లైఫ్ స్టైల్

Gas Level Checking : గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ లెవెల్ ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా?

Gas Level
Gas Level Checking  : ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే మీరే గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ లెవెల్ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.

మనం సాధారణంగా వంట చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ పెట్టి ఎన్ని రోజులయిందో, గ్యాస్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో, వంట మధ్యలో ఆగిపోతుందేమోనని భయపడుతుంటాం కదా…

Gas

మాములుగా మనం గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోడానికి గ్యాస్ (Gas) సిలిండర్ ఎత్తి దాని బరువు చూస్తూ ఉంటాం , గ్యాస్ సిలిండర్ ను ఆటూ ఇటూ కదిపి కూడా చూస్తూ ఉంటాం. అలా చూడడం చాలా కష్టమయిన పని అందరికి,  అలా కాకుండా గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత వరకు ఉందో,ఎలా చూడాలో అందరికి తెలియదు. కాని ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే మీరే గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ లెవెల్ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.

Gas

గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ లెవెల్ ఎలా తెలుసుకోవడానికి ఒక గిన్నెలో నీటిని తీసుకోండి, ఒక న్యాప్‌కిన్ తీసుకోని అది మొత్తం తడిసేలా నీటితో తడపాలి. ఆ న్యాప్‌కిన్ తడిసిన తరువాత ఆ నీటిని మొత్తం పిండేయాలి. తడిగా ఉన్న న్యాప్‌కిన్ తో గ్యాస్ సిలిండర్ మీద ఒక వైపు పైనుండి క్రింది వరకు తుడవాలి. తుడిచిన తరువాత నాలుగు, అయిదు నిమిషాలు ఆగాలి, ఈ ప్రక్రియ అంతా ఫ్యాన్ లేకుండా చేయాలి, ఫ్యాన్ ఉంటే తడి తొందరగా ఆరిపోతుంది. అప్పుడు మనకు గ్యాస్ లెవెల్ ఖచ్చితంగా తెలియదు.

నాలుగు, అయిదు నిమిషాలు తరువాత గ్యాస్ అయిపోయిన దగ్గర తడి తొందరగా ఆరిపోయి ఉంటుంది. కింద గ్యాస్ ఉన్న దగ్గర తడి ఉండి అది నెమ్మదిగా ఆరిపోతుంది, ఈ విధంగా నీటితో ఈజీగా గ్యాస్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

ఇది ఎలా సాధ్యం?

Gas Level

మన గ్యాస్ సిలిండర్ లో ఎల్‌పిజి గ్యాస్ 85% ద్రవ స్థితి లో ఉంటుంది. అనగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మిగతా ప్రాంతంలో ఎల్‌పిజి వాయు స్థితి లో ఉంటుంది. మనం గ్యాస్ (Gas) వాడుతున్నపుడు లిక్విడ్ గ్యాస్ ఆవిరి అయ్యి గ్యాస్ లాగా మారి బయటకి వస్తుంది. అప్పుడు మనకి గ్యాస్ వెలుగుతుంది.

ఈ విధంగా మనం సిలిండర్ మీద నీటిని పోస్తే లిక్విడ్ స్టేట్ లో ఉన్న గ్యాస్ వచ్చేసి పైన పోసిన నీటిలో వేడిని తగ్గిస్తుంది. అందుకని ఆ నీరు తొందరగా ఆవిరి అవదు. అదే గ్యాస్ స్టేట్ మీద నీటిని పోస్తే గ్యాస్ నీటిలోఉన్న వేడి ని పీల్చుకోదు కాబట్టి నీరు ఆవిరి అయిపోతుంది. దీని బట్టి గ్యాస్ లెవెల్ సులభంగా తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : పాత నోటు ఉంటే ఇక మీరు లక్షాధికారి అయినట్టే!