయి.కాబట్టి వాటి అవసరం లేనప్పుడు ప్లగ్ ను తీసేయడం చాలా ఉత్తమం.

అదే విధంగా వాషింగ్ మెషీన్‌లు , హెయిర్ డ్రైయ్యర్‌లు, మిక్సర్‌లు, వెట్ గ్రైడర్‌లు , రైస్ కుక్కర్‌లు, టేబుల్ ఫ్యాన్‌లు, బ్లూ టూత్ స్పీకర్స్ ఆఫ్ చేయడం చాల ముఖ్యం. దీని వల్ల పవర్ సేవ్ అవుతుంది. ఇటీవల చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చాలా మంది ల్యాప్‌టాప్ లను వాడుతుంటారు. వారు వాటిని స్విచ్చాఫ్ చేసినా కూడా అన్‌ప్లగ్ చేయడం మరిచిపోతారు.

electricity bill

కావున పవర్ సేవింగ్ ఒక అవసరమే కాకుండా మనం దానిని ఒక బాధ్యతగా అనుకోవాలి. అలా చేస్తే కరెంట్ ఆదా అవుతుంది. మన భావి తరాలకు కూడా కరెంటును అందించిన వాళ్ళం అవుతాం.

దీని వల్ల కరెంట్ పరికరాలు పాడవకుండా ఎక్కువ రోజులు వచ్చేలా చేస్తుంది. ఇక ఇప్పటి నుండి అయినా అన్ ప్లగ్ చేయడం ప్రారంభిద్దాం, కరెంటును (Electricity Bill) ఆదా చేసి ఖర్చును తగ్గిద్దాం.

ఇది కూడా చదవండి : గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ లెవెల్ ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా?