Goa Corona : గోవా ప్రభుత్వం ఆదివారం రాష్ట్రంలో కరోనా వైరస్ కర్ఫ్యూను మరో వారం ఆగస్టు 30 వరకు పొడిగించింది.
గోవా ప్రభుత్వం ఆదివారం రాష్ట్రంలో కరోనా వైరస్ (Goa Corona) కర్ఫ్యూను మరో వారం ఆగస్టు 30 వరకు పొడిగించింది. ఈ వారం లో మునుపటి ఆంక్షలు/సడలింపులు కొనసాగుతాయని జిఓ (GO) తెలిపారు.
గోవాలో శనివారం 122 తాజా COVID-19 కేసులు మరియు రెండు మరణాలు నమోదయ్యాయి, ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,088 కి ఉండగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,184 కు చేరుకుందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఈ రోజు మొత్తం 111 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని, ఈ రోజు డిశ్చార్జ్ అయినా వారితో కలిపి గోవాలో మొత్తము రికవరీల సంఖ్యను 1,68,989 చేరుకుంది, రాష్ట్రంలో 915 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. “ఈ రోజు నిర్వహించిన 5,483 కొత్త పరీక్షలతో కలిపి గోవాలో మొత్తం నిర్వహించిన పరీక్షల సంఖ్య 11,60,150 కి చేరుకుంది.
గోవా యొక్క కరోనా గణాంకాలు : పాజిటివ్ కేసులు 1,73,088, కొత్త కేసులు 122, మరణాల సంఖ్య 3,184, డిశ్చార్జ్ 1,68,989, యాక్టివ్ కేసులు 915, 11,60,150 వరకు నమూనాలను పరీక్షించారు.